ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: సామాన్యుడికి కాస్తంత ఊరట లభించింది. సోమవారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్‌పై 24–27 పైసలు, డీజిల్‌పై 25–26 పైసలు తగ్గింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్ ధర లీటర్ రూ.71కి పడిపోయింది. 1991 గల్ఫ్‌యుద్ధం తర్వాత ఇంత భారీగా ధరలు పడిపోవడం ఇదే ప్రథమం. చమురు ఉత్పత్తి చేసే సౌదీ నేతృత్వంలోని ఒపెక్, రష్యా మధ్య విభేదాలు ధరల యుద్ధానికి తెరలేపాయి. దీంతో సోమవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.70.59కి చేరుకుంది. 2019 జూలై తర్వాత ఇదే తక్కువ ధర. డీజిల్ ధర కూడా లీటర్ రూ.63.26కి పడిపోయింది. దేశీయ చమురు అవసరాల్లో 84 శాతం వరకు భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.04, డీజిల్ లీటర్ ధర రూ. 68.88గా ఉంది. (చదవండి: చమురు ‘బేజార్’)
Comments
Please login to add a commentAdd a comment