Draft plan
-
సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు!
ఏపీ రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ఒక సరికొత్త ప్రయోగం ప్రారంభమైంది. కరువును తట్టుకునే ప్రత్యేక పద్ధతి (డ్రాట్ ప్రూఫింగ్ మోడల్)లో పంటలు సాగు జరుగుతోంది. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, బీడు భూముల్లో కూడా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని పలువురు చిన్న, సన్నకారు రైతులు నిరూపిస్తున్నారు. పొలం మొత్తాన్నీ దుక్కి చేయకుండా.. ప్రతి 3 అడుగుల దూరంలో ఒక అడుగు భూమిని తవ్వి 5 రకాల పంట విత్తనాలను విత్తుతున్నారు. 2023 ఆగస్టులోప్రారంభమైన ఈ సరికొత్త పద్ధతిలో అనేక జిల్లాలకు చెందిన 56 మంది రైతులు 20 సెంట్ల నుంచి ఎకరా విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫ్ సాగు చేస్తున్నారు. ఇద్దరు రైతుల అనుభవాలతో కూడిన కథనం.. కాలువ రాకపోయినా పంట వచ్చింది.. రైతు ఆదిలక్ష్మి ఇలా చెప్పారు.. ‘‘మాకు అరెకరం పొలం ఉంది. ఇక్కడ అందరూ మిరపే వేస్తారు. మేమూ మిరపే వేసేవాళ్లం. రెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మిరపలో అంతరపంటలు కూడా సాగు చేశాం. సాగర్ కాలువ నుంచి ఇంజన్‌తో తోడుకొని తడి పెట్టేవాళ్లం. గత ఏడాది 7 క్వింటాళ్లు ఎండు మిరప పండింది. రూ. 50 వేల నికారాదాయం వచ్చింది. వర్షాలు లేక ఈ సంవత్సరం కాలువ ఒక్కసారే వచ్చింది. అందుకని మిరప వేయలేదు. ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు.. కరువును తట్టుకొని పండే డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు పెట్టాం. ఈ పంటలకు ముందు మేలో నవధాన్య (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) పంటలు చల్లాం. వర్షం లేక సరిగ్గా మొలవలేదు. మళ్లీ జూలైలో వేశాం. వర్షానికి మొలిచింది. పెరిగినాక కోసి, గొడ్లకు మేతగా వాడుకున్నాం. వరుసగా మూడేళ్లుగా నవధాన్య పంటలు వేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే.. భూమి బాగా గుల్లబారింది. నవధాన్య పంటలు వేయని పక్క పొలంలోకి వెళ్లి మట్టి చేత్తో తీయాలంటే చాలా కష్టపడాలి. మా పొలంలో సులువుగానే మట్టి తీయొచ్చు. పొలం దున్నకుండానే, 3 అడుగులకు ఒక చోట అడుగు నేలను గుల్లగా తవ్వి, గత ఏడాది అక్టోబర్ 27న 5 రకాల విత్తనాలు నాటుకున్నాం. ప్రధాన పంటగా మధ్యలో ఆముదం లేదా కందిని నాటాం. దానికి నాలుగు వైపులా చిక్కుడు, అలసంద, అనుములు, సజ్జలు విత్తుకున్నాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తన గుళికలు తయారు చేసుకొని నాటుకున్నాం. సీడ్ పెల్లటైజేషన్ చేయటం వల్ల భూమిలో విత్తుకున్న తర్వాత మొలక శాతం బాగుంటుంది. ఒకవేళ వర్షం రాకపోయినా లేదా మనం నీళ్లు పెట్టటం లేటైనా ఆ విత్తనం చెడిపోకుండా ఉంటుందని పెల్లటైజేషన్ చేశాం. విత్తనం పెట్టిన కొద్ది రోజులకు తుపాను వానకు విత్తనాలు మొలిచాయి. విత్తనం పెట్టేటప్పుడు అరెకరంలో 200 కిలోల ఘనజీవామృతం వేశాం. రెండుసార్లు ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. తర్వాత మరో రెండు సార్లు వాన వచ్చింది. అదే వాన సరిపోయింది. మిరపకు ఈ పంటలకు చాలా తేడా ఉంది. మిరపకు రెండు రోజులు నీరు లేకపోతే వడపడిపోయి ఎండిపోతుంది. డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు అలా కాదు. నీరు లేకపోయినా చాలా వరకు జీవ కళ ఉంటుంది. అదీకాక, మేం చేసిన విత్తన గుళికలుగా చేసి వేసినందు వల్ల, భూమిలో వేసిన ఘనజీవామృతం వల్ల, ద్రవ జీవామృతం పిచికారీ వల్ల పంటలు ఎదిగాయి. ప్రధాన పంటతో పాటు పెట్టిన అనుములు, చిక్కుళ్ల వల్ల ఉపయోగం ఏమిటంటే.. ఈ తీగలు పాకి నేలపై ఎండపడకుండా కప్పి ఉంచి కాపాడటం, భూమిలో తేమ ఆరిపోకుండా కాపాడింది. సజ్జ ద్వారా రూ. 8,000లు వచ్చాయి. సజ్జ ఇంకా తీయాల్సి ఉంది. చిక్కుళ్లు,సొర కాయలు, దోసకాయల ద్వారా మరో ఆరేడు వేలు ఆదాయం వచ్చింది. సజ్జ బాగా పెరగటంతో నీరు లేక కంది సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికి అన్నీ కలిపి రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా ఆముదాలు ఒక బస్తా వరకు వస్తాయి. పనులు మేమే చేసుకుంటాం. ఖాళీ ఉన్న రోజుల్లో కూలికి వెళ్తాం. బెట్టను తట్టుకొని పంట పండించుకోవచ్చని, ఎంతో కొంత దిగుబడి వస్తుందని నాకైతే నమ్మకం కుదిరింది..’’ – ఎం. ఆదిలక్ష్మి (83091 18867), ఈపూరు, పల్నాడు జిల్లా బీడులోనూ పంటలు.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాళ్ళ గ్రామానికి చెందిన రంగస్వామి బిఎస్సీ బీఈడీ చదువుకొని తమ రెండెకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్వవసాయం చేస్తున్నారు. ఒక ఎకరంలో సపోట, మామిడి చెట్లు ఉన్నాయి. మరో ఎకరంలో టొమాటో, మిర్చి, వంగ, గోరుచిక్కుడు పంటలను బోరు నీటితో సాగు చేశారు. రెండో పంటగా వేరుశనగ, కంది, ముల్లంగి తదితర పంటలు వేశారు. రెండెకరాల్లో సగటున ఏడాదికి రూ. లక్షా 70 వేల వరకు నికరాదాయం పొందుతున్నట్లు తెలిపారు. సపోట, మామిడి తోటలో మూడు ఏళ్లుగా దుక్కి చేయని 30 సెంట్ల విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫింగ్ మోడల్లో 2023 డిసెంబర్లో ప్రయోగాత్మకంగా సజ్జ, గోరు చిక్కుడు, అనుములు, అలసంద, కంది, ఆముదం పంటలను సాగు చేశారు. 3 అడుగుల దూరంలో ఒక అడుగు విస్తీర్ణంలో తవ్వి, ఘనజీవామృతం వేసి విత్తనాలు విత్తారు. మామిడి ఆకులతో ఆచ్ఛాదన చేశారు. వారానికోసారి బక్కెట్లతో పాదికి 2,3 లీటర్ల నీరు పోశారు. మూడు నెలల వ్యవధిలో అలసంద, అనుములు అమ్మితే రూ. 2 వేల దాకా ఆదాయం వచ్చింది. పశుగ్రాసం రూపంలో మరో రూ. 3 వేల ఆదాయం వచ్చింది. రూ. 2 వేల గోరుచిక్కుళ్లు పండాయి. తమ ఇంటి కోసం, బంధువులకు వినియోగించారు. సజ్జ పక్షులు తిన్నాయి. కంది, ఆముదం పంటలు కోయాల్సి ఉంది. పంటలకు నీరు పోస్తున్నందున మొక్కల మధ్యన 3 అడుగుల ఖాళీలో గడ్డి పెరుగుతోంది. ఆ గడ్డిని కోసి ఆవులు, గేదెలకు వేస్తున్నారు. డ్రాట్ ప్రూఫింగ్ మోడల్ పంటలతో వదిలేసిన భూమిని దుక్కి చేయకుండానే.. పంటలు పెట్టుకునే చోట తవ్వి విత్తనాలు పెట్టుకొని తిరిగి సాగులోకి తెచ్చుకోవచ్చని, ఎంతో కొంత పంట దిగుబడి తీసుకోవచ్చని రంగస్వామి అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రంగస్వామి పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. నేల గుల్లబారి మృదువుగా తయారవడంతో వర్షాలు తగ్గినా పంట పెరగుదల బాగా కనిపిస్తోంది. రంగస్వామి ప్రకృతి వ్యవసాయం చూసి రంగస్వామి (88869 60609) తండ్రి కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం. -
ఐపీఓకి ఓలా... సెబీకి దరఖాస్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వెరసి రెండు దశాబ్దాల తదుపరి ఆటోరంగ కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానుంది. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 9,51,91,195 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఓసీటీ ఏర్పాటు చేస్తున్న ఓలా గిగాఫ్యాక్టరీ కోసం పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనుంది. -
గూగుల్, అమెజాన్‌లకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : స్ధానిక స్టార్టప్‌లకు ఊతమివ్వడం, ఈ కామర్స్ నియంత్రణ సంస్థ ఏర్పాటు వంటి అంశాలతో ఈ కామర్స్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాల ప్రాబల్యానికి ముకుతాడు వేసేలా ఈకామర్స్ ముసాయిదాకు ప్రభుత్వం తుదిరూపు ఇస్తోంది. నూతన నిబంధనల ప్రకారం ఈ కామర్స్ కంపెనీలు 72 గంటల్లోగా ప్రభుత్వం కోరిన డేటాను అందుబాటులోకి తీసుకురావాలి. జాతీయ భద్రత, పన్నులు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై సత్వరమే ఆయా సంస్థలు సమాచారం అందించాల్సి ఉంటుంది. సమాచార వనరులు అందరికీ అందుబాటులోకి తీసుకువస్తూ పరిశ్రమలో పోటీయుత వాతావరణం నెలకొనేలా ఈ కామర్స్ రెగ్యులేటర్‌ను నియమించనున్నట్టు 15 పేజీలతో కూడిన ఈ ముసాయిదాలో ప్రభుత్వం పేర్కొందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. విధాన ముసాయిదాను వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించింది. ముసాయిదాలో పొందుపరిచిన ప్రతిపాదిత నియమాలు ఆన్లైన్ కంపెనీల సోర్స్ కోడ్లు మరియు అల్గారిథమ్‌లను ప్రభుత్వం పర్యవేక్షించే వెసులుబాటును కల్పిస్తుంది. ఈ-కామర్స్ వ్యాపారాలకు వివరించదగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నదో..లేదో తెలుసుకునే అవకాశాన్నీ ముసాయిదా ప్రస్తావించనుంది. 50 కోట్ల యూజర్లతో దేశ డిజిటల్ ఎకానమీ ఎదుగుతున్న క్రమంలో ఆన్లైన్ రిటైల్ నుంచి కంటెంట్ స్ట్రీమింగ్, డిజిటల్ చెల్లింపుల వరకూ ప్రతి రంగంలో గ్లోబల్ దిగ్గజాల ప్రాబల్యం పెరిగిపోగా స్ధానిక స్టార్టప్‌లు ప్రభుత్వ సాయం కోసం అభ్యర్థిస్తున్నాయి.ప్రభుత్వం ఇటీవల చైనా యాప్‌లను నిషేధించిన క్రమంలో దేశీ కంపెనీలు ఈ రంగంలో ఎదిగేందుకు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని కోరుతున్నాయి. విదేశీ సాంకేతిక దిగ్గజాలను నియంత్రించేలా రూపొందిన ఈ కామర్స్ విధాన ముసాయిదాను త్వరలో ప్రజాభిప్రాయం కోసం ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచనున్నారు. డిజిటల్ గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ భారత వినియోగదారునికి, స్ధానిక ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చేలా ముసాయిదా విధానం రూపొందింది. చదవండి : అమెజాన్‌లో వారికి భారీ ఊరట -
‘కావేరి’ ప్రణాళికను ఆపలేం
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపిణీ ముసాయిదా ప్రణాళిక ఆమోదాన్ని వాయిదా వేయాలన్న కర్ణాటక అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రణాళికను తయారుచేయాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఆదేశించామనీ, రాష్ట్రాలకు ఈ విషయంతో సంబంధం లేదని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశానుసారం కావేరి జలాల పంపిణీ ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ధర్మాసనానికి సమర్పించింది. దీనిపై కర్ణాటక తరఫు న్యాయవాది దివాన్ తన వాదనలు వినిపిస్తూ ‘ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. రాబోయే 15 ఏళ్ల వరకు ఈ నీటి పంపకాలు అమల్లో ఉంటాయి. కాబట్టి కొత్త ప్రభుత్వ సూచనలను నివేదించేందుకు జూలై తొలివారం వరకు సమయం అవసరం. అప్పటివరకు ముసాయిదాను ఆమోదించకండి’ అని ధర్మాసనాన్ని కోరారు. తమిళనాడు న్యాయవాది శేఖర్ కర్ణాటక అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూలై వరకు ఆగితే జూన్‌లో తమ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల సంగతేమిటని ప్రశ్నించారు. కోర్టు జోక్యం చేసుకుంటూ రాష్ట్రాలకు ఈ అంశంలో పాత్ర లేదనీ, ఫిబ్రవరి 16 నాటి తీర్పు ప్రకారం ప్రణాళికను కేంద్రం రూపొందిస్తే తాము ఆమోదిస్తామంది. కేంద్రానికి ఆ అధికారం వద్దు: భవిష్యత్తులో అవసరమైనప్పుడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వాటాను మార్చే అధికారాన్ని తనవద్దే పెట్టుకుంటూ కేంద్రం ఈ ముసాయిదాను తయారుచేసింది. దీనిపై తమిళనాడు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ నిబంధనను మార్చాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
అమరావతి మాస్టర్‌ప్లాన్ సిద్ధం
నేడు విడుదల చేస్తామన్న మంత్రి నారాయణ సాక్షి, హైదరాబాద్: అమరావతి ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంత్రితో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుతో గురువారం సమావేశమై అమరావతి మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం సింగపూర్‌కు చెందిన సుర్బానా సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్, పర్స్పెక్టివ్ ప్లాన్ సమర్పించిందన్నారు. దానికి సీఎం స్వల్ప మార్పులు సూచించారని తెలిపారు. వీటిని సవరించి వెంటనే మాస్టర్‌ప్లాన్, పర్స్పెక్టివ్ ప్లాన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ఆదేశించినట్టు ఆ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ముసాయిదా ప్రణాళిక నోటిఫై చేసిన తర్వాత 30 రోజుల్లోగా ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని అన్నారు. ఆ తర్వాత రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయింపు ప్రక్రియ మొదలవుతుందన్నారు. కాగా ఉన్నతాధికారులు మాత్రం మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్ ఈనెల 26న లేదా 28న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.