ర్యాపిడో, ఉబర్ క్యాబ్స్, ఓలా రైడ్స్ వంటివి కస్టమర్ల నుంచి నిర్ణీత ధర కంటే ఎక్కువ డబ్బు వసూలు చేసిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 21 కి.మీ దూరంలో ఉన్న తొరైపాక్కం వరకు వెళ్లడానికి ర్యాపిడో ఏకంగా రూ.1,000 వసూలు చేసినట్లు ఏజే స్కిల్ డెవలప్‌మెంట్ అకాడమీ ఫౌండర్ అండ్ సీఈఓ 'అశోక్ రాజ్ రాజేంద్రన్' వెల్లడించారు. 21 కిలోమీటర్లకు ఛార్జ్ రూ. 350 మాత్రమే. కానీ ర్యాపిడో మూడు రెట్లు డబ్బు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదని అన్నాడు.
ఈ సమస్య గురించి ర్యాపిడోకు తెలియజేసినప్పటికీ.. డ్రైవర్ చర్యల గురించి కూడా అడగకుండా చాట్‌ను ముగించారని, రాపిడో కస్టమర్ కేర్ సర్వీస్‌పై సీఈఓ నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు త్వరలోనే తగిన గుణపాఠం ఎదురవుతుందని వెల్లడించాడు.
ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..
ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి అనుభవాలు ఎదురైనా పలువురు నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ర్యాపిడోలో ఇలాంటివి చాలాసార్లు ఎదురయ్యాయని చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్లు.. కస్టమర్లను మోసం చేయడం ప్రారంభించారని మరికొందరు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment