సగం మందికి నో గ్యాస్ | No gas for so many | Sakshi
Sakshi News home page

సగం మందికి నో గ్యాస్

Published Sun, Sep 20 2015 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

సగం మందికి నో గ్యాస్

సగం మందికి నో గ్యాస్

♦ ఇంటిగ్రేటెడ్ సర్వేలో గుర్తింపు
♦ జిల్లాలో 5.50 లక్షల కార్డుదారులకే గ్యాస్
♦ అర్హుల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు
♦ మార్చి 31లోగా 1.50 లక్షల దీపం కనెక్షన్లు
♦ నెలకు 25 వేల కనెక్షన్ల పంపిణీకి చర్యలు
 
 సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో అల్పాదాయ వర్గాల(బీపీఎల్)కు చెందిన వారిలో సగం మందికి గ్యాస్ కనెక్షన్ లేదని లెక్కతేల్చారు. వీరిలో అర్హులను గుర్తించి దీపం పథకంలో కొత్త కనెక్షన్లు మంజూరుకు చర్యలు చేపట్టారు. నెలకు కనీసం 25వేల కనెక్షన్ల చొప్పున 2016 మార్చి 31లోగా జిల్లాలో 1.50 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీపీఎల్ కార్డు కలిగి ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ లేకుంటే కొత్త గ్యాస్ కనెక్షన్ వచ్చినట్టే.

 ఏజెన్సీలో 43,978 మందికే గ్యాస్
 ఇంటిగ్రేటెడ్ సర్వే మేనేజ్‌మెంట్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ వద్ద ఉన్న గణాంకాలను బట్టి జిల్లాలో 10,85,573 బీపీఎల్ కార్డుల్లో 5,49,595 కార్డుదారులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన 5,35,978 కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్ లేదని నిర్ధారణకు వచ్చారు. వీరిలో అత్యధికం ఏజెన్సీ పరిధిలోనే ఉన్నారు. ఏజెన్సీలో 2,19,092 కార్డుదారులుంటే వారిలో కేవలం 43,978 మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కార్డు తీసుకునేటప్పుడు, ఆ తర్వాత డీలర్ల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం లెక్కతేలిన ఈ జాబితాపై నిగ్గు తేల్చేందుకు ఇంటింటా సర్వే జరపాలని ఇప్పటికే తహశీల్దార్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గ్యాస్ కనెక్షన్లు లేని వారిలో ఎవరైనా ఈ మధ్యకాలంలో గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా? లేదా అని ఆరా తీస్తున్నారు. ఎంతలేదనుకున్నా మరో నాలుగు లక్షలకుపైగా గా్‌‌యస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉంటుందని అంచనా.

 బీపీఎల్ కార్డుదారులందరికీ గ్యాస్
 సాచురేషన్ పద్ధతిలో అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న సర్కారు తొలి విడతగా జిల్లాకు 1.50 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేసింది. గతేడాది మంజూరు చేసిన 33 వేల కనెక్షన్లు ఇంకా పంపిణీ జరగకపోవడంతో వాటితో సహా 2016 మార్చి 31లోగా జిల్లాలో 1.50 లక్షల దీపం కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఆ మేరకు గ్యాస్ కంపెనీలకు సబ్సిడీమొత్తాన్ని సర్కార్ జమ చేసిందంటున్నారు. జన్మభూమి కమిటీలతో ప్రమేయం లేకుండా గ్యాస్ కనెక్షన్ లేని బీపీఎల్ కార్డుదారులందరికీ దీపం కనెక్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టామని రూరల్ డీఎస్‌ఓ శాంతకుమారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement