వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో నంబర్‌వన్‌గా మారడం ఖాయం
బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
1,500 రోజుల రివర్స్ ప్లానింగ్‌తో ముందుకెళ్లండి
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయండి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అక్రమాలను ఎండగట్టండి
బీజేపీలో సామాన్య కార్యకర్త సీఎం కాగలడు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధి
రాజ్యాంగాన్ని పదేపదే రాహుల్ అవమానిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ నంబర్‌వన్ పార్టీగా మారడం ఖాయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై నిరంతర పోరాటాల ద్వారా కాంగ్రెస్, బీఅర్‌ఎస్‌కు నిద్ర పట్టకుండా చేసి.. ఆ పారీ్టల అక్రమాలపై పోరాటాలతో బీజేపీ తప్పకుండా నంబర్‌వన్ స్థానానికి చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.
రానున్న 1,500 రోజుల్లో (రివర్స్ ప్లానింగ్) ప్రజా పోరాటాల ద్వారా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ వద్ద 1,500 రోజుల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.
శుక్రవారం శంషాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గం ముగింపు సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పిన ధర్మేంద్ర.. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తూనే ఉందన్నారు.
దక్షిణాది సీట్లతోనే మూడోసారి మోదీ సర్కార్
తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన సీట్లతో మరింత బలం చేకూరడంతోనే మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడిందని ధర్మేంద్ర చెప్పారు. ‘ఎనిమిది ఎంపీ స్థానాల్లో గెలిస్తేనే ప్రధాని కావాలని కొందరు కలలు కంటుంటారు. అలాంటిది తెలంగాణ నుంచి పార్టీ సొంతంగా 8 సీట్లను గెలవడం మామూలు విజయం కాదు.. ఇందుకు ఓటర్లకు కృతజ్ఞతలు. లోక్‌సభ ఎన్నికలతో బీజేపీ ఉత్తరాది పార్టీ అనే అపవాదు తొలగింది. దక్షిణ భారతంలో బీజేపీ మరింత బలపడింది. కొత్త శకం మొదలైంది. కేరళలో బీజేపీ ఖాతా తెరిచింది. తమిళనాడు లో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించాం’’అని ఆయన అన్నారు.
రాజ్యాంగం మార్చం.. రిజర్వేషన్లను ఎత్తివేయం
‘పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ పారీ్టకి వంద సీట్లు దాటలేదు. 13 రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు. అయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారలేదు. అహంకారంగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని పదే పదే అవమానించే కాంగ్రెస్‌నేతలు, రాహుల్‌గాంధీ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. బీజేపీపై దు్రష్పచారం చేస్తున్నారు.. ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులూ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగానికి ఎలాంటి హానీ జరగదని మేమంతా సామూహికంగా వాగ్దానం చేస్తున్నాం బీజేపీ అధికారంలో ఉండగా రిజర్వేషన్లకూ ఎటువంటి ఢోకా లేదు’అని ధర్మేంద్ర స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment