
న్యూఢిల్లీ: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకోసం ప్రకటించిన 3కోట్ల అదనపు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లకు రూ.4,800 కోట్లు అదనంగా ఖర్చుకానుంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ఢిల్లీలో వెల్లడించారు. బుధవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశ వివరాలను మంత్రి వెల్లడిస్తూ.. ‘గతంలో నిర్ణయించినట్లుగా 5కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు అందజేస్తాం. ఇప్పటికే 3.36కోట్ల కనెక్షన్లను పేద మహిళలను అందజేశాం. ఇందుకోసం రూ.8వేల కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇప్పుడు ఈ పథకాన్ని మరో 3కోట్లు పెంచాలన్న ప్రకటన నేపథ్యంలో అదనంగా రూ.4,800 కోట్లకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment