సరికొత్తగా హోండా యాక్టివా 125 | Honda launches 2025 Activa 125 at Rs 94422 | Sakshi
Sakshi News home page

సరికొత్తగా హోండా యాక్టివా 125

Published Sun, Dec 22 2024 12:46 AM | Last Updated on Sun, Dec 22 2024 7:51 AM

Honda launches 2025 Activa 125 at Rs 94422

గురుగ్రామ్‌: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తాజాగా అధునాతన ఫీచర్లతో సరికొత్త యాక్టివా 125 స్కూటర్‌ను విడుదల చేసింది. రూ.94,422 ధరతో డీఎల్‌ఎక్స్, రూ.97,146 ధరతో హెచ్‌–స్మార్ట్‌ అనే రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. బ్లూటూత్‌ అనుసంధానంతో 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే కలిగి ఉంది. 

123.99 సీసీ సామర్థ్యం కలిగిన సింగిల్‌ సిలిండర్‌ పీజీఎం–ఎఫ్‌ఐ ఇంజిన్‌తో తయారైంది. ఇది 6.20 కిలోవాట్ల శక్తిని, 10.5ఎన్‌ఎం టార్క్‌ విడుదల చేస్తుంది. యూఎస్‌బీ టైప్‌–సీ చార్జింగ్‌ సదుపాయం ఉంది. పర్ల్‌ ఇగ్నోస్‌ బ్లాక్, మాట్‌ యాక్సిస్‌ గ్రే మెటాలిక్, పర్ల్‌ డీప్‌ గ్రౌండ్‌ గ్రే, పర్ల్‌ సిరెన్‌ బ్లూ, రెబల్‌ రెడ్‌ మెటాలిక్, పర్ల్‌ ప్రీసియఎస్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ సరికొత్త 2025 హోండా యాక్టివా 125 స్కూటర్‌ దేశవ్యాప్తంగా అన్ని డీలర్ల వద్ద అందుబాటులో ఉందని హెచ్‌ఎంఎస్‌ఐ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement