
న్యూఢిల్లీ: మనుషుల్లో పేద, ధనిక, కుల, మత బేధాలు ఉంటాయి కానీ కరోనాకు మాత్రం అందరూ సమానమే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు. రెండు రోజుల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా సోకినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ప్రసుత్తం ప్రధాన్ హరియాణాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమిత్ షాకు కూడా ఇదే ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్ మెంట్ జరుగుతుంది. (మంత్రులెందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరరు?!)
#COVID19 के लक्षण दिखने पर मैंने टेस्ट करवाया जिसमें मेरी रिपोर्ट पॉज़िटिव आई है। डाक्टरों की सलाह पर मैं अस्पताल में भर्ती हूँ और स्वस्थ हूँ।
— Dharmendra Pradhan (@dpradhanbjp) August 4, 2020
ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యడియూరప్ప, శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వీరితో పాటు కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. వీరిలో 12 లక్షల 30 వేల మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో వరుసగా నేడు రెండో రోజు 50 వేల కేసులు వెలుగు చూశాయి.
Comments
Please login to add a commentAdd a comment