తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ల మంజూరు సంఖ్యను పెంచాల్సిందిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలోని గ్రామీణ పాంత్రాల్లో గ్యాస్ సరఫరాకు వీలుగా రాష్ట్ర ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వినోద్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రదాన్‌ను కలసిన వారిలో గ్యాస్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దీపక్‌సింగ్ గెహ్లాట్ తదితరులు ఉన్నారు.