వాషింగ్టన్: ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు ఇరాన్‌ను ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇక మీదట ఎటువంటి ఉగ్రవాదాన్ని కొనసాగనివ్వమని ట్రంప్ హెచ్చరించారు. సులేమానినీ ఉగ్రవాద సంస్ధ హిజ్బుల్లాకు మద్ధతిచ్చారని ఆయన మండిపడ్డారు. ఇరాన్ దారికి రాకుంటే కఠిన ఆంక్షలు విధిస్తామని ఆయన వెల్లడించారు. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాలను విరమించుకోవాలని హెచ్చరించారు. ఇరాన్ చేసిన దాడిలో అమెరికన్లు ఎవరూ గాయపడలేదని ట్రంప్ వివరించారు. ఇరాన్‌కు అణుబాంబును ఎట్టి పరిస్థితుల్లో చిక్కనివ్వమని ట్రంప్ తెలిపారు. సులేమానినీ చంపడం తప్పేమి కాదని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. అదేవిధంగా తమకు ఎవరి చమురు అక్కర్లేదని.. తమ దగ్గరే కావాల్సినంత ముడి చమురు ఉందని ట్రంప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment