బెంగుళూరు: వాహనాలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత లోకల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే అంతకంటే మరో సౌకర్యం లేదనే స్థితికి చేరుకున్నారు నగరాల్లో నివసించేవారు. కానీ ఆ సౌకర్యంలో అసౌకర్యం కలిగితే ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశాడు ఓ బెంగుళూరు వాసి. కేవలం 45 నిముషాల ప్రయాణానికి అతను 225 నిముషాలు ఎదురుచూడాల్సి వచ్చింది.
అర్జెంటు పని ఏదైనా ఉండి ఏమాత్రం ఆయాస పడకుండా బయటకు వెళ్లాలంటే ఇప్పుడు బోలెడన్నీ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఆన్‌లైన్‌లో వాహనాన్ని బుక్ చేసుకుని శరీర అలసట లేకుండానే రివ్వున గమ్యస్థానం చేరుకోవచ్చు. వాహనాన్ని బుక్ చేసుకునే సమయంలో కూడా తొందరగా వచ్చే వాహనాలనే ఎంచుకుని మరీ బుక్ చేసుకుంటాము.
కానీ బెంగుళూరులో ఓ వ్యక్తికి ఈ ఆన్‌లైన్ సేవలో చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడోలో వాహనాన్ని బుక్ చేసుకున్న అతడు కేవలం 45 నిముషాల ప్రయాణం కోసం 225 నిముషాలు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా బెంగుళూరు ట్రాఫిక్ కథనాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాము. అలాంటి బెంగుళూరు ట్రాఫిక్ లో ప్రయాణించాలంటే ఆమాత్రం సమయం వెయిటింగ్ చేయక తప్పదు మరి.
దీంతో విసుగొచ్చిన ఆ యువకుడు ఈ చోద్యాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో వెయిటింగ్ సమయాన్ని చూపిస్తున్న మొబైల్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది కామెంట్ల రూపంలో ఈ పోస్ట్ కు విశేష స్పందన లభించింది. ఆ వెయిటింగ్ సమయంలో ఎంచక్కా ఎక్కువ నిడివి ఉన్న హాలీవుడ్ సినిమా చూసి రావచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు.
Rapido wait time getting out of hand. 😭
— deyalla (@deyalla_) August 1, 2023
Gotta wait for more than 3.7 hours for 45 minutes travel. @peakbengaluru
#rapido #Bengaluru #peakbengaluru pic.twitter.com/7xPO3cBkPz
ఇది కూడా చదవండి: అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి..
Comments
Please login to add a commentAdd a comment