gas connections
-
‘సబ్సిడీ సిలిండర్’ ఎందరికి?
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్‌కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, తెల్లరేషన్‌కార్డులు ఉండి..ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోకపోయి ఉండొచ్చని లబ్ధిదారుల ఎంపికను బట్టి అర్థమవుతోంది. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పినా, ఇప్పటివరకు రెండోవిడత దరఖాస్తుల స్వీకరణ మొదలే కాలేదు. గృహావసర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.24 కోట్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులే ప్రాతిపదికగా... తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న 90 లక్షల కుటుంబాల్లో అత్యంత నిరుపేదలు 20 శాతం అనుకున్నా, కనీసం 70 లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. అయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకుంటే, రేషన్‌కార్డు కలిగిన 40 లక్షల కుటుంబాలే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోనట్టు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది. 40 లక్షల కుటుంబాలను మాత్రమే మహాలక్ష్మి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం ఇతర అర్హులైన కుటుంబాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఆ సమాచారమైనా దరఖాస్తుదారులకు రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ పథకానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఎవరిని లబ్ధిదారులుగా గుర్తించారో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. రూ. 80 కోట్లు మాత్రమే విడుదల చేసిన సర్కార్ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)ల ఖాతాల్లో జమ చేస్తే, పథకానికి అర్హులైన వినియోగదారుల రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత గ్యాస్ కంపెనీలు రీయింబర్స్ చేస్తాయి. ఇందుకోసం తొలి విడతగా రూ. 80 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కాగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ చార్జీ రూ.955 కాగా, మహాలక్ష్మి పథకం కింద రీఫిల్లింగ్ తర్వాత రూ.455 తిరిగి వినియోగదారులకు అందుతాయి. ఈ లెక్కన 40 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక విడతలో రూ.120 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. సగటున సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అందజేస్తే సాలీనా రూ.546 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. -
ఇంకా కట్టెల పొయ్యిలే..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని గ్రామీణ ప్రాంత కుటుంబాలు ఇంకా కట్టెల పొయ్యిల పైనే వంట చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం అధిగమించేందుకు చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలు ఆశించినంతగా లేవు. దేశంలో ఉన్న హౌస్‌హోల్డ్స్‌కు పూర్తిస్థాయిలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ.. పంపిణీ ప్రక్రియలో లోపాలు, శుద్ధ ఇంధన వాడకంపై అవగాహన కల్పించడంలో వెనుకబాటుతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వంటకు శుద్ధ ఇంధనాన్ని విని యోగిస్తున్నారు. దేశంలోని 15 రాష్ట్రాలకు సంబంధించి శుద్ధ ఇంధన వాడకంపై నీతి ఆయోగ్ నివేదికను రూపొందించింది. ఇందులో ఆరు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 33% మాత్రమే ఎల్పీజీ సిలిం డర్ల ద్వారా వంట చేస్తున్నట్లు తేలింది. దేశంలో ఉన్న శుద్ధ ఇంధన విని యోగంలో అధికంగా ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) కనెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్త రాది రాష్ట్రాలతో పాటు పట్టణ నేపథ్యమున్న దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితులను పరి శీలిస్తూ వివరాలను నీతి ఆయోగ్ రిపోర్టులో పేర్కొంది. శుద్ధ ఇంధన వినియోగానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. మూడింట ఒక వంతే.. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామాల్లోనే వంటచెరకు వినియోగం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మూడింట ఒక వంతు మాత్రమే శుద్ధ ఇంధనాన్ని వాడుతున్నారు. కేవలం 33% మాత్రమే గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. వంటచెరకు లభ్యత ఎక్కువగా ఉండటంతో వినియోగశాతం పెరిగినప్పటికీ.. క్రమంగా ఆ ప్రభావం పర్యావరణంపై పడుతోంది. కొన్నిచోట్ల వంటచెరకుతో పాటు వంటచెరకు వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను వినియోగిస్తున్నట్లు పరిశీలనలో తేలింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తున్నప్ప టికీ.. లబ్ధిదారులంతా వీటిని తక్కువ సందర్భా ల్లోనే వినియోగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో శుద్ధ ఇంధన వినియోగం సంతృప్తికరంగా ఉంది. దేశంలో శుద్ధ ఇంధన వినియోగంలో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గోవా, రెండో స్థానంలో పంజాబ్, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, హరియాణా, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలున్నాయి. రాష్ట్రంలో గృహాలకు మించి కనెక్షన్లు.. కొన్ని రాష్ట్రాల్లో గ్యాస్ కనెక్షన్లు గృహాల సంఖ్యకు మించి ఉన్నాయి. రాష్ట్రంలో 91.46 లక్షల గృహాలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతుండగా.. అందులో 1.01 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లున్నాయి. పట్టణ ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గృహాల సంఖ్యకు మించి కనెక్షన్లున్నాయి. ఒక్కో గృహంలో ఒకటి, అంతకు మించి కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సరఫరా, అందుబాటులో ఉన్న డీలర్లు, నివాస ప్రాంతం మారడంతో కొత్త కనెక్షన్లు తీసుకోవడం లాంటి కారణాలతో కనెక్షన్లు పెరిగినట్లు తెలుస్తోంది. విస్తృత అవగాహన కల్పించాలి.. శుద్ధ ఇంధన వినియోగాన్ని విస్తృతం చేయాలంటే నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరముందని నీతి అయోగ్ పేర్కొంది. ఆ మేరకు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ‘గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధ ఇంధన వాడకంపై విస్తృత అవగాహన కల్పించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూడాలి. అవసరమైనంత మేర ఎల్పీజీ సిలిండర్లు తక్కువ వ్యవధిలో సరఫరా చేసే వెసులుబాటు కల్పించాలి. విద్యుత్ సరఫరాకు వైర్లను వినియోగిస్తున్నట్లుగా గ్యాస్ సరఫరాకు పైప్లైన్లు ఏర్పాటు చేయాలి..’అని సూచించింది. -
పేదలందరికీ ‘ఉజ్వల’ వంట గ్యాస్ కనెక్షన్లు
న్యూఢిల్లీ: ఉజ్వల యోజనలో భాగంగా వంటగ్యాస్ కనెక్షన్లను పేదలందరికీ ఉచితంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2016లో ప్రారంభించిన ఈ పథకాన్ని తొలుత గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉద్దేశించారు. అనంతరం దీనిని ఎస్సీ, ఎస్టీలకు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి విస్తరించారు. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. వంటగ్యాస్ కనెక్షన్ లేని, ప్రభుత్వ పథకాల లబ్దిదారులు కాని వారికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన వర్తింపజేయాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సోమవారం నిర్ణయించిందని ఆయన వివరించారు. 50 శాతానికి పైగా(కనీసం 20 వేలు) గిరిజన జనాభా ఉన్న బ్లాకుల్లో ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ పాఠశాలల్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు రూ.2,242 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. -
మామ అక్రమాలను నిలదీసినందుకు..
సాక్షి హైదరాబాద్: బోగస్ పత్రాలతో కోడలు సహా 25 మంది పేరిట బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు తీసుకొని వాటి ద్వారా ప్రతి నెలా వంట గ్యాస్ సబ్సిడీ కాజేయడమే కాకుండా దీనిపై నిలదీసిన కోడలికి కొడుకు చేత తలాక్ ఇప్పించిన ఉదంతం నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం సైదాబాద్‌కు చెందిన మహ్మద్ రహ్మన్ కూతురు నస్రీన్‌కు ఫలక్‌నుమా పోలీస్టేషన్ పరిధిలో ఉంటున్న మహ్మద్ యూసుఫ్ కుమారుడు మహ్మద్ అలీకి 2014లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు సౌదీ అరేబియాలో వెళ్లిపోయారు. నకిలీ ఖాతా తెరిచి... ఇటీవల అనారోగ్యానికి గురైన నస్రీన్ వైద్యం కోసం హైదరాబాద్ వచ్చింది. చికిత్స ఖర్చుల కోసం భర్తను డబ్బు పంపాలని కోరింది. దీంతో భర్త.. జహానుమాలోని సిండికేట్ బ్యాంకులో నస్రీన్ పేరిట ఉన్న ఖాతాలోంచి సొమ్ము తీసుకోవాల్సిందిగా భార్యకు సూచించాడు. అయితే తనకు ఖాతా లేకున్నా ఆ బ్యాంకులోకి సొమ్ము ఎలా వచ్చిందని మామ మహ్మద్ యూసఫ్‌ను అడగ్గా ఆయన అదేమీ చెప్పకుండానే డబ్బును బ్యాంకు నుంచి తీసుకొచ్చి కోడలికి ఇచ్చాడు. దీనిపై అనుమానం వచ్చిన నస్రీన్... ఆ బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలు పరిశీలించగా 2014లో తన పేరిట బోగస్ పత్రాలతో తెరిచినట్లు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా 2014 నుంచి ఆ ఖాతాలో తన భర్త జమ చేస్తున్న సొమ్మును మామ కాజేసిట్లు తెలుసుకుంది. అలాగే తన పేరిట, తోటికోడళ్లు, ఇతర మహిళల పేరిట బోగస్ పత్రాలతో 25 బ్యాంకు ఖాతాలను తెరిచి వాటి ద్వారా గ్యాస్ కనెక్షన్లను మామ సంపాదించాడని నస్రీన్ తెలుసుకుంది. ఈ కనెక్షన్ల పేరిట ప్రతి నెలా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకొని అక్రమంగా సబ్సిడీ సొమ్మును పొందుతున్నట్లు ఆమె గుర్తించింది. పోస్టులో తలాక్..: ఈ అక్రమాలకు తన పేరును ఎందుకు వాడుకున్నావంటూ మామను నిలదీయగా సౌదీలో ఉన్న కొడుకుకు లేనిపోనివి చెప్పి పోస్టు ద్వారా తలాక్ ఇప్పించాడని నస్రీన్ ‘సాక్షి’కి తెలిపింది. మామపై ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేయగా 14న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించింది. తాను జూలై 11న సౌదీ నుంచి వస్తే సెప్టెంబర్ 24న అందిన తలాక్ లేఖలో జూలై 2వ తేదీన తనకు తలాక్ ఇచ్చినట్లు భర్త అందులో పేర్కొన్నాడని బాధితురాలు చెప్పింది. తన పిల్లలు సౌదీలోనే ఉన్నారని, మామ, భర్త కలసి తన జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మహ్మద్ యూసఫ్ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. మరణించిన అల్లుడి పిల్లలను తన పిల్లలుగా చూపుతూ వారి పేరిట నకిలీ పాస్‌పోర్టులను తయారు చేసి గతంలో తాను పని చేసిన సౌదీ కంపెనీ నుంచి ఆర్థిక సాయం కూడా పొందాడని తెలిపింది. తనకు న్యాయం చేస్తానని పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారని నస్రీన్ వివరించింది. -
పేద మహిళలకు కానుక ‘ఉజ్వల’
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: పొగ రహిత దేశాన్ని చూడాలన్నదే ప్రధాన మంత్రి మోదీ లక్ష్యమని, ఇందుకోసం పేద మహిళలు వంటగదిలో ఇబ్బందులు పడకుండా వారికి కానుకగా ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన ఉజ్వల యోజనను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. అలాగే దళితులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఎస్వీ కాలేజి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంబేడ్కర్ జయంతి రోజు రాష్ట్రంలో ఉజ్వల పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా కట్టనవస రం లేకుండా పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందిస్తామన్నారు. రాష్ట్రంలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కోమురం భీం జిల్లాల్లో ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, ఈ జిల్లాల్లో 40 శాతం కటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవని, వీరందరికీ ఈ పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ నెల 20న దేశ వ్యాప్తంగా 15 వేల పైచి లుకు గ్రామాల్లో ఉజ్వల మేళా నిర్వహిస్తున్నామని, గ్యాస్ కనెక్షన్ కోసం పేదలు ఈ మేళాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఉజ్వల్ పథకంతో రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు పెరుగుతుండటంతో పంపిణీకి సమస్య లేకుండా డిస్ట్రిబ్యూటర్లను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 73 పొగ రహిత గ్రామాలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీ నాటికి రాష్ట్రంలో 73 గ్రామాలను పొగ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దనున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తామని, నిరుద్యోగ భృతి కింద యువతకు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇస్తామని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లబ్ధిదారులకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సభలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చింతా సాంబమూర్తి, నేతలు ప్రేమేందర్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్రావు, జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గ్యాస్ కనెక్షన్లు పెంచండి: ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ల మంజూరు సంఖ్యను పెంచాల్సిందిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయనను కలసిన వినోద్ వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే గ్యాస్ డీలర్లకు ఇస్తున్న కమీషన్‌ను పెంచాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణలోని గ్రామీణ పాంత్రాల్లో గ్యాస్ సరఫరాకు వీలుగా రాష్ట్ర ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వినోద్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రదాన్‌ను కలసిన వారిలో గ్యాస్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దీపక్‌సింగ్ గెహ్లాట్ తదితరులు ఉన్నారు. -
అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు
► పెండింగ్ కనెక్షన్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలి ► జేసీ శ్రీకేశ్ బి. లఠ్కర్ విజయనగరం కంటోన్మెంట్ : అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని జేసీ శ్రీకేశ్ బి.లఠ్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దీపం కనెక్షన్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలన్నారు. సుమారు 4.78 లక్షల కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో దీపం పథకం కనెక్షన్లపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు మార్చిలోగా గ్యాస్ కనెక్షన్లు అందించాలన్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఐదు కిలోల గ్యాస్ సిలిండర్‌తో కూడిన స్టవ్‌ను అందించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి గ్రామస్థాయి అధికారులు, రేషన్ డీలర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సాధికార సర్వే గమనిస్తే ఎవరికి గ్యాస్ కనెక్షన్ లేదో తెలుస్తుందని చెప్పారు . జూన్ చివరి నాటికి అర్హులందరికీ కనెక్షన్లు మంజూరు చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. దీపం కనెక్షన్లపై ప్రతి 15 రోజులకోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీదారులు నగదురహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ జె. శాంతికుమారి, ఏఎస్ఓ పి. నాగేశ్వరరావు, హెచ్‌పీసీఎల్ సేల్స్ మేనేజర్లు ఎం. చౌదరి, వివిధ గ్యాస్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు శ్రీధర్ రాజా, డీలర్లు శ్రీనివాసరావు, టి. సీతారామయ్య, రామకృష్ణ, వినియోగదారుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
-
ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
- రాష్ర్టంలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అమలు - 20న విశాఖలో లాంఛనంగా ప్రారంభించనున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ - రాష్ట్రానికి లక్షా 90 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల(బీపీఎల్) వారికి ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు కానున్నాయి. ‘ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనుంది. రాష్ట్రానికి సంబంధించి ఈ నెల 20న విశాఖపట్నంలో ఈ పథకాన్ని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లాంఛనంగా ప్రారంభించనున్నారని చమురు కంపెనీలు తెలిపాయి. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 90 వేల కనెక్షన్లను మంజూరు చేయనున్నారు. తెలంగాణలోనూ లక్ష కనెక్షన్లు మంజూరైనట్టు సమాచారం. వీటిని బీపీఎల్ కుటుంబాల్లోని మహిళల పేరిట అందజేస్తారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన కొద్దిమందికి కేంద్రమంత్రితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందజేయనున్నట్టు చమురు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే పేరుకు ఉచితమే అయినప్పటికీ.. గ్యాస్ సిలిండర్‌పై వచ్చే సబ్సిడీ మొత్తాన్ని వాయిదాల రూపంలో తిరిగి తీసేసుకుంటారని ఈ వర్గాలు వెల్లడించాయి. సబ్సిడీని ఇలా... ఈ పథకం కింద ఇచ్చే ఒక్కో గ్యాస్ కనెక్షన్‌కు రూ.3,200 మేరకు వ్యయమవుతుందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ఈ కనెక్షన్ కింద మహిళా లబ్ధిదారులకు ఒక సిలిండర్, రెగ్యులేటర్, గ్యాస్ స్టవ్ ఇస్తారు. అదేవిధంగా ప్రధానమంత్రి బొమ్మ ముద్రించిన ఉజ్వల్ పుస్తకాన్ని అందజేస్తారు. ఇందులో రూ.1,600ను కేంద్రం సబ్సిడీగా అందిస్తుంది.మిగిలిన రూ.1,600 ను వినియోగదారుడు ముందుగా చెల్లించే పనిలేకుండా రుణంగా ఇస్తారు. దీన్ని గ్యాస్ సిలిండర్‌పై వచ్చే సబ్సిడీగా వసూలు చేస్తారు. ఘనత కేంద్రానికే దక్కేలా ప్రణాళిక ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకం ఘనత అంతా తమకే దక్కేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఎక్కడా రాష్ట్రప్రభుత్వ ఆనవాలు లేకుండా దీన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎంపీల ద్వారా ప్రతీ జిల్లా కేంద్రంలో పథకాన్ని ప్రారంభిస్తారు. అదేసమయంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఉజ్వల్ మేళా’లను నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మతో ఈ మేళాలను నిర్వహించనుండడం విశేషం. తద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ల మంజూరు ఘనతను పూర్తిగా తానే తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. -
అక్టోబర్ నాటికి నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో వచ్చే అక్టోబర్ నెలాఖరులోగా రెండు లక్షల గ్యాస్ క¯ð క్షన్లు ఇచ్చి నూరుశాతం పూర్తి చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం దీపం పథకంపై జిల్లాలోని గ్యాస్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన వారికి 11 లక్షల గ్యాస్ క¯ð క్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే 9 లక్షల గ్యాస్ క¯ð క్షన్లు అందించామని, రెండు లక్షలు అక్టోబరు నెలాఖరులోగా అందిస్తామన్నారు. సమావేశంలో డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘దీపం’ పంపిణీ నెల రోజుల్లో పూర్తి చేయాలి
కాకినాడ సిటీ : జిల్లాకు మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లను నెల రోజుల్లోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎల్పీజీ డీలర్లను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో దీపం కనెక్షన్ల పంపిణీ పురోగతిపై సమీక్షించారు. జిల్లాకు 2,26,000 దీపం కనెక్షన్లు మంజూరైనట్టు తెలిపారు. వీటిలో 1,31,000 కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు. మిగిలిన కనెక్షన్లను త్వరితగతిన పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. ఎంపీడీఓల సమన్వయంతో లబ్ధిదారుల జాబితాలకు జన్మభూమి గ్రామ కమిటీల ఆమోదంతో త్వరితగతిన పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అన్ని కనెక్షన్లను డోర్ డెలివరీ చేయాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. సర్వే సత్వరమే పూర్తి చేయాలి ప్రజాసాధికార సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. సర్వే ప్రగతిపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ఎన్యూమరేటర్లను ఉదయమే క్షేత్రస్థాయికి పంపించాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని, ఎన్యూమరేటర్లుగా ఉన్న మహిళలను సాయంత్రం విధుల నుంచి రిలీవ్ చేయాలన్నారు. పింఛన్ల పంపిణీకి తీసుకున్న ట్యాబ్‌లను ఐదో తేదీ సాయంత్రానికి తహసీల్దార్లకు అప్పగించాలని ఎంపీడీఓలకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పద్మ, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
మా ఇంటికి కిటికీలు ఉండేవి కావు: మోదీ
లక్నో: 'చాలా పేద కుటుంబుంలో పుట్టి పెరిగాను. మా ఇంటికి కిటికీలు కూడా ఉండేవి కావు. ఇంట్లో వంట కట్టెల పోయ్యిపై అమ్మ వంట చేయాల్సి వచ్చేది' అని ప్రధాని నరేంద్ర మోదీ తన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. ఉత్తరప్రదేశ్ లోని బాలియాలో 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన మరికొన్ని అంశాలు... మొత్తం 5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామని పేర్కొన్నారు. మహిళల పేరిటే ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమ్మ కష్టాలు చూసిన వాడ్ని కనుక మహిళల ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు ఓట్ల గురించి మాత్రమే ఆలోచించాయి తప్ప ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు పనిచేయలేదని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
'పేదలకు గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలి'
న్యూఢిల్లీ: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బృందం గురువారం ఢిల్లీలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిసింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ధర్రేంద్రకు వైఎస్ జగన్ వివరించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. అంతకముందు వైఎస్ జగన్ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నదీమ్ జైదీని కలిశారు. ఏపీలో ఫిరాయింపుల వ్యవహారాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార టీడీపీ సాగిస్తున్న అనైతిక రాజకీయాలు, ప్రలోభాలతో ఎమ్మెల్యేలను లోబర్చుకుంటున్న తీరును వివరించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలో 'సేవ్ డెమొక్రసీ' ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ నాయకులతో పాటు వైఎస్ జగన్ ఢిల్లీలో పలువురు జాతీయ పార్టీల నేతలను, కేంద్ర మంత్రులను కలిశారు. -
తగ్గిన ‘దీపం’ వెలుగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదింటి మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘దీపం’ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఈ పథకానికి రూ.37.61 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.21.61కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే 6,55,354 మందికి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 5,43,412 మంది అర్హులను గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. భారీ లక్ష్యం ముందున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో కేటాయింపులను తగ్గించినట్లుగా తెలుస్తోంది. -
దీపానికీ పచ్చముద్ర
జన్మభూమి కమిటీ ఓకే అంటేనే గ్యాస్ కనెక్షన్ జిల్లా వ్యాప్తంగా 35 వేల కనెక్షన్లు కుప్పానికే 9 వేలు అర్హులైన పేదలందరికీ దీపం గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీ ఓకే చెప్పందే కనెక్షన్ మంజూరు చేయడంలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల మాటలు చెల్లుబాటు కావడం లేదన్న విమర్శలున్నాయి. అర్హతతో సంబంధం లేకుండా టీడీపీ శ్రేణులకే గ్యాస్ కనెక్షన్లు అందుతున్నట్లు సమాచారం. చిత్తూరు: చంద్రబాబు ప్రభుత్వం దీపం గ్యాస్ కనెక్షన్లకు సైతం జన్మభూమి కమిటీల ఆమోదముద్ర తప్పనిసరి చేయడంతో టీడీపీ నేతలకు తప్ప పేదలకు గ్యాస్ అందని పరిస్థితి ఏర్పడింది. జన్మభూమి కమిటీలు ఆమోదముద్ర వేసిన జాబితానే తహశీల్దార్లు ఓకే చేస్తుండగా వాటికి మాత్రమే పౌరసరఫరాల శాఖ అధికారులు కనెక్షన్లు పంపిణీ చేస్తున్నారు. అర్హులైన పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ ప్రకటించింది. ఈ ప్రకారం సర్వే నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 4.45 లక్షల మందికి గ్యాస్ లేనట్లు తేలింది. ఇందులో ఈ ఏడాది 1,60,800 మందికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 70 వేలమంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 35 వేల కనె క్షన్లు పంపిణీ చేశారు. మిగతా 35 వేల మందికి రెండవ విడతలో పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నా జన్మభూమి కమిటీల ఆమోదం లభించకపోవడంతో పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది. లక్ష్యం మేరకు ఇంకా 1.35 లక్షల మందికి ఈ ఏడాదే గ్యాస్ ఇవ్వాల్సి ఉంది. పెండింగ్ జాబితా కాకుండా జిల్లా వ్యాప్తంగా మరో 3 లక్షలమంది అర్హులున్నారు. వీరందరికీ ఎప్పటిలోగా గ్యాస్ అందిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అర్హతలతో పాటు అధికార పార్టీ నేతల సిఫారసు కూడా.. దీపం కనెక్షన్ కావాల్సిన వారు నిబంధనల ప్రకారం దరఖాస్తుతోపాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తున్నారు. అయితే జన్మభూమి కమిటీల ఆమోదముద్ర తప్పనిసరి కావడంతో కేవలం అధికార పార్టీ కార్యకర్తలు చెప్పినవారికే గ్యాస్ ఇస్తున్నారు తప్పితే అర్హుల దరఖాస్తులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకే ప్రాధాన్యం ఇస్తూ జిల్లాను గాలికొదిలేశారన్న విమర్శలున్నాయి. 14 నియోజకవర్గాల పరిధిలో 35 వేల కనె క్షన్ ఇచ్చినట్లు చెబుతున్నా ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 9వేల కనెక్షన్లు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల పైచిలుకు అర్హులకు గ్యాస్ లేదని గణాంకాలు చెబుతున్నా అధికారులు మాత్రం వారందరికీ గ్యాస్ ఇచ్చే ప్రయత్నం చేయకుండా జన్మభూమి కమిటీల మాటున కేవలం అధికార పార్టీ కార్యకర్తలకే పంపిణీ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సగం మందికి నో గ్యాస్
♦ ఇంటిగ్రేటెడ్ సర్వేలో గుర్తింపు ♦ జిల్లాలో 5.50 లక్షల కార్డుదారులకే గ్యాస్ ♦ అర్హుల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు ♦ మార్చి 31లోగా 1.50 లక్షల దీపం కనెక్షన్లు ♦ నెలకు 25 వేల కనెక్షన్ల పంపిణీకి చర్యలు సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో అల్పాదాయ వర్గాల(బీపీఎల్)కు చెందిన వారిలో సగం మందికి గ్యాస్ కనెక్షన్ లేదని లెక్కతేల్చారు. వీరిలో అర్హులను గుర్తించి దీపం పథకంలో కొత్త కనెక్షన్లు మంజూరుకు చర్యలు చేపట్టారు. నెలకు కనీసం 25వేల కనెక్షన్ల చొప్పున 2016 మార్చి 31లోగా జిల్లాలో 1.50 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీపీఎల్ కార్డు కలిగి ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ లేకుంటే కొత్త గ్యాస్ కనెక్షన్ వచ్చినట్టే. ఏజెన్సీలో 43,978 మందికే గ్యాస్ ఇంటిగ్రేటెడ్ సర్వే మేనేజ్మెంట్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ వద్ద ఉన్న గణాంకాలను బట్టి జిల్లాలో 10,85,573 బీపీఎల్ కార్డుల్లో 5,49,595 కార్డుదారులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన 5,35,978 కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్ లేదని నిర్ధారణకు వచ్చారు. వీరిలో అత్యధికం ఏజెన్సీ పరిధిలోనే ఉన్నారు. ఏజెన్సీలో 2,19,092 కార్డుదారులుంటే వారిలో కేవలం 43,978 మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కార్డు తీసుకునేటప్పుడు, ఆ తర్వాత డీలర్ల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం లెక్కతేలిన ఈ జాబితాపై నిగ్గు తేల్చేందుకు ఇంటింటా సర్వే జరపాలని ఇప్పటికే తహశీల్దార్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గ్యాస్ కనెక్షన్లు లేని వారిలో ఎవరైనా ఈ మధ్యకాలంలో గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా? లేదా అని ఆరా తీస్తున్నారు. ఎంతలేదనుకున్నా మరో నాలుగు లక్షలకుపైగా గా్యస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉంటుందని అంచనా. బీపీఎల్ కార్డుదారులందరికీ గ్యాస్ సాచురేషన్ పద్ధతిలో అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న సర్కారు తొలి విడతగా జిల్లాకు 1.50 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేసింది. గతేడాది మంజూరు చేసిన 33 వేల కనెక్షన్లు ఇంకా పంపిణీ జరగకపోవడంతో వాటితో సహా 2016 మార్చి 31లోగా జిల్లాలో 1.50 లక్షల దీపం కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఆ మేరకు గ్యాస్ కంపెనీలకు సబ్సిడీమొత్తాన్ని సర్కార్ జమ చేసిందంటున్నారు. జన్మభూమి కమిటీలతో ప్రమేయం లేకుండా గ్యాస్ కనెక్షన్ లేని బీపీఎల్ కార్డుదారులందరికీ దీపం కనెక్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టామని రూరల్ డీఎస్ఓ శాంతకుమారి తెలిపారు. -
పేదల ‘దీపం’కు మోక్షం !
తొలి విడతకు ఐదు వేల కనెక్షన్లు కొనసాగుతున్న లబ్ధిదారులు ఎంపిక డిసెంబర్‌లోగా కనెక్షన్ల పంపిణీ పూర్తిడ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదింటి మహిళలకు ‘దీపం’ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. తొలి విడతగా నియోజకవర్గానికో ఐదు వేల దీపం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జీహెచ్ఎసీ పౌరసరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారులకు ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తిచేసి ఈ ఏడాది చివరి నాటికి అర్హులకు కనెక్షన్లు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టారు. అర్హులైన నిరుపేద మహిళలకు దీపం పథకం కింద కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే మార్గదర్శకాలు విడుదల చేసింది. రాజకీయ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో మార్గదర్శకాల్లో కొద్దిపాటి మార్పులు చేసి ఇన్చార్జి మంత్రులకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను కట్టబెడుతూ సరిగ్గా రెండు మాసాల క్రితం మరో ఉత్తర్వు ఇచ్చింది. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలతో పాటు అర్బన్ ఐకేపీ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ కార్యాలయం (సీఆర్వో), రంగారెడ్డి పౌరసరఫరాల శాఖ కేవలం కనెక్షన్ల మంజూరు, గ్యాస్ ఏజెన్సీల ఎంపిక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి సర్కిల్లోనూ స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో వార్డు కమిటీ సమావేశాల్లో లబ్ధిదారులను ఎంపిక నిర్వహించాలి, కానీ ప్రస్తుతం కార్పొరేటర్లు మాజీలయ్యారు. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యే సమక్షంలో డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికను పౌర సరఫరాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉచితంగా కనెక్షన్లు జీహెచ్ఎంసీ పరిధిలోని నిరుపేద కుటుంబాల్లో దీపం పథకం కనెక్షన్లు వెలుగు నింపనున్నాయి. వాస్తవంగా పథకం కింద ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ రూ.1600 లను ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికే మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించి నిధులను సైతం విడుదల చేసింది. సిలిండర్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ.1450, కాగా, రెగ్యులేటర్ కోసం రూ.150లు. దీపం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు జారీ చేసి ఖాళీ సిలిండర్, రెగ్యులేటర్ అందజేస్తారు. లబ్ధిదారులు కనెక్షన్ డాక్యుమెంట్, పాస్‌బుక్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఐఎస్ఐ మార్క్ గల గ్యాస్ స్టౌవ్, పైపు, గ్యాస్(నిండిన) మాత్రమే కోనుగోలు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు దీపం కనెక్షన్‌తో పాటు డీలరు వద్ద తప్పనిసరిగా గ్యాస్ స్టౌవ్‌ను కొనుగోలు చేయాల్సి అవసరం లేదు. చమురు సంస్థలు కూడా కనెక్షన్లకు సిద్ధమయ్యాయి. -
మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ
ముత్తుకూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : కృష్ణపట్నం పోర్టు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కితాబునిచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణపట్నం పోర్టు గురించి మాట్లాడారు. అనంతరం సీవీఆర్ జ్యోతి పథకం కింద మొత్తం 660 మంది మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పోర్టు సీఈవో అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
గాలిలో దీపం
- దీపం పథకం కింద జిల్లాకు 31,159 కనెక్షన్లు మంజూరు - పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక - జూన్ నాటికే కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశం - ఓపెన్ కాని దీపం వెబ్సైట్ - మూడేళ్లలో మంజూరై, గ్రౌండు కాని 69,273 కనెక్షన్లు రద్దు సాక్షి ప్రతినిధి, తిరుపతి: దీపం పథకం కింద పేదలకు ఇచ్చే గ్యాస్ కనెక్షన్ల మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏటా జిల్లాకు వేల సంఖ్య లో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పేదలందరికీ మాత్రం చేరడం లేదు. లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. 2011-14 అంటే మూడేళ్లలో సాధారణ, ప్రత్యేక కేటగిరీలో జిల్లాకు 87,271 కనెక్షన్లు మంజూరు కాగా, ఇందులో కేవలం 17,998 కనెక్షన్లు మాత్రమే లబ్ధిదారుల కు ఇచ్చారు. మిగిలిన 69,273 కనెక్షన్లను పెం డింగ్‌లో ఉంచారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గత మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసింది. తాజాగా జిల్లాకు 31,159 కనెక్షన్లను మంజూరు చేశారు. వీటిని కూడా జూన్ లోపల గ్రౌండ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇంతవరకు లబ్ధిదారుల ఎంపిక జరిపి వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. ఏటా జరిగే తంతు మాదిరి ఈసారీ జరుగుతుందేమోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తులు ఎంపీడీవో కార్యాలయంలో ఇచ్చి దీపం కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక ఇలా.. మండలంలో దరఖాస్తులను ఏంపీడీవోలకు అందజేయాలి. అందులో అర్హులైన వారిని గుర్తించి వారి దరఖాస్తులను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. రూరల్ పరిధిలో డీఆర్డీఏ పీడీకి, నగర, పట్టణ పరిధిలో అయితే కమిషనర్‌కు జాబితాను అందజేస్తారు. వీరు ఇన్చార్జి మంత్రి ఆమోదంతో తుది జాబితాను ఎంపిక చేసి లిస్టును గ్యాస్ ఏజెన్సీలకు పంపుతారు. దీనికి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను తయారు చేసింది. రెండు నెలలుగా ఆ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల దరఖాస్తులను అప్లోడ్ చేయలేదు. చివరకు ఈ వెబ్సైట్ పనిచేయకపోవడంతో తాజాగా ఈనెల 17వ తేదీన ఈపీడీఎస్ వెబ్సైట్లోనే దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని సూచించింది. దీంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. -
వెలగని దీపం!
పాలమూరు : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దీపం పథకం ద్వారా ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న సర్కారులక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. కనెక్షన్లు మంజూరై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ గ్యాస్ అందకపోవడం గమనార్హం. గత ఏప్రిల్‌లో నియోజకవర్గానికి ఐదువేల చొప్పున జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 70వేల కనెక్షన్లను ప్రభుత్వం మంజూరుచేసింది. దరఖాస్తులు స్వీకరించి మూడునెలలైనా అర్హుల జాబితా ఇంతవరకు ఖరారుకాలేదు. కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేకకమిటీ లబ్ధిదారులను ఎంపికచేస్తుంది. మండలస్థాయిలో ఆ బాధ్యతను ఎంపీడీఓలకు కట్టబెట్టారు. గ్రామస్థాయిలో వచ్చిన దరఖాస్తులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనలకు స్వస్తి పలికారు. స్థానిక అధికార పార్టీ నాయకుల సిఫార్సులు, సర్పంచ్ల జాబితా మేరకు ఎంపీడీఓలు లబ్ధిదారుల తుదిజాబితా రూపకల్పనలో జాప్యం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగానికి జాబితా చేరలేదు. గ్రామాల నుంచి వచ్చిన వాటిని ఆధార్ ప్రామాణికంగా డేటాఎంట్రీ పూర్తిచేసి జిల్లా పౌరసరఫరాల కార్యాలయానికి పంపించాల్సి ఉంది. జిల్లాలో ఏ మండలంలో కూడా జాబితా రూపకల్పన మొదలుపెట్టకపోగా గ్రామసభల ద్వారా ఎంపికచేసిన జాబితా కూడా చేరలేదని తెలుస్తోంది. కొలిక్కిరాని పంపిణీ ప్రక్రియ జిల్లాలో సమగ్రకుటుంబ సర్వే ప్రకారం 9.85లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో 5.21లక్షల గ్యాస్కనెక్షన్లు ఉండగా 4.64లక్షల కుటుంబాలకు కనెక్షన్లు లేవని తేలింది. ప్రభుత్వం మంజూరుచేసిన 70వేల కనెక్షన్లకు 1.80లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మహిళా సంఘాలకు ప్రాధాన్యమిస్తూ 25శాతం ఎస్సీలు, 16శాతం ఎస్టీలు, మైనార్టీలకు గ్యాస్కనెక్షన్ అందించాలని నిర్ణయించారు. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఒక్కో కనెక్షన్‌కు రూ.1600చొప్పున మొత్తం 70వేల కనెక్షన్లకు రూ.11.20కోట్లు అందజేసింది. మే నెలలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నిర్ణీత గడువు దాటినా పంపిణీ ఓ కొలిక్కిరాలేదు. లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్కనెక్షన్లు జారీచేసి ఖాళీ సిలిండర్‌తో పాటు రెగ్యులేటర్ ఇస్తారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గతంలో ప్రభుత్వం నుంచి దీపం పథకం ద్వారా లబ్ధిపొందని వారు, గ్యాస్కనెక్షన్ తీసుకునేందుకు డబ్బు వెచ్చించలేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. గ్రామసభల ద్వారా ఎంపికచేసిన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ ఆమోదించి ఆ తరువాత జిల్లా మంత్రికి నివేదించిన తరువాతే కనె క్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మేల్కోవాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండలస్థాయిలో కొనసాగుతోంది. మండలాల వారీగా తుది జాబితాను జిల్లాకు పంపుతారు. వాటిని జిల్లా కమిటీ ద్వారా స్క్రీనింగ్ చేసి అర్హులకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు చర్యలు చేపడతాం. - లక్ష్మినారాయణ, ఇన్చార్జి, డీఎస్ఓ -
సబ్సిడీ కిరోసిన్‌కు మంగళం!
పేదలకు అందుబాటులో వంటగ్యాస్ దశలవారీగా కిరోసిన్ కోటా కట్ ‘దీపం’ కింద ఈ నెలాఖరులో 70వేల మందికి గ్యాస్ కనెక్షన్లు జిల్లాలో కుటుంబాలు: 12 లక్షలు నెలనెలా కిరోసిన్ పంపిణీ: 2004 కిలోలీటర్లు ఈ నెలాఖరు వరకు ఇవ్వనున్న ‘దీపం’ కనెక్షన్లు: 70వేలు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు పంపిణీ చేస్తున్న కిరోసిన్‌ను ఎత్తివేయాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ప్రతి కుటుంబానికి వంట గ్యాస్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సబ్సిడీ కిరోసిన్‌కు మంగళం పాడాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేదలకు విరివిగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే తాజాగా ‘దీపం’ పథకం కింద జిల్లాకు 70వేల గ్యాస్ కనెక్షన్లను జారీచేసింది. నియోజకవర్గానికి ఐదు వేల మంది లబ్ధిదారులకు వీటిని జారీ చేయాలని నిర్ణయించిన జిల్లా యంత్రాంగం... ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో ప్రస్తుతం 12 లక్షల కుటుంబాలకు 2004 కిలోలీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ కుటుంబాలకు గ్యాస్‌ను సమకూర్చడం ద్వారా కిరోసిన్ కోటాను రద్దు చేయాలని యోచిస్తోంది. కుటుంబాలకంటే కనెక్షన్లు ఎక్కువ! మన జిల్లాలో కుటుంబాలకంటే అధికంగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయంటే నమ్ముతారా? ఔను.. ఇది నిజం. చమురు కంపెనీలు ఇటీవల తేల్చిన లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాలను మంచి గ్యాస్ కనెక్షన్లు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గ్యాస్ ముఖం చూడని కుటుంబాలెన్నో ఉండగా, గ్యాస్కనెక్షన్లు మాత్రం 121 శాతం నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 12,84,755 లక్షల కుటుంబాలు ఉండగా, 15,59,312 లక్షల గ్యాస్ క నెక్షన్లు ఉన్నట్లు ఆయిల్ సంస్థలు నివేదించాయి. జిల్లా అధికారులు మాత్రం ఆయిల్ కంపెనీల వాదనతో విబేధిస్తున్నారు. 2011 జనగణన ప్రకారం జిల్లాలో 12.35లక్షలున్న కుటుంబాలు కాస్తా.. గతేడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నాటికి 16.54 లక్షలు ఉన్నట్టు తేలినందున.. ఇందులో ఆశ్చర్చపడాల్సిన అవసరమేమీలేదని కొట్టిపారేస్తున్నారు. కుటుంబాల సంఖ్య వృద్ధికి అనుగుణంగానే గ్యాస్ కనెక్షన్లు పెరిగాయని అంటున్నారు. కొన్ని కుటుంబాలు ఒక కనెక్షన్కంటే అదనంగా కలిగి ఉండే అవకాశమున్నందున.. కనెక్షన్ల సంఖ్య కుటుంబాలను దాటి ఉండే వీలులేకపోలేదని చెబుతున్నారు. -
ఎడతెగని నిరీక్షణ
కొత్త సర్కార్ వచ్చాక కొత్త రేషన్ కార్డులు, కొత్త దీపం గ్యాస్ కనెక్షన్లు వస్తాయని ఎంతోమంది ఆశపడ్డారు. కొత్త కార్డుల కోసం ఎంతో ఆశతో దరఖాస్తు చేశారు. నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా ఫలితం సున్నా. ఇప్పటివరకూ జిల్లాలో కొత్తగా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో కూడా వారికి రేషన్ కార్డులు దక్కే అవకాశం లేకుండా పోయింది. మరోపక్క దీపం కనెక్షన్లు మంజూరైనా లబ్ధిదారుల జాబితాకు మోక్షం కలగడంలేదు. దీంతో వారికి ఎడతెగని నిరీక్షణ తప్పడంలేదు. - సాక్షి ప్రతినిధి, కాకినాడ సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో కొత్త రేషన్ కార్డులకోసం వేలాదిమంది దరఖాస్తు చేసుకుని నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. వారిలో అర్హులను అధికారులు పక్కాగా గుర్తించి, ప్రతిపాదనలు పంపించినా.. ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకు లేదు. గత అక్టోబర్‌లో జరిగిన జన్మభూమిలోను, కలెక్టరేట్ గ్రీవెన్స్సెల్లోను జిల్లా నలుమూలల నుంచి రేషన్ కార్డుల కోసం 1,61,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై గ్రామస్థాయిలో పక్కాగా సర్వే చేసిన పౌర సరఫరాల అధికారులు 1,48,520 మంది కొత్త కార్డులకు అర్హులని తేల్చారు. 12,890 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. అర్హులుగా జిల్లా యంత్రాంగం గుర్తించిన వారంతా గత తొమ్మిది నెలలుగా కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఎటూ పాలుపోని అధికారులు రేపు మాపు అంటూ ఇంతకాలం వారికి చెబుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో బుధవారం నుంచి రెండో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ప్రారంభమవుతోంది. కనీసం ఇందులోనైనా కార్డులు వస్తాయని అంతా ఆశించారు. ఇప్పుడు ఆ ఆశలు కూడా అడియాసలు అవుతున్నాయి. ఎందుకంటే ఈసారి జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం అసలు రేషన్‌కార్డుల ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో కొత్త కార్డులు వస్తాయని ఆశిస్తున్న వారంతా ప్రభుత్వ తీరుపై ఆవేదన చెందుతున్నారు. గాలిలో ‘దీపం’ దీపం గ్యాస్ కనెక్షన్ల మంజూరులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 2014-15 సంవత్సరానికిగానూ జిల్లాకు ప్రభుత్వం 29 వేల దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. వీటిని జిల్లాలోని 64 మండలాలకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయించారు. కాకినాడ డివిజన్‌కు 6,301, రాజమండ్రి డివిజన్‌కు 5,518, రామచంద్రపురానికి 3,597, అమలాపురం డివిజన్‌కు 6,588, పెద్దాపురానికి 5,077, రంపచోడవరం డివిజన్‌కు 1,917 కనెక్షన్లను కేటాయించారు. ఇవి మంజూరై మూడు నెలలు దాటినా లబ్ధిదారుల జాబితాకు ఇంతవరకూ గ్రీన్‌సిగ్నల్ లభించలేదు. మండలాలవారీగా కేటాయించిన గ్యాస్ కనెక్షన్లకు లబ్ధిదారుల జాబితాను మండల స్థాయిలో తయారు చేసినప్పటికీ ఆన్లైన్లో పరిశీలన జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 9,42,472 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో హెచ్‌పీ 6,63,846, ఇండేన్ 1,40,018, భారత్ గ్యాస్ 1,38,608 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఒక్క గ్యాస్ కనెక్షన్‌కు కూడా ఆమోదం లభించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆధారుణంగా రద్దు!
పేదల కడుపు కొడుతున్న సర్కార్ ఈ-పాస్‌తో దూరమవుతున్న ఆహార భద్రత నగదు బదిలీతో గ్యాస్ కనెక్షన్లకు కోత నిరుపేద జిల్లాలో పేదలకు ఆహార భద్రత కరువవుతోంది. పట్టెడన్నం లేక అర్ధాకలితో అన్నమోరామ‘చంద్రా’ అంటూ అలమటిస్తున్న కుటుంబాలు జిల్లాలో అధికంగా ఉన్నాయి . వారిని ఆదుకోవలసిన ప్రభుత్వం... ఉన్న ఒక్క ఆధారమైన రేషన్ కార్డును కూడా రద్దుచేసి, వారి నోటికాడ కూడు లాక్కొంటోంది. గత ఏడాదిగా ఒక్క కొత్తరేషన్‌కార్డు ఇవ్వకపోగా, వేల కార్డులను రద్దు చేసింది. ఆధార్ సీడింగ్, ఈ పాస్ పేరుతో పేదలతో ఆటలాడుకుంటోంది. గంటల తరబడి క్యూలో నిలుచున్నా రేషన్ అందుతుందనే నమ్మకం లేకుండా పోయింది. ఏ నెల ఏ నెపంతో రేషన్ నిలిపివేస్తారో తెలియక పేదలు నిత్యం ఆందోళనకు గురవుతున్నారు. రద్దయిన కార్డులను పునరుద్ధరించుకునేందుకు పనులు మానుకుని అధికారులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ఊరిస్తోంది తప్ప, మంజూరు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. మరో వైపు నగదు బదిలీ పేరుతో పేదలను ఇక్కట్లకు గురిచేస్తోంది. విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న అన్ని పంచాయతీల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కొత్తగా వివాహాలు చేసుకున్న వారు వేరు కాపురం ఉంటున్నప్పుడు వారి పాత రేషన్ కార్డుల్లోని సభ్యుల జాబితానుంచి తొలగిస్తున్న అధికారులు వారు కొత్తగా దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రం మంజూరు చేయడం లేదు. దీని వల్ల వేలాది కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తీసుకున్న దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. దర ఖాస్తుల ఆన్లైన్ కేవలం 30 శాతం మాత్రమే జరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల్లో 12,323 దరఖాస్తులకు విచారణ పూర్తి చేసినట్టు చెబుతున్న అధికారులు ఇందులో 9,387 దరఖాస్తులు మాత్రమే అర్హత కలిగి ఉన్నాయని నివేదించారు. ఇందులో కేవలం 5,561 దరఖాస్తులను మాత్రమే అప్లోడ్ చేశారు. అదేవిధంగా అంత్యోదయ అన్నయోజన కోసం 6,191 దరఖాస్తులు వచ్చాయి. అన్నపూర్ణ పథకానికి సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తులు మరో 177 రాగా అవి కూడా మూలన పడి ఉన్నాయి. మరో పక్క ఆధార్ అనుసంధానం ప్రహసనంలో 24,236 రేషన్ కార్డులు ఇన్ఏక్టివ్లోకి వెళ్లిపోయాయి. వీటిలో 12,348 కార్డులను ఏక్టివ్ చేసిన అధికారులు మిగతా కార్డులను వదిలేశారు. దీని వల్ల ఆయా కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం రేషన్ కార్డులు లేని వారితో పాటు ఉన్న వారికి వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వంలో కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్లదీ అదేదారి జిల్లాలో గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు 86,190 ఉన్నాయి. గతంలో 75వేల మంది సీఎస్ఆర్, దీపం పథకాలకు దరఖాస్తు చేసుకోగా అంతకు ముందు 11,190 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో మొత్తం 86,190 మంది గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం గ్రామ సభలు నిర్వహించి కనెక్షన్లు ఇవ్వాలని నిబంధనలు చెబుతుండగా అలా జరగడం లేదు. అయితే జన్మభూమి కమిటీలకు ఇవ్వాలన్న విషయమై స్పష్టత లేకపోవడంతో ఈ కనెక్షన్లను పెండింగ్‌లో ఉంచేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో 16,200 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. వాటి కోసం మండలాల వారీగా దరఖాస్తులు చేసుకున్నారు. అదేవిధంగా సీఎస్ఆర్ పేరిట ఉచిత గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని కోరగా వేలాది మంది మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వాటికి ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం లక్ష్యం నిర్ణయించలేదు. ఎంత మంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ కనెక్షన్లు ఇవ్వలేదు. మొత్తం 69,990 మంది ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 55,228 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు అర్హత ఉందని అధికారులు ప్రకటించారు. కానీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వలేదు. అలాగే డోర్‌లాక్, ఆధార్‌సీడింగ్ కారణాలతో 81వేల గ్యాస్ కనెక్షన్లు రద్దు చేశారు. వారంతా కూడా ఎదురుచూస్తున్నారు. -
గ్యాస్ కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల మహిళలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 75 వేల మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 1653 కనెక్షన్లు మాత్రమే అందించారు. దీపం, సీఎస్ఆర్ వంటి కనెక్షన్లు ఇవ్వడానికి కేటాయింపులు అధికంగానే ఉన్నప్పటికీ వాటిని లబ్ధిదారులకు అందించడంలో యంత్రాంగం చొరవ చూపడం లేదు. జిల్లాకు గతంలో 16 వేల దీపం కనెక్షన్లు మంజూరయ్యాయి. వాటిని ఎవరికీ అందజేయలేదు. ఆ తరువాత సీఎస్ఆర్ పేరుతో ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చారు. దీంతో జిల్లాలో 69, 990 మంది దరఖాస్త్తు చేసుకున్నారు. వీటిని కాచి వడపోసిన అధికారులు 55,125 మందిని అర్హులుగా తేల్చారు. అయితే ఐఓసీ, హెచ్పీసీలు ఒక్క గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వకపోగా బీపీసీ కంపెనీ ఏజెన్సీలు 1653 కనెక్షన్లు మాత్రే ఇచ్చాయి. గతంలో దీపం పథకం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా కనెక్షన్లు రాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సీఎస్ఆర్ పేరుతో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటికీ కనెక్షన్లు రిలీజ్ చేయలేదు. రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు అధికార పార్టీ నాయకులు తాము చెప్పిన వారికే ఇవ్వాలని మెలిక పెట్టడంతో కనెక్షన్ మంజూరులో జాప్యం జరుగుతోందని సమాచారం. ఆ మూడు నియోజకవర్గాలకు మరో 5 వేల కనెక్షన్లు జిల్లాలో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ల పంపిణీ పెండింగ్‌లో ఉంటే జిల్లాకు మరో 5 వేల కనెక్షన్లు మంజూరయ్యాయి. చీపురుపల్లి, ఎస్. కోట, విజయనగరం నియోజకవర్గాల్లో ఈ కనెక్షన్లు ఇచ్చేందుకు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యే, మంత్రులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. చీపురుపల్లికి రెండు వేల కనెక్షన్లు, ఎస్. కోట, విజయనగరం నియోజకవర్గాలకు 1500 చొప్పున గ్యాస్ కనెక్షన్లు మంజూ ర య్యాయి. వీటిని త్వరలో పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా కనెక్షన్లు పెండింగ్‌లో ఉండడంతో ప్రస్తుతం మంజూరైన అదనపు గ్యాస్ కనెక్షన్లు మరింత జాప్యం అవుతాయా ? లేక వెంటనే పంపిణీ చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే!. -
గ్యాస్ కనెక్షన్ల జాతర
♦ ఎంపికలోనూ మారని తీరు ♦ జన్మభూమి కమిటీలదే పెత్తనం ♦ నెలాఖరులోగా ఎంపిక ప్రక్రియ పూర్తి ఒకవైపు ఉచితం..మరొక వైపు దీపం..జిల్లాకు గ్యాస్ కనెక్షన్లు భారీ సంఖ్యలో మంజూరయ్యాయి. అదేస్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. కానీ వీటి ఎంపికలో మాత్రం ఒక వైపు జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తుంటే..మరొక వైపు అధికారులు, కమిటీలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : జిల్లాకు సామాజిక బాధ్యత పథకం(సీఎస్ఆర్) కింద 1.2లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం సంకల్పించింది. ఉచిత కనెక్షన్ల కోసం ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే చేపట్టారు. వీటికోసం 1,31,518 దరఖాస్తులు వచ్చాయి. జీవీఎంసీ,ఇతర మున్సిపాల్టీలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 1,17,171 దరఖాస్తులను ఏఎస్వో, సీఎస్డీటీలు పరిశీలించారు. ఇంకా 54,210 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. 1132 దరఖాస్తులను తిరస్కరించారు. ఏజెన్సీ పరిధిలో 42,910 దరఖాస్తులకు15,735 దరఖాస్తులను ఆమోదించారు. సాంకేతికకారణాలతో ఉన్నతాధికారులకు సిఫారసు చేసిన దరఖాస్తులు 14,347 ఉన్నాయి. ఏఎస్వో, సీఎస్డీటీలు అప్రూవ్ చేసిన 59,376 దరఖాస్తుదారులకు ఇప్పటికే వారి సెల్‌ఫోన్ నంబర్లకు మెసేజ్‌లు కూడా పంపుతున్నారు. వారికి ఏ ఏజెన్సీ పరిధిలో గ్యాస్కనెక్షన్ మంజూరైంది..ఎప్పటిలోగా తీసుకోవాలన్నది తెలియజేస్తూ ఈ మెసేజ్‌లు వస్తున్నాయి. వీటి విషయంలో జా యింట్ కలెక్టర్ జనార్దనన్ నివాస్ ప్ర త్యేక శ్రద్ధతో 60శాతం ఎంపిక పారదర్శకంగానే సాగింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు స్థానిక అధికారులు ఆన్లైన్లో వారే స్వయంగా దరఖాస్తులను అప్లోడ్ చేసి ఆమోదించారన్న వాదన ఉంది. గ్యాస్కనెక్షన్లేకపోవడం..తెలుపుకార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండడం దీనికి ప్రామాణికంగా పెట్టారు. జిల్లాలో కార్డులు...వాటి పరిధిలో ఉన్న యూనిట్ల సంఖ్యను బట్టి చూస్తే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతితో పాటు ఉన్నత వర్గాలకు చెందిన వేలాది మందికితెలుపుకార్డులున్నాయి. దీంతో పలువురు అధికారుల అండదండలతో ఉచిత కనెక్షన్లు పొందినట్టు తెలుస్తోంది. ఇలా సుమారు 30 శాతం పక్కదారి పట్టే పరిస్థితి చోటుచేసుకుంది. నెలాఖరులోగా ఉచితగ్యాస్ కనెక్షన్ల కోసం ఎంపికతో పాటుమంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం జిల్లాకు 25వేల దీపం కనెక్షన్లను మంజూరు చేసింది. నర్సీపట్నానికి 3,500, అనకాపల్లి, చోడవరానికి 1500 చొప్పున, యలమంచలి, గాజువాక, పెందుర్తి నియోజక వర్గాలకు వెయ్యేసి చొప్పున అదనంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత కనెక్షన్ల జారీ కొంత వరకు పారదర్శకంగా జరిగిన ప్పటికీ దీపం కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక మాత్రం అంతాలోపభూయిష్టంగా సాగుతోంది. ఇది తెలుగుతమ్ముళ్లకు వరంగా మారింది. పేరుకు ఏఎస్వో,రెవెన్యూఅధికారులకు ఎంపిక బాధ్యత ఇచ్చినప్పటికీ జన్మభూమి కమిటీల ఆమోదంతోనే ఎంపిక చేయాలన్న మెలికతో పెత్తనమంతా వారి చేతిలో పెట్టినట్టయింది. మార్చి నెలాఖరులోగానే వీటి ఎంపిక పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో ఎంపికలో చోటు చేసుకుంటున్న రాజకీయాల వల్ల తీవ్ర జాప్యంజరుగుతోంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలకు జన్మభూమికమిటీలు ఆమోద ముద్ర వేస్తుండడంతో అధికారుల ఎంపిక చేసిన జాబితాలు బుట్టదాఖలవుతున్నాయి. జన్మభూమి కమిటీల మితిమీరిన జోక్యం వల్ల అధికారులుతీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అర్హత ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే చెప్పారు.. చేయాల్సిందే దోరణిలో ఈ కమిటీలు పెత్తనంతో ఎంపికలో అధికారులు మిన్నకుండిపోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేయాలన్న పట్టుదలతో అధికారులు పనిచేస్తున్నప్పటికీ కమిటీలు గంటకో జాబితాతో గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు అధికారులు ఎంపికలో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.