పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై ఆ దేశ ప్రభుత్వం మరింత భారాన్ని మోపింది. ఇప్పటికే రూ.272 ఉన్న లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ. 10 పెంచింది.
తాజా పెంపు తర్వాత ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.282కి పెరిగింది. ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అర్ధరాత్ర ఈ పెంపును ప్రకటించారు. ప్రస్తుతం ఆ దేశంలో డీజిల్ ధర రూ.293, తేలికపాటి డీజిల్ ఆయిల్ ధర రూ. 174.68 గా ఉంది. కిరోసిన్ ధర కూడా రూ.5.78 పెరిగి రూ.186.07కి చేరింది. కొత్త ధరలు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. గత 15 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిన కారణంగా పెట్రోలు, కిరోసిన్ ధరలు పెంచినట్లు చెప్పారు.
తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ దివాళా తీయకుండా బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 1.1 బిలియన్ డాలర్ల బెయిల్‌అవుట్ ప్యాకేజీకి ప్రయత్నించింది. అయితే దీనికి సంబంధించి ఐఎంఎఫ్‌తో ఒప్పందం విఫలమైంది. ఈ నిధులు 2019లో ఐఎంఎఫ్ ఆమోదించిన 6.5 బిలియన్ డాలర్ల బెయిల్‌అవుట్ ప్యాకేజీలో భాగం. విదేశీ రుణాల్లో పాకిస్తాన్ డిఫాల్ట్ కాకుండా ఉండాలంటే ఇది చాలా కీలకం.
ఇదీ చదవండి: ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment