ఏమన్నారు బాబూ! | Today everything clue margamantunnaru | Sakshi
Sakshi News home page

ఏమన్నారు బాబూ!

Published Sat, Aug 9 2014 3:42 AM | Last Updated on Mon, Aug 20 2018 9:21 PM

ఏమన్నారు బాబూ! - Sakshi

ఏమన్నారు బాబూ!

  • నాడు ‘ఆధార్’ను తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ
  •  గ్యాస్‌తో అనుసంధానంపై ఆందోళనలు చేశారు
  •  నేడు అన్నిటికీ ఆధారమే మార్గమంటున్నారు
  • ‘ఆడబిడ్డలు పొయ్యిల దగ్గర కూర్చుని కష్టపడ్డారు. వంట కోసం కట్టెలకు తిప్పలుపడ్డారు. అందుకే దీపం పథకం పెట్టి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ఇప్పుడేమో ఆధార్‌తో గ్యాస్‌ను అనుసంధానం చేశారు. పైగా నగదు బదిలీ పెట్టారు.ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది. మహిళల కష్టాలు తీరుస్తాను.
     - ప్రతిపక్ష నేత హోదాలో పలు సందర్భాల్లో బాబు చెప్పిన మాటలు
     
     ‘ఆధార్ న మోదు తప్పనిసరి. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేస్తాం. మార్చిలోపు అందరికీ ఆధార్ కార్డు ఉండేలా చూస్తాం.’
     - సీఎం చంద్రబాబు

     
    సాక్షి, చిత్తూరు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధార్‌కార్డుకు ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకించి ఆందోళనలు చేసిన టీడీపీ ఇప్పుడు ఆధారమే మార్గమంటూ నడుస్తోంది. ప్రభుత్వ పథకానికి ‘ఆధార్’ నమోదు  తప్పనిసరి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీఎం ప్రకటనపై ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
     
    నాడు రోడ్డెక్కిన టీడీపీ

    ప్రభుత్వ పథకాలు ఏవె నా లబ్ధిదారులకు ఆధార్ తప్పనిసరి అవుతోంది. మూడేళ్ల కిందట ఆధార్‌రూ. ప్రక్రియ ప్రారంభమైంది. కొందరికి కార్డులు వచ్చాయి. వాటిల్లో కొన్నింట తప్పులు దొర్లాయి. కొందరికి ఇప్పటికీ కార్డులు అందలేదు. ఇలా ఆధార్‌రూ.లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు నగదుబదిలీని అమలు చేసింది. లబ్ధిదారులకు సరిగా డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థారులో ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. గ్యాస్‌కు ఆధార్‌తో లింకుపెట్టి మహిళలను వేధిస్తున్నారని టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. గ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకుని ధర్నాలు చేశారు. ప్రభుత్వ పథకాలకు, ఆధార్‌తో ముడిపెట్టొద్దని డిమాండ్ చేశారు. తర్వాత ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆధార్‌రూ. లింకుకు ప్రభుత్వం బ్రేక్ వేసింది.
     
    ఇప్పుడు అన్నిటికీ  ఆధార్‌రూ. తప్పనిసరి :

    అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే చంద్రబాబు గతం మరిచిపోయూరు. తాజాగా ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్‌రూ. తప్పనిసరి అని లబ్ధిదారుల గుండెల్లో గుబులు పుట్టించారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు...విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు మెడికల్‌బిల్లులు, ఉపాధికూలీ, సామాజిక పింఛన్లు, ఉపకారవేతనాలు, ఐకేపీ రుణాలు, ఇళ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్, బ్యాంకులు...ఇలా ప్రతీ అంశానికి ఆధార్‌రూ.తో ముడిపెట్టనున్నారు. ప్రస్తుతం ఆధార్ మంజూరు ప్రక్రియ పూర్తికాలేదు. వచ్చిన కార్డుల్లో బోలెడు తప్పులు దొర్లాయి. ఇలాంటి క్రమంలో ప్రతి పథకానికి ఆధార్ ముడిపెడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా కొన్ని పథకాలకే ఆధార్‌ను ముడిపెట్టి, ఆపై వాటికీ తొలగించిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలన్నిటికీ ఆధార్‌ను ముడిపెట్టడం సరికాదని చెబుతున్నారు.
     
    జిల్లాలో ఆధార్‌రూ. పరిస్థితి ఇది :
    జిల్లా వ్యాప్తంగా 37,85,828 ఆధార్‌కార్డులు బెంగళూరు ఆధార్ ప్రింటింగ్ స్టేషన్లో నమోదయ్యాయి. ఇందులో 34,76,812 మందికి కార్డులు జారీ అయ్యాయి. తక్కినవి పంపిణీ చేయాల్సి ఉంది. నమోదైనవాటిలో 78వేల కార్డుల్లో తప్పులు దొర్లాయి. ఇవి కాకుండా మరో 4-5లక్షల మందికి ఆధార్ నమోదు చేయాలి. ప్రస్తుతం ఆధార్ నమోదుకు బ్రేక్ పడింది.
     
    87శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయింది
    ఆధార్‌కార్డుల నమోదు 87శాతం పూర్తయింది. ప్రస్తుతం తప్పులు దొర్లినవాటిని సరిచేస్తున్నాం. మొత్తం 34.76లక్షల కార్డుల్లో 29.45,835 యూనిట్లు రేషన్‌కార్డులతో అనుసంధానం అయ్యాయి. ప్రతి మీసేవా సెంటర్‌లో ఆధార్ నమోదు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ఆధార్‌కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే !
     -  విజయరాణి, డీఎస్‌ఓ
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement