ముంబై: పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జులైలో మూడోసారి పెట్రోలు ధరలు పెంచాయి చమురు కంపెనీలు. లీటరు పెట్రోలుపై రూ. 36 పైసలు, లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ రూ103.41; డీజిల్ రూ.97.40 పైసలకు చేరుకుంది. తిరుపతి, విజయవాడలలో డీజిల్ ధర సెంచరీకి చేరువుగా వచ్చాయి.
పెట్రోలుపై రూ. 9.12 పెంపు
ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 35 సార్లు పెట్రోలు ధరను పెంచుతూ పోయారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 9.12 ధరను పెంచారు. ఇదే సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ. 8.71 పెరిగింది. గత రెండు నెలలుగా సగటున రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో లీటరు పెట్రోలు ధరల వివరాలు రూపాయల్లో
నగరం పెట్రోలు డీజిల్
హైదరాబాద్ 103.47 97.46
వరంగల్ 103.02 97.03
విశాఖపట్నం 105.04 98.44
విజయవాడ 105.72 99.12
తిరుపతి 106.41 99.70
Comments
Please login to add a commentAdd a comment