అమరావతి మాస్టర్‌ప్లాన్ సిద్ధం | Amaravati capital plan to be notified soon | Sakshi
Sakshi News home page

అమరావతి మాస్టర్‌ప్లాన్ సిద్ధం

Published Fri, Dec 25 2015 3:51 AM | Last Updated on Fri, May 25 2018 7:10 PM

Amaravati capital plan to be notified soon

నేడు విడుదల చేస్తామన్న మంత్రి నారాయణ
సాక్షి, హైదరాబాద్: అమరావతి ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంత్రితో పాటు సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుతో గురువారం సమావేశమై అమరావతి మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం సింగపూర్‌కు చెందిన సుర్బానా సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్, పర్‌స్పెక్టివ్ ప్లాన్ సమర్పించిందన్నారు. దానికి సీఎం స్వల్ప మార్పులు సూచించారని తెలిపారు.

వీటిని సవరించి వెంటనే మాస్టర్‌ప్లాన్, పర్‌స్పెక్టివ్ ప్లాన్‌ల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ఆదేశించినట్టు ఆ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ముసాయిదా ప్రణాళిక నోటిఫై చేసిన తర్వాత 30 రోజుల్లోగా ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని అన్నారు. ఆ తర్వాత రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయింపు ప్రక్రియ మొదలవుతుందన్నారు. కాగా ఉన్నతాధికారులు మాత్రం మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్ ఈనెల 26న లేదా 28న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement