700 మంది ఉద్యోగులను పీకేస్తున్న టెక్ దిగ్గజం
700 మంది ఉద్యోగులను పీకేస్తున్న టెక్ దిగ్గజం
Published Sat, Jan 21 2017 4:36 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
న్యూఢిల్లీ : బహుళ జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్లో మరికొన్ని రోజుల్లో 700 ఉద్యోగాలు హుష్ కాకి కానున్నాయి. వచ్చే వారంలో ప్రకటించబోయే ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఉద్యోగాల కోతను మైక్రోసాప్ట్ ప్రకటిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2017 జూన్ వరకు 2,850 ఉద్యోగాలకు కోత విధించబోతున్నామని మైక్రోసాప్ట్ ఇంతకమున్నుపే ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఈ నెలలో 700 మందికి కంపెనీ గుడ్ బై చెప్పనుందట.
2016 జూన్ 30 వరకు మైక్రోసాప్ట్లో 1,14,000 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను జనవరి 26న గురువారం ప్రకటించనుంది. థామ్సన్ రాయిటర్స్ అంచనాల ప్రకారం కంపెనీ 25.27 బిలియన్ డాలర్ల రెవెన్యూ ఆర్జిస్తుందని తెలుస్తోంది. 2013లో నోకియాను సొంతం చేసుకున్న అనంతరం స్మార్ట్ ఫోన్ బిజినెస్లో పనిచేస్తున్న 25వేలకు పైగా ఉద్యోగులను మైక్రోసాప్ట్ పీకేసింది. ఈ ఉద్యోగాల కోత లక్ష్యం వివిధ యూనిట్లలో స్కిల్స్ను అప్డేట్ చేయడమేనని బిజినెస్ ఇన్సైడర్ రిపోర్టు చేసింది.
Advertisement
Advertisement