చమురు ధరల్లో మార్పులు కొనసాగుతాయి: కేంద్రం | Dharmendra Pradhan says daily petrol, diesel price | Sakshi
Sakshi News home page

చమురు ధరల్లో మార్పులు కొనసాగుతాయి: కేంద్రం

Published Tue, Sep 5 2017 1:10 AM | Last Updated on Tue, Sep 12 2017 1:51 AM

Dharmendra Pradhan says daily petrol, diesel price

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా ప్రస్తుతం దేశంలో అవలంబిస్తున్న రోజువారీ పెట్రోల్, డీజిల్‌ ధరల మార్పుల విధానం ఇకపై కూడా కొనసాగుతుందని నూతన పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. దీని వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులు పొందవచ్చన్నారు.

పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌ను ఇంటికే సరఫరా చేసే నూతన విధానానికి భద్రతా సంస్థల నుంచి ఆమోదం పొందేందుకు తమ శాఖ ప్రయత్నిస్తోందని తెలిపారు. గతంలో పెట్రోలి యం శాఖ స్వతంత్ర మంత్రిగా పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ తాజా మంత్రి వర్గ విస్తరణలో పెట్రోలియం శాఖ మంత్రిగా ప్రమోషన్‌ పొందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement