
వారణాసి: త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి వ్యక్తం చేశారు. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూడగా, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయి. అదే సమయంలో డీజిల్‌పై అవి ఇప్పటికీ నష్టపోతున్నాయి.
గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను సవరించడం లేదు. ఈ నష్టాలు ముగింపునకు రాగానే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలు తగ్గుతాయని పురి అన్నారు.
అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలుగా వ్యవహరించాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment