oil price
-
కిలో మునక్కాయలు రూ. 400, కూరగాయల ధరలకు రెక్కలు
దాదర్: మహారాష్ట్రవ్యాప్తంగా పప్పు దినుసులు, కూరగాయలు ఇతర నిత్యవసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న పప్పు దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, టమాటా, ఆకుకూరలు, ఇతర కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒకపక్క మహాయుతి ప్రభుత్వం లాడ్కి బహిన్ పథకం ప్రవేశపెట్టి అక్కచెల్లెళ్లను సంతోషపెడుతూనే మరోపక్క నిత్యవసర సరుకుల ధరలు అందుబాటులో లేకుండా పోయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు నియంత్రణలో ఉన్న ధరలు ఇప్పుడు భారీగా పెరిగిపోవడంతో వీటిని కొనుగోలు చేసేందుకు సాధారణ, మధ్యతరగతి ప్రజలు వెనుకాడుతున్నారు. కోస్తే కాదు..కొనాలన్నా కన్నీళ్లే... ముంబైసహా ఇతర ప్రధాన నగరాలన్నిటిలోనూ ప్రస్తుతం ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. న్యూ ముంబైలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) హోల్‌సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.40–60 ఉండగా ఇప్పుడది ఏకంగా రూ.80–100 ధర పలుకుతోంది. నాణ్యతను బట్టి కేజీ రూ.110–120 ధర కూడా పలుకుతోంది. అదేవిధంగా రూ.10–15 ధర పలికిన వివిధ ఆకు కూరలు ఇప్పుడు రూ.30–40 ధర పలుకుతున్నాయి. రాష్ట్రంలోని హోల్‌సేల్ మార్కెట్లోకి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో సరుకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉల్లి, వెల్లుల్లితోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ధరలు అందుబాటులో లేకుండా పోయాయాని వ్యాపారులు చెబుతున్నారు. కూడా అపార నష్టం వాటిల్లింది. దీని ప్రభావం ధరలపై పడుతోందని వ్యాపారులు అంటున్నారు.వంటనూనెలదీ ఇదే దారి... కూరగాయలు, పప్పుదినుసులతోపాటు వంటనూనెధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మొన్నటి వరకు రూ.100–120 ధర పలికిన లీటరు వంటనూనె ప్యాకెట్ ఇప్పుడు ఏకంగా రూ.165 ధర పలుకుతోంది. అలాగే రూ.90 ధర పలికిన పామాయిల్ ఇప్పుడు రూ.130 పలుకుతోంది. సామాన్యులు తినే సాధారణ బియ్యం, గోధుమలు, పప్పుదినుసులు, ఆఖరుకు కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఏం తిని బతకాలంటూ పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. -
వంటనూనెల రేట్లు పెంచొద్దు
న్యూఢిల్లీ: ఇటీవల దిగుమతి సుంకాలు పెంచినప్పటికీ రిటైల్ ధరలను (ఎంఆర్పీ) పెంచొద్దంటూ వంటనూనెల కంపెనీలకు కేంద్ర ఆహార శాఖ సూచించింది. తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకున్న ఆయిల్స్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఇలా దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు 30 లక్షల టన్నుల మేర ఉంటాయని, అవి 45–50 రోజులకు సరిపోతాయని వివరించింది.సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అసోసియేషన్ (ఎస్ఈఏ), ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) తదితర సంస్థల ప్రతినిధులతో ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా భేటీ అనంతరం ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో ఈ విషయాలు పేర్కొంది.దేశీయంగా నూనెగింజల ధరలకు మద్దతు కల్పించే దిశగా కేంద్రం గత వారం వివిధ రకాల వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచింది. సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చిన ఆదేశాల ప్రకారం ముడి సోయాబీన్ ఆయిల్, ముడి పామాయిల్ మొదలైన వాటిపై డ్యూటీ సున్నా స్థాయి నుంచి 20 శాతానికి పెరిగింది. ఇతరత్రా అంశాలన్నీ కూడా కలిస్తే ముడి నూనెలపై ఇది 27.5 శాతంగా ఉంటుంది.మరోవైపు, రిఫైన్డ్ పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మొదలైన వాటిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి, నికరంగా 37.5 శాతానికి పెరిగింది. భారత్ పామాయిల్‌ను మలేషియా, ఇండొనేషియా నుంచి, సోయాబీన్ ఆయిల్‌ను బ్రెజిల్, అర్జెంటీనా నుంచి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. -
భారత్ ఎకానమీకి ఢోకాలేదు: అనంత నాగేశ్వరన్
ముంబై: అంతర్జాతీయ కారణాలతో చమురు ధరల్లో పెరుగుదలసహా ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు వచ్చే ఆర్థిక సంవత్సరం (2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి) భారత్ ఎకానమీపై ప్రభావం చూపుతాయని తాను భావించడం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఆర్బీఐ అంచనాల ప్రకారం, 7 శాతం వృద్ధి ఖాయమని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ నిర్వహించిన ఒక ఎకనమిక్ కన్‌క్లేవ్‌లో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్ల తగ్గుదలకు ముందు ఆర్థిక క్రియాశీలత నెమ్మదిస్తుందన్నది తన అభిప్రాయమని అన్నారు. -
భారీగా తగ్గనున్న రిఫైన్డ్ ఆయిల్ ధరలు..!
-
సామాన్యులకు భారీ ఊరట..తగ్గనున్న వంట నూనె ధరలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విపణికి అనుగుణంగా వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన వంట నూనెల గరిష్ట రిటైల్ ధరను లీటరుకు రూ.8–12 తగ్గించాలని స్పష్టం చేసింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సహా పరిశ్రమ ప్రతినిధులతో ఫుడ్ సెక్రటరీ సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాలను ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ఇచ్చే ధర కూడా తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని వివరించింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ధర తగ్గింపు జరిగినప్పుడల్లా.. విక్రేతల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందడంతోపాటు మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి అని వెల్లడించింది. భారతీయ వినియోగదారులు తినే నూనెల కోసం తక్కువ ఖర్చు చేయాలని ఆశిస్తారు. దిగొస్తున్న వంట నూనెల ధరలు ద్రవ్యోల్బణ భయాలను తగ్గించేందుకు సాయపడతాయి అని ఆహార మంత్రిత్వ శాఖ వివరించింది. అధిక తయారీ వ్యయం, రవాణా ఖర్చుతో సహా అనేక భౌగోళిక రాజకీయ కారణాలతో 2021–22లో అంతర్జాతీయ, దేశీయంగా తినే నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. 2022 జూన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. -
రష్యా చమురు ధరపై పరిమితితో సంక్షోభం!
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా, దాని మిత్రదేశాలూ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే కొత్తగా జీ7, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ దేశాలు... రష్యా ఎగుమతి చేసే ముడి చమురు ధరపై బ్యారెల్‌కు 60 డాలర్ల కనీస పరిమితి విధిస్తూ క్రితం వారం నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఒపెక్ ప్లస్ (రష్యా) దేశాలు మాత్రం రానున్న నెలల్లో ముడిచమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల బ్యారెల్స్ తగ్గిస్తామని వెల్లడించాయి. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు మందకొండిగా ఉండటమే ఇందుకు కారణమంటున్నాయి. కాగా చమురు ఉత్పత్తిని పెంచమని అమెరికా అధ్యక్షుడు సౌదీ అరేబియాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రపంచ చమురు ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో రష్యా ఉంది. చమురు ధరపై కనీస పరిమితి విధించి చమురు ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయాలను నీరుగార్చి రష్యా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి తీసుకెళ్లాలనేది ఈయూ దేశాల తపన. ఇది సఫలీకృతమైతే అమెరికా తన ఆధిపత్యం కొనసాగనీయ వచ్చనేది వ్యూహం. రష్యా ముడిచమురు ధరపై పరిమితి విధించడాన్ని క్రెమ్లిన్ తీవ్రస్థాయిలో ఖండించింది. రష్యాపై ఆంక్షలు విధించినప్పుడల్లా ప్రపంచ దేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై అవి తీవ్ర ప్రతికూల ప్రభావాల్ని కలుగ జేస్తున్నాయని రష్యా గుర్తుచేసింది. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ముడిచమురు ధరలు 2022 ఫిబ్రవరి నుండి పెరుగుతూ వస్తున్నాయి. దీనితో ఈ సంవత్సరం రష్యా అదనంగా 41 శాతం లాభాలను పెంచుకొని ఆంక్షలు విధించిన దేశాలకు, అమెరికాకు షాక్ ఇచ్చింది. రష్యాతో స్నేహంగా లేని దేశాలకు మొత్తం ముడిచమురు ఎగుమతులను ఆపేసి, ప్రత్యామ్నాయ మార్కెట్లుగా వేరే దేశాలను (భారత్, చైనాలు) ప్రోత్సహిస్తామని రష్యా అంటోంది. మన విదేశాంగమంత్రి జైశంకర్ కూడా రష్యాపై ఆంక్షలకూ భారత్‌కూ సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ వారంలో జర్మనీ విదేశాంగమంత్రి అన్నాలేనా బేర్బాక్ న్యూఢిల్లీలో జైశంకర్‌ను కలిసి ఈయూ విధించిన పరిమితి ధరకు మద్దతునివ్వాలని అభ్యర్థించగా జైశంకర్ తోసి పుచ్చారు. యూరప్ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత్ ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోజాలదని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం కాక ముందునుందే భారత్, రష్యాల మధ్య ముడిచమురు వాణిజ్యం ఉందని జైశంకర్ అన్నారు. బ్యారెల్ ముడి చమురు ధర 60 డాలర్లకూ, అంత కన్నా తక్కువ బిల్లు చేస్తే... ప్రపంచ ఇన్సూరెన్స్ కంపె నీలు బీమా చేయడానికి ముందుకురావు. దీనితో రష్యా ముడిచమురు రవాణా స్తంభించి పోతుందని ఈయూ ఆలోచన. ముడి చమురుపై పరిమితి విధించిన రెండురోజుల్లో బ్యారెల్ చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 2 శాతం పెరిగింది. పరిశ్రమలకు అత్యంత అవసరమైన ఇంధన రవాణాను నిలిపివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమైపోతాయి. ఇదివరలో యూరప్ దేశాలకు రష్యా ముడి చమురు చాలా ఎగుమతి జరిగేది. తాత్కాలికంగా కొంతమేర దిగుమతులు ఆపినప్పటికీ రష్యా ఇంధనాన్ని ఈయూ దేశాలు వేరే మూడవ దేశం ద్వారా దిగుమతి చేసుకొంటున్నాయి. లిథువేనియా 83 శాతం, ఫిన్లాండ్ 80 శాతం, స్లొవేకియా 74 శాతం, పోలాండ్ 58 శాతం, హంగేరి 43 శాతం, ఎస్తోనియా 34 శాతం, జర్మనీ 30 శాతం, గ్రీస్ 29 శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. మిగతా దేశాల దిగుమతి కూడా ఇంచు మించు 15 శాతం తగ్గకుండా ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా ధరల పరిమితి విధింపుతో రష్యాతోపాటుగా ఈయూ దేశాల ఆర్థిక వ్యవస్థలూ చాలా నష్టపోనున్నాయి. రానున్న వారాల్లో ముడి చమురు ధర అంతర్జాతీయంగా 100 డాలర్లు దాటుతుందని నిపుణుల అభిప్రాయం. ఇదివరకటి ‘విన్–విన్’ వాణిజ్య పరిస్థితులు ఇప్పుడు ‘లాస్–లాస్’ పరిస్థితులుగా పరిణమించాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ధరలు తగ్గినప్పుడల్లా లాభాలను కార్పొరేట్లు అనుభవిస్తున్నారు. ధరలు పెరుగు తునప్పుడు నష్టాల భారాన్ని ప్రజలపై మోపటంతో ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రతి దేశంలోనూ ద్రవ్యోల్బణం పెరుగుదలతోపాటు నిరుద్యోగం, నిత్యా వసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇందువల్ల జీవన ప్రమాణాలు తగ్గిపోతూ ఆర్థిక మాంద్యం వైపు దేశాలు కుంటుతున్నాయి. ఉక్రెయిన్–రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన సైనికుల కంటే... ఈ చలికాలం యూరప్‌లో ప్రజలు ఇంధన కొరతతో ఎన్నో రెట్లు చలిబారిన పడి చనిపోతారని అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని నివారించక, శాంతి చర్చలు జరగనీయకుండా ఆయుధాలతో, ఆంక్షలతో యుద్ధం పరిసమాప్తమవుతుందని అనుకోవటం అవివేకం. ఇప్పటికే రష్యాపై ఆంక్షలతో యూరప్ ప్రజలు, పరోక్షంగా అభివృద్ధి చెందుతున్న దేశాలూ తీవ్రంగా నష్టపోతున్నాయి. అమెరికా మాత్రం లబ్ధిపొందుతోంది. 3 సంవత్సరాల క్రితం ఒపెక్ దేశాలు, రష్యా ఆర్థిక వ్యవస్థలను నష్ట పరచే విధంగా అమెరికా షేల్ చమురును ప్రవేశపెట్టడంతో బ్యారెల్ చమురు 28 డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా విధించిన ఈ కనీస 60 డాలర్ల పరిమితి వల్ల నష్టపోయేదీ ఈయూ దేశాలే. ప్రపంచ సాకర్ వేళ ఇది ఈయూ ‘సెల్ఫ్ గోల్’ కానుందా! (క్లిక్ చేయండి: డేటా రక్షణకు ఢోకా లేనట్లేనా?!) - బుడ్డిగ జమిందార్ అసోసియేట్ ప్రొఫెసర్, కె. ఎల్. వర్సిటీ -
పాక్‌లో లీటరు వంట నూనెపై ఒకేసారి రూ. 213 పెంపు
అబ్బే! భారత్ పంపిన రహస్య డ్రోన్ కాద్సార్!మన వంట నూనె ధరలు -
పామాయిల్ ‘పంట’ పండుతోంది!
-
ఎంత పని చేశావ్ రష్యా ! భారీగా పెరిగిన బంగారం ధర
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైంది బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ యుద్ధంలో ప్రపంచంలో శక్తివంతమైన యూరప్ దేశాలు, అమెరికాలతో ముడిపడి ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు అతాలకుతలం అవుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ ఎఫెక్ట్‌తో రెండేళ్లుగా మందగించిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ తరుణంలో రష్యా మొదలుపెట్టిన యుద్ధం మార్కెట్‌కు చేటు తెచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగిస్తున్న బాంబులు, రాకెట్లు, తుటాల ఎఫెక్ట్ చమురు, బంగారం ధరలపై నేరుగా కనిపిస్తుంది. బంగారం 30 శాతం క్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైందన వార్తలు రావడం. అందుకు సంబంధించిన వీడియోలు అన్ని న్యూస్ ఛానళ్లలో ప్రసారం అవుతుండటంతో మార్కెట్ షేక్ అయ్యింది. బంగారం ధరలు ఒక్క రోజు వ్యవధిలోనే 30 శాతం పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకి రూ. 850 పెరిగింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకి రూ. 930లు పెరిగింది. 2022 ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటల సమయంలో ఆభరణాల తయారీలో ఉపయోగించే బంగారం తులం ధర రూ. 46,850 దగ్గర ట్రేడవుతుండగా స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.51,100లుగా ఉంది. సెంచరీని తాకింది గత మూడు నాలుగు రోజులుగా 97 , 98 డాలర్ల దగ్గర అటు ఇటు ఊగిసలాడుతున్న క్రూడ్ ఆయిల్ ధర యుద్ధం మొదలు కాగానే 2022 ఫిబ్రవరి 24 ఉదయం వంద డాలర్ల ( 99.72) డాలర్లకు చేరుకుంది. యుద్ధ తీవ్రత మరింతగా కొనసాగి.. అటు ఆంక్షలు కూడా పెరిగితే ముడి చమురు ధరలకు కళ్లెం వేయడం అసాధ్యమయ్యే పరిస్థితి ఎదురు కానుంది. వాత తప్పదా? 2014లో ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు పైన నమోదు అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. కోవిడ్ సంక్షోభంలో ఎదురైన నష్టాలు పూడ్చుకునేందుకు చమురు ఉత్పత్తి దేశాలు అవలంభించిన వ్యూహంతో నిన్నా మొన్నటి వరకు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టు రష్యా దండయాత్రతో పరిస్థితి మరింత ఘోరంగా మారనుంది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర వంద డాలర్లు దాటితే మన దగ్గర లీటరు పెట్రోలు, డీజిల్‌ల ధర కనిష్టంగా రూ.7 నుంచి 8 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. చదవండి: ఉక్రెయిన్‌లో బాంబుల మోత.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ల సూచీలు -
Petrol Diesel Prices: మరోసారి పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇంధన ఛార్జీలు సవరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత... మొదట్లో సగటున ప్రతీ పదిహేను రోజులకు ఓసారి పెట్రోలు ధర పెరిగేది. ఆ తర్వాత వారానికి పడిపోయింది. ఇప్పుడు దాదాపు రోజుకు ఒకసారి పెరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. గురువారం లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 11 పైసలు పెంపు విధించాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంచుమించు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక జులైలో అయితే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దాదాపు ప్రతీ రోజు పెట్రోలు ధర పెరిగింది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్ లీటర్ వంద మార్క్‌ను దాటేసింది. ఈ నెలలో ఇది ఆరో పెంపు. పది రాష్రా్టలపై పెట్రో ఉత్పత్తుల పెంపు ప్రభావం పడింది. తాజా పెరుగుదలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.50పై కాగా, డీజిల్ ధర రూ.97.68పై.గా ఉంది. ఇక అత్యధికంగా భోపాల్‌లో రూ.108గా ఉండగా, డీజిల్ ధర రూ.98గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.106- డిజీల్ రూ.92గా ఉంది. -
ఇరాన్ దాడి : భగ్గుమన్న చమురు
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సైనిక దాడి మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను రాజేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇరాక్‌లోని అమెరికా రెండు ఎయిర్‌బేస్‌లపై క్షిపణి దాడి అనంతరం బుదవారం ఉదయం చమురు ధర 4.5 శాతం ఎగిసింది. డబ్ల్యుటిఐ 4.53 శాతం పెరిగి బ్యారెల్ 65.54 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు ధర ఒకదశలో 70 డాలర్లును దాటింది. ప్రస్తుతం 69.29 వద్ద వుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు కూడా బలహీనంగా ఉన్నాయి. మరోవైపు మంగళవారం కొద్దిగా శాంతించిన బంగారం ధరలు నేడు మరోసారి పుంజుకున్నాయి. ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. మిలిటరీ కమాండర్ ఖాసేం సులేమాని అమెరికా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్లో స్పందించారు. దాడిని ధృవీకరించిన ట్రంప్, అక్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నామనీ, తమ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలున్నాయని హెచ్చరించారు. దీనిపై రేపు (గురువారం) ఒక ప్రకటన చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. చదవండి : అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు రేపే ప్రకటన.. ఆత్మరక్షణ కోసమే -
బంగారం.. చమురు భగ్గు!
న్యూఢిల్లీ: ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సొలేమానిని అమెరికా హతమార్చడం.. భౌగోళిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అంతర్జాతీయంగా అనిశ్చితి భయాలతో ఇన్వెస్టర్లు.. సురక్షిత సాధనాల వైపు మొగ్గు చూపారు. దీంతో బంగారం, క్రూడ్, డాలర్ ఇండెక్స్ శుక్రవారం భారీగా పెరిగాయి. వేర్వేరుగా ఆయా అంశాలపై దృష్టి సారిస్తే... బంగారం: అంతర్జాతీయ ఫ్యూచర్స్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో శుక్రవారం బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర 25 డాలర్లు ఎగసి 1,553.95 డాలర్ల స్థాయి తాకింది. పసిడికి ఇది నాలుగు నెలల గరిష్టస్థాయి. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో ఒక దశలో 10 గ్రాములు.. 24 స్వచ్ఛత పసిడి ధర రూ.791 లాభంతో రూ.40,068 వద్ద ట్రేడయ్యింది. గురువారంతో పోలి్చతే ఇది 2 శాతంకన్నా అధికం. వెండి కేజీ ధర కూడా ఒకశాతం పైగా పెరుగుదలతో రూ. 47,507 వద్ద ట్రేడయ్యింది. దేశంలోని పలు స్పాట్ మార్కెట్లలో కూడా పసిడి ధరలు రూ.40,000, వెండి ధరలు 51,000పైన ముగియడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర లాభాలతో.. 18.14 డాలర్లను తాకింది. రూపాయి బలహీనత కొనసాగి, అంతర్జాతీయంగా ధరలు పటిష్టంగా ఉంటే.. సోమవారం దేశీ స్పాట్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్: ఇక క్రూడ్ విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్లో స్వీట్ నైమెక్స్ బ్యారల్ ధర ఒక దశలో 4 శాతం పెరిగి 64 డాలర్ల స్థాయిని తాకింది. మరోవైపు దాడులకు తీవ్ర ప్రతీకార చర్యలు తప్పవంటూ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో బంగారం సహా క్రూడ్ ధర కూడా భారీగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నది నిపుణుల అంచనా. డాలర్ ఇండెక్స్ కూడా ఫ్యూచర్స్ మార్కెట్లో పటిష్టంగా (96.48) కొనసాగుతుండడం గమనార్హం. రూపాయి... 42పైసలు పతనం ముంబై: అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సోలేమని హతమవడం రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 42పైసలు పతనమైంది. నెలన్నర కనిష్టం 71.80కి పడిపోయింది. అమెరికా దాడి... ఇరాన్ హెచ్చరికలు.. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల భారీ పెరుగుదల... ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 71.56 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒకదశలో 71.81ని కూడా చూసింది. వారంవారీగా రూపాయి 45 పైసలు నష్టపోవడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. -
చమురు ధరల్లో మార్పులు కొనసాగుతాయి: కేంద్రం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా ప్రస్తుతం దేశంలో అవలంబిస్తున్న రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరల మార్పుల విధానం ఇకపై కూడా కొనసాగుతుందని నూతన పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. దీని వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులు పొందవచ్చన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌ను ఇంటికే సరఫరా చేసే నూతన విధానానికి భద్రతా సంస్థల నుంచి ఆమోదం పొందేందుకు తమ శాఖ ప్రయత్నిస్తోందని తెలిపారు. గతంలో పెట్రోలి యం శాఖ స్వతంత్ర మంత్రిగా పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్ తాజా మంత్రి వర్గ విస్తరణలో పెట్రోలియం శాఖ మంత్రిగా ప్రమోషన్ పొందారు. -
ఆరు వారాల గరిష్టం
330 పాయింట్ల హైజంప్ 27,702కు చేరిన సెన్సెక్స్ ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ అండ చివరి గంటలో కొనుగోళ్ల వెల్లువ విదేశీ అంశాల జోష్‌తో దేశీ స్టాక్ మార్కెట్లు రివ్వున పెకైగశాయి. చమురు ధరలతోపాటు, రష్యా రూబుల్ బలపడటం, ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాలు ఆర్జించడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చాయి. వెరసి సెన్సెక్స్ 330 పాయింట్ల హైజంప్ చేసింది. 27,702 వద్ద నిలిచింది. ఇది ఆరు వారాల గరిష్టంకాగా, నిఫ్టీ 99 పాయింట్లు పురోగమించి 8,300 కీలక స్థాయిని అధిగమించింది. 8,324 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, పవర్, మెటల్ రంగాలు 1.5% స్థాయిలో లాభపడటం ద్వారా మార్కెట్లకు అండగా నిలిచాయి. 3 రోజుల్లో 992 ప్లస్ తొలుత స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ చివరి గంటలో వెల్లువెత్తిన కొనుగోళ్లతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఒక దశలో గరిష్టంగా 27,725ను సైతం తాకింది. కాగా, వరుసగా మూడు రోజులు లాభపడటం ద్వారా మొత్తం 992 పాయింట్లు జమ చేసుకుంది. బీఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా, సెన్సెక్స్ దిగ్గజాలలో 4 షేర్లు మాత్రమే అది కూడా నామమాత్రంగా నష్టపోయాయి. ఇతర విశేషాలివీ... వచ్చే ఏడాది 6% వృద్ధిని అందుకుంటామ న్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు సెంటిమెంట్ కు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ, బీమా బిల్లులు ఆమోదం పొందవచ్చునన్న అంచనాలు కూడా ఇందుకు జత కలిసినట్లు తెలిపారు. సురేష్ ప్రభు అధ్యక్షతన ఏర్పాటైన సలహా సంఘం విద్యుత్, బొగ్గు రంగాల అభివృద్ధిపై తుది నివేదిక సిద్ధం చేయడంతో మరిన్ని సంస్కరణలపై ఇన్వెస్టర్లలో ఆశలు పెరిగినట్లు విశ్లేషకులు తెలిపారు. బ్లూచిప్స్‌లో కోల్ ఇండియా, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ ద్వయం, భెల్, గెయిల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్ 3.5-2% మధ్య లాభపడ్డాయి. బీఎస్ఈ-500లో బీఎఫ్ యుటిలిటీస్ 20% దూసుకెళ్లగా, సుజ్లాన్, ఐఐఎఫ్ఎల్, గీతాంజలి, వక్రంగీ, ఇండియా సిమెంట్, ఫ్యూచర్ రిటైల్, జిందాల్ స్టీల్, ఒబెరాయ్ రియల్టీ, నెస్కో, మణప్పురం, బజాజ్ హోల్డింగ్స్, ఐవీఆర్సీఎల్ 8-5% మధ్య పుంజుకున్నాయి. -
పెట్రోభారం రూ.1.10కోట్లు
చల్లపల్లి : పెట్రో, డీజిల్ ధరలను సోమవారం నుంచి పెంచడంతో జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.1.10కోట్ల భారం పడనుంది. ఇరాక్‌లో నెలకున్న సంక్షోభం వల్ల ఆయిల్ ధరలను పెంచినట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆయిల్ధరల పెంపు అన్ని వర్గాలపై ప్రభావం చూపుతుందని మేధావులంటున్నారు. జిల్లాలో 210 పెట్రోల్ బంకులుండగా నెలకు 45లక్షల లీటర్ల పెట్రోలియం, 50లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్టు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.69పైసలు, డీజిల్‌పై రూ.0.50పైసలను పెంచారు. దీనివల్ల జిల్లాలో వినియోగదారులపై నెలకు పెట్రోల్‌పై రూ.76.05లక్షలు, డీజిల్‌పై రూ.25 లక్షల భారం పడనుంది. పేద, సామాన్యప్రజల కోసమే కేంద్రప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి ప్రకటించగా గత ప్రభుత్వాల వలేధరలను నియంత్రించలేకపోవడం వల్లనే తరచూ ఆయిల్ ధరలను పెంచేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఆయిల్ధరలను పెంచడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర ధరలపై పడుతుందని వారంటున్నారు. -
సబ్సిడీయేతర సిలిండర్‌పై వడ్డన
రూ. 16.50 పెంపు న్యూఢిల్లీ: నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర మంగళవారం రూ. 16.50 పెరిగింది. అలాగే విమానాల ఇంధన ధరలు కూడా అర శాతం మేర పెరిగాయి. ఇరాక్ సంక్షోభంతో అంతర్జాతీయంగా చమురు ధరలకు రెక్కలు రావడమే ఇందుకు కారణం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా గ్యాస్ ధర పెరగడంతో నాన్ సబ్సిడీ సిలిండర్ రేటు ఢిల్లీలో రూ. 922.50గా ఉంది. ప్రస్తుతం వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద పొందే వీలుంది. ఈ పరిమితి దాటిన తర్వాత తీసుకునే సిలిండర్లకు సబ్సిడీ వర్తించదు. ఆరు నెలలుగా తగ్గుతూ వచ్చిన వీటి ధర తొలిసారి మళ్లీ పెరిగింది. కాగా, ఒక్కో సబ్సిడీ సిలిండర్‌పై రూ. 449 నష్టం వస్తున్నట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. ఇక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) లేదా జెట్ ఫ్యూయల్‌గా పిలిచే విమాన ఇంధనం ధర కూడా కిలోలీటర్‌కు రూ. 413.78 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలోలీటర్ ఇంధనం రేటు ఢిల్లీలో రూ. 70,161.76కు చేరింది. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న విమానయాన సంస్థలకు ఈ పెంపు భారంగా పరిణమిస్తుందని నిపుణులు అంటున్నారు. -
మార్కెట్‌కు ఇరాక్ దెబ్బ
275 పాయింట్లు పతనం 25,246 వద్దకు సెన్సెక్స్ గరిష్టం 25,609- కనిష్టం 25,114 ఒక దశలో 400 పాయింట్లు డౌన్ అన్ని రంగాలకూ నష్టాలే ఇరాక్ అంతర్యుద్ధం శృతిమించడంతో ఉన్నట్టుండి ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో ముందురోజుకి పూర్తి విరుద్ధమైన రీతిలో మిడ్ సెషన్నుంచీ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి మార్కెట్లు లాభాల నుంచి నష్టాలలోకి మళ్లాయి. ఉదయం సెషన్లో 25,609 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్లో కనిష్టంగా 25,114ను చవిచూసింది. అంటే గరిష్ట స్థాయి నుంచి దాదాపు 500 పాయింట్ల పతనం! క్రితం ముగింపునుంచి చూస్తే 400 పాయింట్ల నష్టం! ఆపై కొంతమేర కోలుకున్నప్పటికీ చివరికి 275 పాయింట్ల నష్టంతో 25,246 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇదే విధంగా కదిలి ట్రేడింగ్ ముగిసేసరికి 74 పాయింట్లు పోగొట్టుకుంది. 7,558 వద్ద నిలిచింది. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా... రియల్టీ, పవర్, ఆయిల్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ 2-1% మధ్య తిరోగమించాయి. ఇరాక్‌లో యుద్ధ భయాలు ముదరడంతో ఆయిల్ ధరలు మరోసారి పెకైగశాయి. ఇరాక్ బైజీలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీను మిలటెంట్లు ఆక్రమించినట్లు వార్తలు వెలువడటంతో ఒక్కసారిగా సెంటిమెంట్ దిగజారిందని విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 114 డాలర్లకు చేరగా, నెమైక్స్ చమురు 107 డాలర్లకు చేరువైంది. ఇక మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కూడా 0.6% బలహీనపడి 60.40కు పతనమైంది. ఇది కూడా అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ఆరు షేర్లు మాత్రమే సెన్సెక్స్‌లో ఆరు షేర్లు మాత్రమే లాభపడగా... సిప్లా, హిందాల్కో, గెయిల్ 3-1.5% మధ్య పుంజుకున్నాయి. అయితే మరోవైపు భెల్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, హీరోమోటో, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.5-1.5% మధ్య తిరోగమించాయి. ఇక బీఎస్ఈ-500 సూచీలో ఆమ్టెక్ ఇండియా, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, జీలెర్న్, బీజీఆర్ ఎనర్జీ, ఇండియా సిమెంట్స్, ఎరా ఇన్ఫ్రా, జేపీ అసోసియేట్స్, జేఎం ఫైనాన్షియల్, హెచ్‌పీసీఎల్, అలహాబాద్ బ్యాంక్, బజాజ్ హిందుస్తాన్ 7.5-4.5% మధ్య పతనమయ్యాయి. మొత్తం ట్రేడైన షేర్లలో 1,631 నష్టపోగా, 1,400 బలపడ్డాయి. -
డీజిల్, గ్యాస్ ధర పెంపు ప్రతిపాదనల్లేవ్: మొయిలీ
న్యూఢిల్లీ: డీజిల్, వంట గ్యాస్ (ఎల్పీజీ) ధర పెంపు ప్రతిపాదనలేవీ కేబినెట్ ముందుకు రాలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడించా రు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ పడిపోవడంతో చమురు ఉత్పత్తి వ్యయానికి, చిల్లర విక్రయ ధరకు మధ్య వ్యత్యాసం బాగా పెరిగిందని చెప్పారు. నష్టాలను పూడ్చుకునేందుకు డీజిల్‌పై లీటర్‌కు రూ. 3-5, కిరోసిన్‌పై రూ.2, అలాగే ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 చొప్పున ధర పెంచాలని తమ శాఖపై ఒత్తిడి ఉందన్నారు. త్వరలోనే ఢిల్లీ, రాజస్థాన్ సహా ఐదు కీలక రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల దృష్ట్యా వీటి ధరల పెంపుతో పడే రాజకీయ ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు కూడా మార్కెట్ ధరకే డీజిల్‌ను కొనుగోలు చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకునే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు మొయిలీ తెలిపారు. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనుండడంతోఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.