deisel
-
పండగనాడు వదల్లేదు.. మళ్లీ బాదేశారు
Petrol Prices : పండగ పబ్బం అనే తేడా లేకుండా చమురు కంపెనీలు ప్రజలపై భారం మోపుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చీమ చిటుక్కుమంటే చాలు ఆ ప్రభావం ఇక్కడి ప్రజలపై కనిపించేలా నిర్ణయాలు తీసుకుంటుంది. లీటరు పెట్రోలుపై 36 పైసలు, లీటరు డీజిల్‌పై 38 పైసల వంతున ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.109.33కి చేరుకోగా డీజిల్ ధర రూ.102.38 పైసలుగా నమోదు అయ్యింది. 15 రోజులు 13 సార్లు అక్టోబరు నెల వచ్చింది మొదలు పెట్రోలు ధర పిడుగులు సామాన్యుల నెత్తిపై పడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం సాకుగా చూపుతూ గడిచిన 15 రోజుల్లో 13 సార్లు పెట్రోలు ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో ఈ నెలలోనే దాదాపు లీటరు పెట్రోలు ధర ఐదు రూపాయలు, డీజిల్ ధర నాలుగు రూపాయల వరకు పెరిగినట్టయ్యింది. కేవలం అక్టోబరు 12, 13 తేదీల్లోనే పెట్రోలు ధరల పెంపు నుంచి సామాన్యులు తప్పించుకున్నారు. ఐదు నెలల్లో రూ.12 బెంగాల్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన ఐదు నెలల్లో చమురు కంపెనీలు పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలలోనే రెండు వారాల పాటు ఈ ధరాఘాతం నుంచి విముక్తి లభించింది. మిగిలిన ఐదు నెలల కాలంలో రోజు విడిచి రోజు లేదా వారానికి రెండు మూడు సార్లయినా ధరలు పెంచాయి చమురు కంపెనీలు. మొత్తంగా గడిచిన ఐదు నెలల్లో లీటరు పెట్రోలు ధర రూ.11.44 పెరగగా లీటరు డీజిల్ ధర రూ.9.14 పెరిగింది. -
అతి స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
హైదరాబాద్: పెట్రోలు ధరల నుంచి వినియోగదారులకు చమురు కంపెనీలు స్వల్ప ఉపశమనం కలిగించాయి. 36 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత లీటరు పెట్రోలు, డీజిల్‌లపై కేవలం 20 పైసల వంతున ఛార్జీలు తగ్గించాయి. అంతకు ముందు వరుసగా మూడు రోజుల పాటు రోజుకు 20 పైసల వంతున మొత్తం 60 పైసల వరకు లీటరు డీజిల్ ధరను తగ్గించాయి. మొత్తంగా డీజిల్ ధర 80 పైసలు, పెట్రోలు ధర 20 పైసల వంతున తగ్గింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మే నుంచి జులై 16 వరకు రోజు విడిచి రోజు అన్నట్టుగా పెట్రోలు ధరలు పెరిగాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోవడంతో ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 60 డాలర్లకు దిగువన నిలకడగా ఉండటంతో చమురు కంపెనీలు స్వల్పంగా పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించాయి. తగ్గిన ధరతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 105.60గా లీటరు డీజిల్ ధర రూ. 97.15లుగా ఉంది. చదవండి: టాటా మోటార్స్ నుంచి మైక్రో ఎస్యూవీ -
డీజిల్ రేట్లలో కోత.. 20 పైసల తగ్గింపు
హైదరాబాద్ : గత కొంత కాలంగా ధరలు పెంచడమే తప్ప తగ్గించడం తెలియదు అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ పోతున్న చమురు కంపెనీలు శాంతించాయి. నెల రోజులగా పెట్రోలు, డీజిల్ ధరలు నిలకడగా ఉండటంతో కొంత తేరుకుంటున్న సామాన్యులకు మరో ఉపశమనం కలిగించాయి. లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ మార్పు చోటు చేసుకుంది. అయితే పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర రూ.97.96లు ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.74లుగా ఉంది. అంతకు ముందు ఆగస్టు 8వ తేదిన సైతం డీజిల్ రేటు 14 పైసలు తగ్గింది. అంతకు ముందు ఈ నెలలో అత్యధిక ధరగా రూ.98.10 డిజిల్ ధర ఉంది. -
తెలుగుగడ్డపై సెంచరీ దాటిన డీజిల్
హైదరాబాద్ : పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయంటూ మరోసారి ధరలు పెంచాయి చమురు కంపెనీలు. ఈసారి లీటరు పెట్రోలుపై రూ. 43 పైసలు, లీటరు డీజిల్‌పై రూ. 34 పైసుల వంతున ఛార్జీలు పెంచాయి. ఇలా వరుసగా పెరుగుతున్న ధరలతో తెలుగు గడ్డపై లీటరు డీజిల్ ధర సెంచరీ దాటింది. ఏపిలో చిత్తూరు జిల్లాలో లీటరు డీజిల్ ధర రూ. 100.25కి చేరుకుంది. ఇక్కడ పెట్రోలు ధర 107.82గా ఉంది. మిగిలిన జిల్లాలలో సెంచరీకి చేరువగా వచ్చింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 104.93, లీటరు డీజిల్ 98.02గా ఉంది. ఇదే అత్యధికం జులైలో నెలలో ఇప్పటి వరకు ఆరు సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. గరిష్టంగా లీటరు పెట్రోలుపై 36 పైసలు అత్యధికంగా ధర పెరిగింది. కానీ శనివారం పెరిగిన ధరల్లో లీటరు పెట్రోలుపై 43 పైసల వంతున ధర పెంచారు. ఇంకా పెరగొచ్చు ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. -
భగ్గుమన్న పెట్రోల్ ధరలు
ముంబై: పెట్రోలు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఒక్క రోజుగ గ్యాప్ ఇచ్చి మరోసారి పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచాయి చమురు కంపెనీలు. బుధవారం రోజు లీటరు పెట్రోలుపై రూ. 35 పైసలుచ డీజిల్‌పై 23 పైసల వంతున ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ రూ104.20; డీజిల్ రూ.97.64 పైసలకు చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో కూడా లీటరు పెట్రోలు ధర రూ. 100ను దాటింది. మెట్రో సిటీల్లో లీటరు పెట్రోలు ధర వందకు చేరుకున్న చివరి నగరంగా ఢిల్లీ నిలిచింది. డీజిల్‌పై 23 పైసలు సోమవారం ఆయిల్ కంపెనీలు కేవలం పెట్రోలు ధరను మాత్రమే పెంచి డీజిల్ ధరలు పెంచకుండా ఉపశమనం కలిగించాయి. కానీ ఆ ఆనందం ఒక్క రోజుతోనే పోయింది. బుధవారం రోజు లీటరు పెట్రోలుపై 23 పైసల వంతున ధర పెంచాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ దిశగా వడివడిగా అడుగులు డీజిల్ ధరలు అడుగులు వేస్తున్నాయి. పెరిగిన ధరలతో వివిధ నగరాల్లో లీటరు పెట్రోలు, డీజిల్ ధరల వివరాలు నగరం పెట్రోలు డీజిల్ విశాఖపట్నం 105.23 98.13 విజయవాడ 106.42 99.29 తిరుపతి 107.11 99.88 వరంగల్ 103.75 97.21 హైదరాబాద్ 104.20 97.64 -
పెరిగిన పెట్రోల్ ధర .. మరి డీజిల్ ?
ముంబై: వరుసగా మూడో రోజు పెట్రోల్ ధర పెరిగింది. లీటరు పెట్రోలుపై రూ. 37 పైసల ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే డీజిల్ ధర పెంచలేదు. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ రూ103.84; డీజిల్ రూ.97.46 పైసలకు చేరుకుంది. ప్రతీ రోజు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇంధన ఛార్జీలు సవరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత... మొదట్లో సగటున ప్రతీ పదిహేను రోజులకు ఓసారి పెట్రోలు ధర పెరిగేది. ఆ తర్వాత వారానికి పడిపోయింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంచుమించు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక జులైలో అయితే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దాదాపు ప్రతీ రోజు పెట్రోలు ధర పెరిగింది. పెట్రోలుపై రూ. 9.49 పెంపు ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 36 సార్లు పెట్రోలు ధరను పెంచుతూ పోయారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 9.49 ధరను పెంచారు. అయితే ఈ సారి డీజిల్ ధరలు పెంచకుండా స్వల్ప ఉపశమనం కలిగించాయి చమురు కంపెనీలు. పెట్రోలు ధర పెరుగుడుకు కళ్లెం వేయాలంటూ ఇక్రా వంటి సంస్థలు సూచించినా ఇటు చమురు సంస్థలు, అటు కేంద్రం నుంచి స్పందన లేదు. -
ఆగని పెట్రోల్ బాదుడు... మళ్లీ పెంపు
ముంబై: పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జులైలో మూడోసారి పెట్రోలు ధరలు పెంచాయి చమురు కంపెనీలు. లీటరు పెట్రోలుపై రూ. 36 పైసలు, లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ రూ103.41; డీజిల్ రూ.97.40 పైసలకు చేరుకుంది. తిరుపతి, విజయవాడలలో డీజిల్ ధర సెంచరీకి చేరువుగా వచ్చాయి. పెట్రోలుపై రూ. 9.12 పెంపు ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 35 సార్లు పెట్రోలు ధరను పెంచుతూ పోయారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 9.12 ధరను పెంచారు. ఇదే సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ. 8.71 పెరిగింది. గత రెండు నెలలుగా సగటున రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో లీటరు పెట్రోలు ధరల వివరాలు రూపాయల్లో నగరం పెట్రోలు డీజిల్ హైదరాబాద్ 103.47 97.46 వరంగల్ 103.02 97.03 విశాఖపట్నం 105.04 98.44 విజయవాడ 105.72 99.12 తిరుపతి 106.41 99.70 -
ఆగని పెట్రో బాదుడు.. మరోసారి ధరల పెంపు
హైదరాబాద్ : పెట్రోలు ధరలు పైకి పెరగడమే తప్ప కిందికి చూడటం లేదు. ఒక్క రోజు వ్యవధిలో మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెంచాయి చమురు సంస్థలు. లీటరు పెట్రోలుపై 35 పైసలు, లీటరు డీజిల్‌పై 28 పైసల వంతున రేట్లు పెంచాయి. ఇప్పటికే పెట్రోలు సెంచరీ దాటగా డిజిల్ సెంచరీకి చేరువగా వచ్చింది. క్రూడ్ ఆయిల్ ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెట్ క్రూడ్ ఆయిల్‌ధర 74.58 డాలర్లుగా నమోదు అయ్యింది. క్రితం రోజుతో పోల్చితే ధరలో మార్పు కేవలం 0.1 శాతమే ఉంది. ఐనప్పటికీ చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచుతూ పోతున్నాయి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరి జేబులకు చిల్లులు పెడుతూనే ఉన్నాయి. తాజాగా పెరిగిన ధరలతో వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. సిటీ పెట్రోలు డీజిల్ హైదరాబాద్ 102.69 97.20 విశాఖపట్నం 103.76 97.70 తిరుపతి 105.07 98.82 ఢిల్లీ 98.81 89.18 ముంబై 104.90 96.72 చెన్నై 99.80 93.72 బెంగళూరు 102.11 94.54 చదవండి : నెట్‌ఫ్లిక్స్‌లో ఈ కొత్త ఫీచర్ ఏదో బాగుందే..! -
డీజిల్ ట్యాంకర్ బోల్తా; ఎగబడ్డ జనం
సాక్షి, జనగామా/రఘునాథపల్లి: డీజిల్ లోడ్‌తో వెళుతున్న ఓ ట్యాంకర్ జనగామ జిల్లా నిడిగొండ బస్టాండ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి జిల్లాలోని యశ్వంతాపూర్‌లో ఓ పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ ద్వారా రూ.9.5 లక్షల విలువైన 12 వేల లీటర్ల డీజిల్‌ను తరలిస్తుండగా శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి యశ్వంతాపూర్‌ను దాటి మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయాడు. ఈ సమయంలో నిడిగొండ బస్టాండ్ వద్ద అదుపు తప్పి డివైడర్ మీదుగా ఇనుప కంచెను ధ్వంసం చేసుకుంటూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సర్వీస్ రోడ్డుపై బోల్తాపడింది. దీంతో పెద్ద ఎత్తున డీజిల్ ఒక్కసారిగా బయటకు చిమ్మడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయాలతో క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్ చంద్రమౌళిని స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. (చదవండి: 40 మంది చిన్నారులు.. మృత్యు లారీ) కాగా, ట్యాంకర్ నుంచి డీజిల్ వరదలా బయటకు వస్తుండడంతో దానిని పట్టుకునేందుకు క్యాన్లు, బకెట్లతో జనం ఎగబడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బం దితో కలసి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు 9 వేల లీటర్ల డీజిల్ నేలపాలైందని పోలీసులు తెలిపారు. -
పెట్రో సెగలు : ఢిల్లీ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు చుక్కలను తాకుతుంటే ప్రజలకు ఊరట కల్పించేందుకు ఢిల్లీ కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌పై వ్యాట్‌ను 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. దీంతో దేశ రాజధానిలో డీజిల్ ధరలు లీటర్‌కు 8.36 రూపాయలు తగ్గి 82 రూపాయల నుంచి 73 రూపాయలకు దిగివచ్చాయి. డీజిల్ ధరలు దిగిరానుండటంతో ఢిల్లీ ఆర్థిక వ్యవస్ధలో ఉత్తేజం నెలకొనేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేబినెట్ సమవేశానికి అధ్యక్షత వహించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సవాల్‌తో కూడుకున్నదని, ప్రజల సహకారంతో దీన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. డీజిల్ ధరను తగ్గించాలని కొంతకాలంగా నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. డీజిల్‌పై వ్యాట్ తగ్గించడంతో దేశంలోనే డీజిల్ ధర తక్కువగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. రాజస్ధాన్‌లో అత్యధికంగా డీజిల్ లీటర్‌కు 82 రూపాయలు ఉండగా, మధ్యప్రదేశ్‌లో 81.29 రూపాయలు, మహారాష్ట్రలో 79.81 రూపాయలు పలుకుతోంది. గుజరాత్లో లీటర్ డీజిల్ 79 రూపాయలుగా ఉంది. చదవండి : పెట్రోల్‌తో డీజిల్ ధర సమానం! ఎందుకు? -
‘పెట్రో’ ధరలు పైపైకే..
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. దేశంలో పెట్రోల్ లీటర్‌పై 9 పైసలు.. డీజిల్‌పై 11 పైసలు ఆదివారం పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు రూ.75.54.. డీజిల్ లీటర్‌కు రూ.68.51లకు చేరింది. ఏడాది కాలంలో పెట్రోల్ ధర ఇదే అత్యధికం. భారత్‌కు పెట్రో ఉత్పత్తుల దిగుమతుల్లో ఎటువంటి అంతరాయం ఉండబోదని, ధరలపై మాత్రం ప్రభావముంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ.80.12.. డీజిల్ లీటర్‌కు రూ.74.70లకు చేరింది. -
డీజిల్‌కి టాటా
-
లీటరు పెట్రోలుకు 25 రూపాయలే...
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆ పాపం తమది కాదని అంతర్జాతీయ మార్కెట్దని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పడం, అవును కాబోలు! అనుకొని వినియోగదారులు తలాడించడం తరచుగా జరిగేదే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేందుకు, తగ్గించేందుకు భారతీయ చమురు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పుకోవడమూ షరా మామూలే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే అంతకన్నా ఎక్కువ ధర ఎందుకు పెరుగుతుంది? తగ్గినప్పుడు ఎందుకు తక్కువ తగ్గుతుందన్న విషయాల్లోకి లోతుగా వెళ్లం, వెళ్లినా ప్రభుత్వం తీరే అంతా! అని సరిపెట్టుకుంటాం. ప్రస్తుతం పెట్రోలు ఉత్పత్తి రేటుకన్నా దేశీయ మార్కెట్లో లభిస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు రెట్టింపు, అంటే వంద శాతం ఎక్కువగా ఉందంటే ఆశ్చర్యం వేస్తోంది. ఢిల్లీ నగరాన్ని ప్రమాణికంగా తీసుకుంటే ఇక్కడ లీటరు పెట్రోలును 60.70 రూపాయలకు విక్రయిస్తున్నారు. అక్టోబర్ చివరివారం లెక్కల ప్రకారం లీటరు పెట్రోలు ఉత్పత్తి చేయడానికి ఆయిల్ రిఫైనరీస్‌కు అక్షరాల 24.75 రూపాయలు ఖర్చు అవుతుంది. రవాణా ఖర్చులను, లాభాలను లెక్కేసుకొని ఆయిల్ కంపెనీలు పెట్రోల్ పంపులకు 27.24 రూపాయలకు లీటరు చొప్పున విక్రయిస్తున్నాయి. దానిపై డీలర్ కమిషన్ లీటరుకు 2.26 రూపాయలు. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం 19.06 రూపాయలు, వ్యాట్, రాష్ట్రం విధించే అమ్మకం పన్ను కలిపితే మరో 12.14 రూపాయలు. మొత్తంగా కలిపి వినియోగదారుడికి వచ్చేసరికి లీటరుకు 60.70 రూపాయలు పడుతోంది. అలాగే, ఢిల్లీలోని పెట్రోలు పంపులో లీటరు డీజిల్ ధర 45.93 రూపాయలు. చమురు కంపెనీలకు ఖర్చయ్యేది కేవలం లీటరుకు 24.86 రూపాయలే. కొంత మార్జిన్‌ను కలుపుకొని పెట్రోలు పంపులకు విక్రయిస్తాయి. దీనిపై డీలర్ కమిషన్ 1.43 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం 10.66 రూపాయలు. వ్యాట్, అమ్మకం పన్ను కలుపుకుంటే మరో 6.79 రూపాయలు. మొత్తం కలపి వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి లీటరుకు 45.93 రూపాయలు అయింది. నవంబర్ 7వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరు పెట్రోలుపై 1.60 రూపాయలు, డీజిల్‌పై 40 పైసలు పెంచిన విషయం తెల్సిందే. వాటిని కలిపితే మరింత పెరుగుతోంది. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పన్నులు తక్కువగా ఉండడం వల్ల అక్కడ వినియోగదారుడికి కారుచౌకగా పెట్రోలు లభిస్తుంది. అమెరికాలో ఏ ప్రభుత్వమైనా పెట్రోలుపై పన్నులు పెంచితే ఆ ప్రభుత్వం పడిపోతుంది. భారత్‌లాంటి దేశంలో ఆ పరిస్థితులు ఎప్పుడొస్తాయో!