ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం | Road Accident in Khammam District | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Published Wed, Feb 6 2019 9:35 AM | Last Updated on Wed, Feb 6 2019 2:16 PM

Road Accident in Khammam District - Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఓ ఫంక్షన్‌కు ముదిగొండ వెళ్లి వస్తుండగా వారు వెళ్తున్న బైక్‌ను.. అర్ధరాత్రి సమయంలో నేలకొండపల్లి చెరువుకట్ట నక్కల తూము వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. నేలకొండపల్లి డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీకి చెందిన పాలపాటి వెంకటేశ్వర్లు, అతని తల్లి పిచ్చమ్మ, అతని ఇద్దరి కుమారులు 8 ఏళ్ల కోదండరామ్‌, 6 ఏళ్ల ప్రణయ్‌ ఈ ఘటనలో మృతిచెందారు. జరిగిన ఘోరం తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement