న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇంధన ఛార్జీలు సవరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత... మొదట్లో సగటున ప్రతీ పదిహేను రోజులకు ఓసారి పెట్రోలు ధర పెరిగేది. ఆ తర్వాత వారానికి పడిపోయింది. ఇప్పుడు దాదాపు రోజుకు ఒకసారి పెరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. గురువారం లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 11 పైసలు పెంపు విధించాయి.
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంచుమించు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక జులైలో అయితే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దాదాపు ప్రతీ రోజు పెట్రోలు ధర పెరిగింది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్ లీటర్ వంద మార్క్‌ను దాటేసింది.
ఈ నెలలో ఇది ఆరో పెంపు. పది రాష్రా‍్టలపై పెట్రో ఉత్పత్తుల పెంపు ప్రభావం పడింది. తాజా పెరుగుదలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.50పై కాగా, డీజిల్ ధర రూ.97.68పై.గా ఉంది. ఇక అత్యధికంగా భోపాల్‌లో రూ.108గా ఉండగా, డీజిల్ ధర రూ.98గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.106- డిజీల్ రూ.92గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment