న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో పూర్తిస్థాయిలో, దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారుల్ని ఆదేశించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని 11 పెట్రోల్ బంకుల్లో మెషీన్లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని నిర్ధారణ కావడంతో కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు ఉన్నతాధికారుల్ని సస్పెండ్ చేసినట్లు ప్రధాన్ సోమవారం మీడియాకు తెలిపారు.
మెషీన్లను ట్యాంపరింగ్ చేసి వినియోగదారుల్ని మోసం చేస్తున్న పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు సైతం రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. పెట్రోల్ ఔట్‌లెట్లను తనీఖీ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉందన్న ప్రధాన్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సైతం ఇందుకు బాధ్యులేనని తేల్చిచెప్పారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్) నిర్వహించిన దాడుల్లో 11 పెట్రోల్ బంకుల్లో మెషీన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా లీటర్‌కు 50 మిల్లీలీటర్ల మేర పెట్రోల్ తక్కువగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో తనిఖీలు
Published Mon, May 1 2017 8:10 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement