న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024 వివాదంపై కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ వివాదంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు భయపడొద్దని తెలిపారు.
పేపర్ లీక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, వెల్లువెత్తుతున్న ఆరోపణలపై అధికారులు వాటిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అంశంలో సంబంధిత అధికారుల విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం జూలై 8 వరకు వేచి చూద్దాం. దాచడానికి ఏమీ లేదు అని ఆయన అన్నారు.
భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా 4,700 కేంద్రాలలో 14 విదేశాలలో 13 భాషలలో 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని ప్రధాన్ తెలిపారు. రెండు కేంద్రాలపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment