మెడిసిన్‌లో మెరిశారు
- రాష్ట్రస్థాయిలో 4, 10, 11, 21వ ర్యాంకుల సాధన
- జిల్లా గౌరవాన్ని నిలబెట్టిన విద్యార్థులు
- ఐఐటీపై దృష్టితో చేజారిన ఇంజినీరింగ్ ర్యాంకులు
- ఇంజినీరింగ్ తొలి పది స్థానాల్లో జిల్లాకు దక్కని చోటు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల ప్రవేశ పరీక్ష(ఎంసెట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మే 22న జరిగిన ఎంసెట్‌కు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 25,548 మంది విద్యార్థుల్లో 24,264 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 19,171 మంది, మెడిసిన్‌కు 5,093 మంది ఉన్నారు. సోమవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో తొలి పదిస్థానాల్లో మెడిసిన్ విభాగంలో జిల్లాకు 4,10 ర్యాంకులు దక్కగా, ఇంజినీరింగ్‌లో ఏ ఒక్క ర్యాంకూ లభించకపోవడం విద్యార్థులను నిరాశ పరిచింది.
మెడిసిన్ విభాగంలో గుంటూరు శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థిని దారపనేని హరిత రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, తెనాలికి చెందిన ఘంటా సాయి నిఖిల 10వ ర్యాంకు సాధించింది. ఈమె విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. అదే విధంగా శ్రీచైతన్య విద్యార్థి నీలి రంగసాయి అనిరుధ్ 11వ ర్యాంకు, భాష్యం విద్యాసంస్థల విద్యార్థి వై.వరుణ్‌తేజ 21వ ర్యాంకు, షేక్ నబీ దరియావలి 35వ ర్యాంకు, డి.వంశీ సాయి ప్రవీణ్ 39వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.
ఇంజినీరింగ్ విభాగంలో భాష్యం విద్యార్థి ఎం.రఘుశ్రావణ్ 15వ ర్యాంకు, శ్రీచైతన్య విద్యార్థులు బి.ఎ.ఎస్.ఎస్.ప్రశాంత్ 22వ ర్యాంకు, వై.హరతేజ 48వ ర్యాంకు సాధించారు.ఐఐటీపైనే ఆశలు పెట్టుకున్న విద్యార్థులు.: ఐఐటీ ల్లో సీట్లను సాధించడమే లక్ష్యంగా జేఈఈ-మెయిన్స్‌కు సన్నద్ధమైన విద్యార్థులు ఎంసెట్‌పై దృష్టి కేంద్రీకరించకపోవడంతోనే ఇంజినీరింగ్‌లో ర్యాంకులు తగ్గిన ట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన జేఈఈ-మెయిన్స్ ఫలితా ల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు సై తం ఎంసెట్‌లో ర్యాంకులు సాధించకలేకపోవడమే ఇం దుకు నిదర్శనం. జాతీయస్థాయిలో పేరు గాంచిన ఐఐ టీల్లో సీటు సాధించే లక్ష్యంతో చదివిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంసెట్‌లో ర్యాంకులు సాధించలేకపోయారు.
14 నుంచి ఆన్‌లైన్‌లో ర్యాంకు కార్డులు
ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ర్యాంకు కా ర్డులను ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన ఆన్‌లైన్‌లో పొం దపర్చనుంది. విద్యార్థులు అదే రోజు సాయంత్రం నుం చి ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా ర్యాంకు కార్డులను పొందవచ్చు. ఈ నెల 14 నుంచి మెడిసిన్ కౌన్సెలింగ్, 29వ తేదీన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నాయి.