గృహ నిర్మాణాలపై మంత్రి నారాయణ సమీక్ష
గృహ నిర్మాణాలపై మంత్రి నారాయణ సమీక్ష
Published Tue, Jun 13 2017 5:17 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
అమరావతి: గృహ నిర్మాణాలపై ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ పేదలకు లక్షా 93 వేల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. సొంత స్థలం ఉన్నవారికి రూ. రెండున్నర లక్షలు, భూమి లేనివారికి రూ. మూడు లక్షలు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. జీ ప్లస్ 3 విధానంలో మూడు రకాలుగా ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. షెర్వాల్ టెక్నాలజీ తో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement