శివాజీనగర: వైట్‌బోర్డు కారు కలిగినవారి బీపీఎల్ కార్డు (రేషన్ కార్డు) రద్దు చేస్తామని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప వెల్లడించారు. అయితే ఉపాధి కోసం కారు కొనుగోలు చేసిన వారి కార్డును రద్దు చేయబోమని చెప్పారు. శుక్రవారం విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం 5కేజీల బియ్యం, మిగతా ఐదు కేజీలకు బదులుగా నగదు ఇస్తున్నామని, దీర్ఘకాలం నగదు ఇవ్వడం సాధ్యం కాదన్నారు.
సెప్టెంబర్ నుంచి బీపీఎల్ కార్డుదారులకు 10 కేజీల బియ్యం ఇస్తామన్నారు. బియ్యం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. బియ్యంతో పాటు రాగి, జొన్నలు పంపిణీ చేసే విషయంపై కూడా యోచిస్తున్నామన్నారు. ఇందుకోసం 2023–24వ సంవత్సరంలో 8 లక్షల టన్నుల రాగులు, 3 లక్షల టన్నుల జొన్నలు కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు.
చదవండి మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది!
Comments
Please login to add a commentAdd a comment