న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బైక్-ట్యాక్సీ సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థలు ర్యాపిడో, ఉబర్‌లకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ సంస్థలు అందించే సేవలను నిషేదిస్తూ ఢిల్లీ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ర్యాపిడో,ఉబర్ సంస్థలు హైకోర్టుకు వెళ్లగా.. వీటి సర్వీసులను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఉత్వర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
వివరాల్లోకి వెళితే.. ర్యాపిడో, ఉబెర్‌లు మోటార్ వాహనాల చట్టం-1988ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో బైక్-ట్యాక్సీ సేవలను నిషేధించింది. ద్విచక్ర వాహనాలేతర రవాణాపై పరిపాలన ద్వారా తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లు, ర్యాపిడో, ఉబర్‌లను దేశ రాజధానిలో తమ సర్వీసులు నిలిపివేయాలని తెలిపింది.
[BREAKING] Supreme Court stays bike taxi operations of Rapido, Uber in Delhi
— Bar & Bench (@barandbench) June 12, 2023
Read more here: https://t.co/NdU2GfNFWI pic.twitter.com/FCcmpELJif
అయితే ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని కోరుతూ ఢిల్లీ హైకోర్టు మే 26న ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆప్ ప్రభుత్వం ఈ అంశంపై.. జులై ఆఖరికల్లా కొత్త విధానాన్ని తీసుకొస్తామని తమ వాదనను వినిపించగా... జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందల్ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
చదవండి: Cyclone Biparjoy Updates: అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపర్‌జోయ్
Comments
Please login to add a commentAdd a comment