సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ–మద్రాస్ నెంబర్ వన్‌గా నిలిచింది. ఓవరాల్ ర్యాంకుల్లోనూ, ఇంజినీరింగ్‌లోనూ వరుసగా మూడోసారి తొలి స్థానం సాధించింది. 2021 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థల పనితీరును మదింపు చేసి నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) రూపొందించిన ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం విడుదల చేశారు.
టాప్–100లో ఏపీ, తెలంగాణ విద్యా సంస్థలు
ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు రెండోస్థానంలో, ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఏపీ, తెలంగాణకు చెందిన పలు ఉన్నత విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీ టాప్–100లో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ–హైదరాబాద్ 16వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ఐఐటీ–హైదరాబాద్ 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గత ఏడాది 15వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండు స్థానాలు వెనుకబడింది. ఇక ఆంధ్రా యూనివర్సిటీ 48వ స్థానంలో, ఎన్‌ఐటీ–వరంగల్ 59వ, ఉస్మానియా యూనివర్సిటీ 62వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ర్యాంకులతో పోల్చితే ఈ వర్సిటీలు వెనుకబడ్డాయి. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వర్సిటీ(కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) 69వ స్థానంలో, ఎస్వీయూ 92వ స్థానంలో నిలిచాయి.
వర్సిటీ కేటగిరీల్లో హెచ్‌సీయూకు 9వ ర్యాంకు
యూనివర్సిటీ కేటగిరీల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూర్ తొలిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9వ స్థానంలో నిలిచి టాప్–10లో చోటు దక్కించుకుంది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీకి 24వ స్థానం దక్కింది. ఉస్మానియా వర్సిటీ 32వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 35వ స్థానంలో, ఎస్వీయూ 54వ స్థానంలో, గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ 67వ స్థానంలో, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 83వ స్థానంలో, విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ యూనివర్శిటీ 97వ స్థానంలో నిలిచాయి.
కాలేజీల కేటగిరీల్లో టాప్–100లో రెండే..
కాలేజీల కేటగిరీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కేవలం రెండు కాలేజీలు చోటు దక్కించుకున్నాయి. 34వ స్థానంలో విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్, 85వ స్థానంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ నిలిచాయి.
ర్యాంకింగ్స్.. రీసెర్చ్ కేటగిరీలో..: రీసెర్చ్ కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్ 15వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచాయి.
ఇంజినీరింగ్: ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ స్థానంలో, ఎన్‌ఐటీ–వరంగల్ 23వ, కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ 50వ, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 54వ స్థానంలో, జేఎన్‌టీయూ–హైదరాబాద్ 62వ స్థానంలో, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్–విశాఖపట్నం 74వ స్థానంలో నిలిచాయి.
మేనేజ్‌మెంట్: మేనేజ్‌మెంట్ విభాగంలో ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్– హైదరాబాద్ 27వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 38వ, క్రియా యూనివర్సిటీ–చిత్తూరు 50వ స్థానంలో, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ–హైదరాబాద్ 63వ స్థానంలో నిలిచాయి.
ఫార్మసీ: ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైఫర్) హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ సైన్సెస్–విశాఖ 30వ స్థానంలో, శ్రీ పద్మావతి మహిళా విద్యాలయం–తిరుపతి 44వ, కాకతీయ యూనివర్సిటీ 48వ, ఎస్వీయూ 54వ, రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–అనంతపురం 55వ స్థానంలో నిలిచాయి. శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ–చిత్తూరు 62వ, చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా– గుంటూరు 69వ స్థానంలో, విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–నర్సాపూర్ 72వ స్థానంలో నిలిచాయి.
వైద్య విద్య విభాగం
వైద్య విద్య విభాగంలో ఎయిమ్స్–ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. నారాయణ మెడికల్ కాలేజ్–నెల్లూరు 43వ స్థానంలో నిలిచింది.
న్యాయ విద్య: న్యాయ విద్యా విభాగంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ – బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, నల్సార్ – హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ 28వ ర్యాంకు, ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ – హైదరాబాద్ 29వ ర్యాంకు దక్కించుకున్నాయి.
ఆర్కిటెక్చర్: ఆర్కిటెక్చర్ విభాగంలో ఐఐటీ రూర్కీ మొదటి స్థానంలో, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 8వ ర్యాంకు సాధించాయి.
దంత వైద్య విద్య: దంత వైద్య విద్యా విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని విష్ణు డెంటల్ కాలేజీ 23వ స్థానంలో, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ – సికింద్రాబాద్ 30వ స్థానంలో నిలిచాయి.
IIT Madras Top Rank: నెంబర్ వన్‌గా ఐఐటీ మద్రాస్.. వరుసగా మూడో ఏడాది..
Published Fri, Sep 10 2021 4:27 AM | Last Updated on Fri, Sep 10 2021 8:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment