న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వెరసి రెండు దశాబ్దాల తదుపరి ఆటోరంగ కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానుంది.
కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 9,51,91,195 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఓసీటీ ఏర్పాటు చేస్తున్న ఓలా గిగాఫ్యాక్టరీ కోసం పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment