న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. దేశంలో పెట్రోల్ లీటర్‌పై 9 పైసలు.. డీజిల్‌పై 11 పైసలు ఆదివారం పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు రూ.75.54.. డీజిల్ లీటర్‌కు రూ.68.51లకు చేరింది. ఏడాది కాలంలో పెట్రోల్ ధర ఇదే అత్యధికం. భారత్‌కు పెట్రో ఉత్పత్తుల దిగుమతుల్లో ఎటువంటి అంతరాయం ఉండబోదని, ధరలపై మాత్రం ప్రభావముంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ.80.12.. డీజిల్ లీటర్‌కు రూ.74.70లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment