అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సైనిక దాడి మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక‍్తతలను రాజేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇరాక్‌లోని అమెరికా రెండు ఎయిర్‌బేస్‌లపై క్షిపణి దాడి అనంతరం బుదవారం ఉదయం చమురు ధర 4.5 శాతం ఎగిసింది. డబ్ల్యుటిఐ 4.53 శాతం పెరిగి బ్యారెల్ 65.54 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు ధర ఒకదశలో 70 డాలర్లును దాటింది. ప్రస్తుతం 69.29 వద్ద వుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు కూడా బలహీనంగా ఉన్నాయి. మరోవైపు మంగళవారం కొద్దిగా శాంతించిన బంగారం ధరలు నేడు మరోసారి పుంజుకున్నాయి. ఏడేళ్ల గరిష్టానికి చేరాయి.
మిలిటరీ కమాండర్ ఖాసేం సులేమాని అమెరికా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో స్పందించారు. దాడిని ధృవీకరించిన ట్రంప్, అక‍్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నామనీ, తమ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలున్నాయని హెచ్చరించారు. దీనిపై రేపు (గురువారం) ఒక ప్రకటన చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు.
చదవండి :
Comments
Please login to add a commentAdd a comment