పెట్రోభారం రూ.1.10కోట్లు
చల్లపల్లి : పెట్రో, డీజిల్ ధరలను సోమవారం నుంచి పెంచడంతో జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.1.10కోట్ల భారం పడనుంది. ఇరాక్‌లో నెలకున్న సంక్షోభం వల్ల ఆయిల్ ధరలను పెంచినట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆయిల్‌ధరల పెంపు అన్ని వర్గాలపై ప్రభావం చూపుతుందని మేధావులంటున్నారు. జిల్లాలో 210 పెట్రోల్ బంకులుండగా నెలకు 45లక్షల లీటర్ల పెట్రోలియం, 50లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్టు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి.
పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.69పైసలు, డీజిల్‌పై రూ.0.50పైసలను పెంచారు. దీనివల్ల జిల్లాలో వినియోగదారులపై నెలకు పెట్రోల్‌పై రూ.76.05లక్షలు, డీజిల్‌పై రూ.25 లక్షల భారం పడనుంది. పేద, సామాన్యప్రజల కోసమే కేంద్రప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి ప్రకటించగా గత ప్రభుత్వాల వలేధరలను నియంత్రించలేకపోవడం వల్లనే తరచూ ఆయిల్ ధరలను పెంచేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఆయిల్‌ధరలను పెంచడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర ధరలపై పడుతుందని వారంటున్నారు.