వాషింగ్టన్ : ఇరాన్‌లోని అమెరికా సైనిక బలగాలపై కానీ, ఆస్తులపై కానీ.. ఇరాన్ లేదా దాని అనుబంధ సంస్థలు దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బుధవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘ ఇరాన్, దాని అనుబంధ సంస్థలు ఇరాన్‌లోని అమెరికా సైనిక బలగాలపై, ఆస్తులపై దాడి చేయటానికి వ్యూహాలు రచిస్తున్నట్లు అధికారిక సమాచారం అందింది. అదే గనుక జరిగితే.. ఇరాన్ ఇందుకు ప్రతిఫలంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంద’ని హెచ్చరించారు.
కాగా, ఇరాన్ - అమెరికాల మధ్య గత కొద్ది నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. జనవరి 4న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా జరిపిన రాకెట్ దాడులలో ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ మరణించడమే ఇందుకు కారణం. ఇరాక్‌లోని అమెరికా అధికారులపై జరిగిన దాడుల్లో సులేమానీ కీలక పాత్ర పోషించాడని, వందలాది మంది అమెరికా, దాని సంకీర్ణ సేనలకు చెందిన సభ్యుల మృతికి ఆయన కారణమైనందుకే దాడి చేసినట్లు అమెరికా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment