
ఎంపీ చామలకు వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాల యాల్లో పూర్తిస్థాయి వైస్ చాన్స్‌లర్ల (వీసీ) ను నియమిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలి పారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో వీసీల నియామకం కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. కేంద్రమంత్రికి లేఖ రాశా రు.
ఈ లేఖకు స్పందించి ఆయన ప్రత్యుత్తరం రాశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇఫ్లూ, హైదరాబాద్ ఐఐటీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లో బోధన సిబ్బంది నియామకాల్లో ఓబీసీ రిజ ర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని మ రో లేఖలో ఎంపీ చామల కోరగా.. శాఖాపరంగా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రత్యుత్తరంలో వెల్లడించారు.