హైదరాబాద్‌ ఐఐటీ అదుర్స్‌ | IIT Hyderabad Rankings 2022: 14th Rank Got IIT Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఐఐటీ అదుర్స్‌

Published Sat, Jul 16 2022 1:11 AM | Last Updated on Sat, Jul 16 2022 2:42 PM

IIT Hyderabad Rankings 2022: 14th Rank Got IIT Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో నిలిచి హైదరాబాద్‌ ఐఐటీ మరోసారి సత్తా చాటింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకులు సాధించాయి.

అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్‌) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ(హెచ్‌) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్‌ లభించింది. ఇంజనీరింగ్‌ కాలేజీల విభాగంలో ఐఐటీ(హెచ్‌) టాప్‌–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. దేశంలోకెల్లా ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్‌ తొలిస్థానంలో నిలిచి వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (బెంగళూరు) దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. 

హెచ్‌సీయూ భళా.. 
జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఓవరాల్‌ విభాగంలో 20వ ర్యాంకు, రీసెర్చ్‌లో 27వ ర్యాంకు సాధించింది.  వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా  వర్సిటీ 22వ ర్యాంకు పొందింది. ఓవరాల్‌ ర్యాంకుల విభాగంలో 46వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్‌ కాలేజీల విభాగంలోవరంగల్‌ ఎన్‌ఐటీ 21 ర్యాంకు ఓవరాల్‌ విభాగంలో 45వ ర్యాంకు పొందింది.  

ఇంజనీరింగ్‌ విద్యలో జేఎన్‌టీయూ (హైదరాబాద్‌)కు జాతీయస్థాయిలో 76వ ర్యాంకు దక్కింది. కాగా, ప్రతిభగల విద్యా ర్థులు, సమర్థులైన అధ్యాపకుల కృషివల్లే ఐఐటీ (హెచ్‌) దినదినాభివృద్ధి చెందుతోందని సంస్థ డైరెక్టర్‌ ప్రొ.బీఎస్‌ మూర్తి తెలిపారు. వివిధ విభాగాల్లో ఓయూ ర్యాంకులు సాధించడంపై వర్సిటీ వీసీ రవీందర్‌ హర్షం వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement