అక్టోబర్ నాటికి నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు
Published Sat, Sep 10 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో వచ్చే అక్టోబర్ నెలాఖరులోగా రెండు లక్షల గ్యాస్ క¯ð క్షన్లు ఇచ్చి నూరుశాతం పూర్తి చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. కలెక్టరేట్‌లో శుక్రవారం దీపం పథకంపై జిల్లాలోని గ్యాస్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన వారికి 11 లక్షల గ్యాస్ క¯ð క్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే 9 లక్షల గ్యాస్ క¯ð క్షన్లు అందించామని, రెండు లక్షలు అక్టోబరు నెలాఖరులోగా అందిస్తామన్నారు. సమావేశంలో డీఎస్‌వో డి.శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement