ఖమ్మం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామం సమీపంలోని బ్రిడ్జిపై నుంచి బైక్ పడిపోయిన ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు.
ఖమ్మం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామం సమీపంలోని బ్రిడ్జిపై నుంచి బైక్ పడిపోయిన ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు. కరీంనగర్ జిల్లా ముకునూరు గ్రామానికి చెందిన భార్యా భర్తలు బైక్‌పై ఖమ్మం జిల్లా మణుగూరుకు సోమవారం వెళుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సరిహద్దులో దుగినేపల్లి సమీపంలోని వాగుపై ఉన్న బ్రడ్జిపైకి రాగా... బైక్ అదుపుతప్పి కిందకు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.