అతి స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్‌ ధరలు | Oil Companies Slashed Fuel Rates | Sakshi
Sakshi News home page

అతి స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్‌ ధరలు

Published Sun, Aug 22 2021 11:45 AM | Last Updated on Sun, Aug 22 2021 11:52 AM

 Oil Companies Slashed Fuel Rates - Sakshi

హైదరాబాద్‌: పెట్రోలు ధరల నుంచి వినియోగదారులకు చమురు కంపెనీలు స్వల్ప ఉపశమనం కలిగించాయి. 36 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత లీటరు పెట్రోలు, డీజిల్‌లపై కేవలం 20 పైసల వంతున ఛార్జీలు తగ్గించాయి. అంతకు ముందు వరుసగా మూడు రోజుల పాటు రోజుకు 20 పైసల వంతున మొత్తం 60 పైసల వరకు లీటరు డీజిల్‌ ధరను తగ్గించాయి. మొత్తంగా డీజిల్‌ ధర 80 పైసలు, పెట్రోలు ధర  20 పైసల వంతున తగ్గింది.

పశ్చిమ బెంగాల్‌తో పాటు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మే నుంచి జులై 16 వరకు రోజు విడిచి రోజు అన్నట్టుగా పెట్రోలు ధరలు పెరిగాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిపోవడంతో ధరల పెరుగుదలకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 60 డాలర్లకు దిగువన నిలకడగా ఉండటంతో చమురు కంపెనీలు స్వల్పంగా పెట్రోలు, డీజిల్‌ రేట్లు తగ్గించాయి. తగ్గిన ధరతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 105.60గా లీటరు డీజిల్‌ ధర రూ. 97.15లుగా ఉంది.

చదవండి: టాటా మోటార్స్‌ నుంచి మైక్రో ఎస్‌యూవీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement