చాదర్‌ఘాట్ (హైదరాబాద్ సిటీ) : హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఉస్మానియా లా కాలేజ్ వద్ద గత నెల 17న చైన్‌స్నాచర్ దాడిలో సునీత ( 40 ) అనే మహిళ తీవ్రంగా గాయపడి మరణించిన ఉదంతం మరువకముందే అలాంటి సంఘటనే మలక్పేటలో చోటు చేసుకుంది.
మలక్‌పేట ఫ్లైఓవర్‌పై మంగళవారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. మలక్‌పేటకు చెందిన భార్యాభర్తలు నాంపల్లిలో ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు దుండగులు వారిని బైక్ పై వెంబడించారు. మహిళ మెడలోని నాలుగు తులాల గొలుసును బలంగా లాక్కుని ఉడాయించారు. ఈ ఘటనలో వర్థనమ్మ అనే మహిళ బైక్‌పై నుంచి కిందపడిపోయింది. ఆమె తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అమెను యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చాదర్‌ఘాట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.