అగర్తలా: పేదలకు అందిస్తున్న ఎల్పీజీ సబ్సిడీ ఇకమీదటా కొనసాగుతుందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం స్పష్టం చేశారు. ‘సాధారణ ప్రజలు, పేదలకు ఎల్పీజీ, కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తేసే ప్రణాళికలేవీ లేవు’ అని ప్రధాన్ మీడియాకు చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నుంచి త్రిపురకు సహజవాయువు తెచ్చేందుకు పైపులైను వేసే ప్రాజెక్టును చేపట్టామని ప్రధాన్ తెలిపారు.