Engineering ranks
-
నెంబర్ వన్‌గా ఐఐటీ మద్రాస్.. వరుసగా మూడో ఏడాది..
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ–మద్రాస్ నెంబర్ వన్‌గా నిలిచింది. ఓవరాల్ ర్యాంకుల్లోనూ, ఇంజినీరింగ్‌లోనూ వరుసగా మూడోసారి తొలి స్థానం సాధించింది. 2021 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థల పనితీరును మదింపు చేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) రూపొందించిన ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం విడుదల చేశారు. టాప్–100లో ఏపీ, తెలంగాణ విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు రెండోస్థానంలో, ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఏపీ, తెలంగాణకు చెందిన పలు ఉన్నత విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీ టాప్–100లో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ–హైదరాబాద్ 16వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ఐఐటీ–హైదరాబాద్ 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గత ఏడాది 15వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండు స్థానాలు వెనుకబడింది. ఇక ఆంధ్రా యూనివర్సిటీ 48వ స్థానంలో, ఎన్ఐటీ–వరంగల్ 59వ, ఉస్మానియా యూనివర్సిటీ 62వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ర్యాంకులతో పోల్చితే ఈ వర్సిటీలు వెనుకబడ్డాయి. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వర్సిటీ(కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) 69వ స్థానంలో, ఎస్వీయూ 92వ స్థానంలో నిలిచాయి. వర్సిటీ కేటగిరీల్లో హెచ్సీయూకు 9వ ర్యాంకు యూనివర్సిటీ కేటగిరీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూర్ తొలిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9వ స్థానంలో నిలిచి టాప్–10లో చోటు దక్కించుకుంది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీకి 24వ స్థానం దక్కింది. ఉస్మానియా వర్సిటీ 32వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 35వ స్థానంలో, ఎస్వీయూ 54వ స్థానంలో, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 67వ స్థానంలో, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 83వ స్థానంలో, విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ యూనివర్శిటీ 97వ స్థానంలో నిలిచాయి. కాలేజీల కేటగిరీల్లో టాప్–100లో రెండే.. కాలేజీల కేటగిరీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కేవలం రెండు కాలేజీలు చోటు దక్కించుకున్నాయి. 34వ స్థానంలో విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్, 85వ స్థానంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ నిలిచాయి. ర్యాంకింగ్స్.. రీసెర్చ్ కేటగిరీలో..: రీసెర్చ్ కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్ 15వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచాయి. ఇంజినీరింగ్: ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ స్థానంలో, ఎన్ఐటీ–వరంగల్ 23వ, కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ 50వ, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 54వ స్థానంలో, జేఎన్టీయూ–హైదరాబాద్ 62వ స్థానంలో, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్–విశాఖపట్నం 74వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్: మేనేజ్మెంట్ విభాగంలో ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్– హైదరాబాద్ 27వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 38వ, క్రియా యూనివర్సిటీ–చిత్తూరు 50వ స్థానంలో, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ–హైదరాబాద్ 63వ స్థానంలో నిలిచాయి. ఫార్మసీ: ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైఫర్) హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ సైన్సెస్–విశాఖ 30వ స్థానంలో, శ్రీ పద్మావతి మహిళా విద్యాలయం–తిరుపతి 44వ, కాకతీయ యూనివర్సిటీ 48వ, ఎస్వీయూ 54వ, రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–అనంతపురం 55వ స్థానంలో నిలిచాయి. శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ–చిత్తూరు 62వ, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా– గుంటూరు 69వ స్థానంలో, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–నర్సాపూర్ 72వ స్థానంలో నిలిచాయి. వైద్య విద్య విభాగం వైద్య విద్య విభాగంలో ఎయిమ్స్–ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. నారాయణ మెడికల్ కాలేజ్–నెల్లూరు 43వ స్థానంలో నిలిచింది. న్యాయ విద్య: న్యాయ విద్యా విభాగంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ – బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, నల్సార్ – హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ 28వ ర్యాంకు, ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ – హైదరాబాద్ 29వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఆర్కిటెక్చర్: ఆర్కిటెక్చర్ విభాగంలో ఐఐటీ రూర్కీ మొదటి స్థానంలో, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 8వ ర్యాంకు సాధించాయి. దంత వైద్య విద్య: దంత వైద్య విద్యా విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని విష్ణు డెంటల్ కాలేజీ 23వ స్థానంలో, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ – సికింద్రాబాద్ 30వ స్థానంలో నిలిచాయి. -
ఆ 30వేల మంది ఇంజినీర్లకు అర్హత పరీక్ష
న్యూఢిల్లీ: డీమ్డ్ వర్సిటీల్లో దూరవిద్యలో ఇంజినీరింగ్ పట్టాలు పొందిన వారంతా తిరిగి తాము నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పేర్కొంది. జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (రాజస్తాన్), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు వినాయక మిషన్ రీసెర్చి ఫౌండేషన్ (తమిళనాడు) దూరవిద్య విధానం ద్వారా 30వేల మందికి ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేశాయి. అయితే, ఈ పట్టాలు చెల్లవంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో యూజీసీ తాజా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో జరిగే ఈ పరీక్ష రాయాలనుకునే వారు జనవరి 15లోగా పేర్లను నమోదు చేయించుకోవాలని కోరింది. ఇందులో పాసైన వారికే ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేస్తామని పేర్కొంది. -
తెలుగు మీడియం వల్లే ర్యాంకులు రాలేదు
సాక్షి, అమరావతి: తెలుగు మాధ్యమంలో చదవడం వల్లే రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ర్యాంకులు సాధించలేకపోయారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంపై అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2015–16, 2016–17 సంవత్సరాల్లో మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో ఒక్కరికీ పదివేలలోపు ఇంజనీరింగ్ ర్యాంకులు రాలేదంటే ఇంగ్లిష్ రాకపోవడమే కారణమని చెప్పారు. మాతృభాష తెలుగును తీసెయ్యట్లేదని, ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చునన్నారు. దీనికి పలువురు సభ్యులు అడ్డుతగిలారు. తెలుగు మీడియంలో చదవడం వల్లే ర్యాంకులు రాలేదనడం సరికాదని, దీనిపై తమకు మాట్లాడే అవకాశమివ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, శ్రావణ్‌కుమార్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిలతోపాటు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. ఇందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒప్పుకోలేదు.దీంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఆంగ్ల మాధ్యమం పేరుతో తెలుగును దూరం చేయడం దారుణమన్నారు. -
ఏపీ ఇంజనీరింగ్ ఫలితాలే విడుదల
- బాలురే టాపర్లు.. టాప్ టెన్‌లో తెలంగాణ విద్యార్థులు - 27న అడ్మిషన్ల నోటిఫికేషన్.. జూన్ 27 నుంచి తరగతులు - సుప్రీం తీర్పుతో మెడిసిన్ ఫలితాలు నిలిపివేత సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సోమవారం రాత్రి ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ఫలితాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ ఎంట్రన్స్‌కు సంబంధించిన నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంసెట్‌లోని ఇంజనీరింగ్ ఫలితాల వరకు మాత్రమే విడుదల చేసి.. మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలను నిలిపివేసింది. సోమవారం పొద్దుపోయాక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలలో టాప్ టెన్ ర్యాంకుల్లో బాలుర హవా కొనసాగింది. ఇంజనీరింగ్‌లో మొత్తం 1,89,246 మంది దరఖాస్తు చేయగా అందులో 1,79,465 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1,31,580 మంది ర్యాంకులు సాధించారు. మొత్తం హాజరైన వారిలో 81.36 శాతం మంది ఇంజనీరింగ్ ప్రవేశాలకు అర్హత పొందగా అందులో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 82.67 శాతం మంది, బాలురు 80.05 శాతం మంది అర్హత సాధించారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంకు విశాఖ జిల్లాకు చెందిన సత్తి వంశీకృష్ణారెడ్డికి దక్కగా రెండో ర్యాంకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చప్పిడి లక్ష్మీనారాయణ సాధించాడు. ఈ ఫలితాల్లో ఏపీలోని జిల్లాల వారీగా చూస్తే.. కృష్ణా జిల్లా(78.37%) అగ్రస్థానంలో నిలవగా.. విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉంది. అయితే.. హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసిన విద్యార్థుల్లో 88.48 శాతం మంది అర్హత సాధించడం గమనార్హం. వెబ్సైట్లో ఓఎమ్మార్ షీట్లు ఎంసెట్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ఓఎమ్మార్ షీట్లను ఈనెల 17వ తేదీనుంచి 21వ తేదీవరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంసెట్.ఓఆర్జీ వెబ్సైట్లో పొందుపర్చనున్నామని సాయిబాబు తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే పరిశీలించుకోవచ్చని, ఈనెల 25వ తేదీలోగా అభ్యంతరాలు తెలియచేయాలనుకొనే జనరల్ అభ్యర్థులు రూ. 5 వేలు, ఎస్సీఎస్టీ అభ్యర్థులు 2 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. కాగా, ఎంసెట్‌లో మెడికల్ ఫలితాలు వాయిదా వేసినా అగ్రికల్చర్ అనుబంధ సబ్జెక్ట్ ఫలితాలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మరోవైపు మెడికల్ పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థులు ఫలితాలు విడుదల కాకపోవడంతో నిరాశకు గురయ్యారు. ముఖ్యమైన తేదీలు.. మే 27న అడ్మిషన్లకు నోటిఫికేషన్ జూన్ 6న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూన్ 9 నుంచి 18 వరకు ఆన్లైన్లో వెబ్ఆప్షన్ల నమోదు జూన్ 22న సీట్ల కేటాయింపు జూన్ 27వ తేదీనుంచి తరగతుల ప్రారంభం. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో టాప్ టెన్ ర్యాంకర్లు ర్యాంక్ అభ్యర్థి మార్కులు 1 సత్తి వంశీకృష్ణారెడ్డి 158 2 చప్పిడి లక్ష్మీనారాయణ 157 3 కొండా విఘ్నేష్ రెడ్డి 157 4 మూల్పూరు ప్రశాంత్ రెడ్డి 156 5 గంటా గౌతమ్ 156 6 దిగుమూర్తి చేతన్‌సాయి 155 7 తాళ్లూరి సాయితేజ 154 8 అబ్బే జెడ్ జార్జి 154 9 ఎస్.ఎస్. సాయి దినేష్ 154 10 ఎన్. జైకృష్ణ సాయివినయ్ 154 -
మెడిసిన్‌లో మెరిశారు
- రాష్ట్రస్థాయిలో 4, 10, 11, 21వ ర్యాంకుల సాధన - జిల్లా గౌరవాన్ని నిలబెట్టిన విద్యార్థులు - ఐఐటీపై దృష్టితో చేజారిన ఇంజినీరింగ్ ర్యాంకులు - ఇంజినీరింగ్ తొలి పది స్థానాల్లో జిల్లాకు దక్కని చోటు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల ప్రవేశ పరీక్ష(ఎంసెట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మే 22న జరిగిన ఎంసెట్‌కు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 25,548 మంది విద్యార్థుల్లో 24,264 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 19,171 మంది, మెడిసిన్‌కు 5,093 మంది ఉన్నారు. సోమవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో తొలి పదిస్థానాల్లో మెడిసిన్ విభాగంలో జిల్లాకు 4,10 ర్యాంకులు దక్కగా, ఇంజినీరింగ్‌లో ఏ ఒక్క ర్యాంకూ లభించకపోవడం విద్యార్థులను నిరాశ పరిచింది. మెడిసిన్ విభాగంలో గుంటూరు శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థిని దారపనేని హరిత రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, తెనాలికి చెందిన ఘంటా సాయి నిఖిల 10వ ర్యాంకు సాధించింది. ఈమె విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. అదే విధంగా శ్రీచైతన్య విద్యార్థి నీలి రంగసాయి అనిరుధ్ 11వ ర్యాంకు, భాష్యం విద్యాసంస్థల విద్యార్థి వై.వరుణ్‌తేజ 21వ ర్యాంకు, షేక్ నబీ దరియావలి 35వ ర్యాంకు, డి.వంశీ సాయి ప్రవీణ్ 39వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో భాష్యం విద్యార్థి ఎం.రఘుశ్రావణ్ 15వ ర్యాంకు, శ్రీచైతన్య విద్యార్థులు బి.ఎ.ఎస్.ఎస్.ప్రశాంత్ 22వ ర్యాంకు, వై.హరతేజ 48వ ర్యాంకు సాధించారు.ఐఐటీపైనే ఆశలు పెట్టుకున్న విద్యార్థులు.: ఐఐటీ ల్లో సీట్లను సాధించడమే లక్ష్యంగా జేఈఈ-మెయిన్స్‌కు సన్నద్ధమైన విద్యార్థులు ఎంసెట్‌పై దృష్టి కేంద్రీకరించకపోవడంతోనే ఇంజినీరింగ్‌లో ర్యాంకులు తగ్గిన ట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన జేఈఈ-మెయిన్స్ ఫలితా ల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు సై తం ఎంసెట్‌లో ర్యాంకులు సాధించకలేకపోవడమే ఇం దుకు నిదర్శనం. జాతీయస్థాయిలో పేరు గాంచిన ఐఐ టీల్లో సీటు సాధించే లక్ష్యంతో చదివిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంసెట్‌లో ర్యాంకులు సాధించలేకపోయారు. 14 నుంచి ఆన్లైన్లో ర్యాంకు కార్డులు ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ర్యాంకు కా ర్డులను ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన ఆన్లైన్లో పొం దపర్చనుంది. విద్యార్థులు అదే రోజు సాయంత్రం నుం చి ఎంసెట్ వెబ్సైట్ ద్వారా ర్యాంకు కార్డులను పొందవచ్చు. ఈ నెల 14 నుంచి మెడిసిన్ కౌన్సెలింగ్, 29వ తేదీన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నాయి.