సబ్సిడీయేతర సిలిండర్‌పై వడ్డన | Serving the cylinder subsidy | Sakshi
Sakshi News home page

సబ్సిడీయేతర సిలిండర్‌పై వడ్డన

Published Wed, Jul 2 2014 3:27 AM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

సబ్సిడీయేతర సిలిండర్‌పై వడ్డన - Sakshi

సబ్సిడీయేతర సిలిండర్‌పై వడ్డన

రూ. 16.50 పెంపు
 
న్యూఢిల్లీ: నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర మంగళవారం రూ. 16.50 పెరిగింది. అలాగే విమానాల ఇంధన ధరలు కూడా అర శాతం మేర పెరిగాయి. ఇరాక్ సంక్షోభంతో అంతర్జాతీయంగా చమురు ధరలకు రెక్కలు రావడమే ఇందుకు కారణం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా గ్యాస్ ధర పెరగడంతో నాన్ సబ్సిడీ సిలిండర్ రేటు ఢిల్లీలో రూ. 922.50గా ఉంది. ప్రస్తుతం వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద పొందే వీలుంది. ఈ పరిమితి దాటిన తర్వాత తీసుకునే సిలిండర్లకు సబ్సిడీ వర్తించదు.

ఆరు నెలలుగా తగ్గుతూ వచ్చిన వీటి ధర తొలిసారి మళ్లీ పెరిగింది. కాగా, ఒక్కో సబ్సిడీ సిలిండర్‌పై రూ. 449 నష్టం వస్తున్నట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. ఇక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) లేదా జెట్ ఫ్యూయల్‌గా పిలిచే విమాన ఇంధనం ధర కూడా కిలోలీటర్‌కు రూ. 413.78 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలోలీటర్ ఇంధనం రేటు ఢిల్లీలో రూ. 70,161.76కు చేరింది. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న విమానయాన సంస్థలకు ఈ పెంపు భారంగా పరిణమిస్తుందని నిపుణులు అంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement