దేశంలో రోజు రోజుకి పెట్రోల్, డీజల్ భారీగా పెరుగుతూ పోతున్న సంగతి అందరికి తెలిసిందే. ధరలు భారీగా పెరుగుతుండటంతో నిత్యావసర ధరలు కూడా పెరుగతున్నాయి. దీంతో సామాన్య ప్రజానీకం ఈ ధరల పెరుగుదలపై గగ్గోలు పెడుతున్నారు. ఈ ధరల పెరగుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. పెట్రో ధరలు భారీగా పెరుగుతున్నాయిని, దీన్ని తాము అంగీకరిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తాము అర్థం చేసుకోగలమని అన్నారు.
గత నెల మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు చమురు ధరలు 23 సార్లు పెరిగిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పైవిధంగా స్పందించారు. పెట్రో ధరలపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు కూడా వివరించారు. సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని ఆయన వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు ఆదా చేస్తున్నందునే పెట్రో ధరల పెంపును ఉపేక్షించాల్సి వస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా రేషన్ కోసం రూ. లక్ష కోట్లు, వ్యాక్సిన్ల కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు.
చదవండి: హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?
Comments
Please login to add a commentAdd a comment