district students
-
లాస్ట్ నుంచి ఫస్ట్!
కడప ఎడ్యుకేషన్ : గురువారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఓ మోస్తారు ఫలితాలు సాధించారు. 52 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర వ్యాప్తంగా 13వ స్థానంలో (చిట్టచివరి) నిలిచారు. గతేడాది 51 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ యేడాది ఒక్కశాతం పెరుగుదలతో 52 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే అట్టడుగు స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 21,393 మంది విద్యార్థులు హాజరుకాగా 11,167 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 10,526 మందికి గాను 4,877 మంది పాసై 46 శాతం ఉతీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 10,867 మందికి గాను 6,290 మంది ఉత్తీర్ణత సాధించి 58 శాతం ఫలితాలు సాధించారు. ఒకేషనల్ విభాగంలో 777 మందికి గాను 454 మంది ఉత్తీర్ణత సాధించి 58 శాతం ఫలితాలు సాధించారు. బాలుర విభాగంలో 487 మందికి గాను 281 మంది పాసై 58 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికల విభాగంలో 290 మందికి గాను 173 మంది పాసై 60 శాతం ఉత్తీర్ణత సాధించి ఒకేషనల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో నాలుగవ స్థానం సాధించారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు 3,451 మందికి గాను 1,728 మంది ఉత్తీర్ణత సాధించి 50 శాతం ఫలితాలు సాధించారు. వీరిలో బాలురు 1305 మందికి గాను 577 మంది, బాలికల విభాగంలో 2146 మందికి గాను 1151 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలల్లో 261 మందికి గాను 183 మంది ఉత్తీర్ణత సాధించి 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా గతేడాదితో పోల్చితే ఒక శాతం ఫలితాలు మెరుగు పరుచుకున్నప్పటికి రెండు మెట్లు దిగి చివరి స్థానంలో నిలిచింది. 2012 ఫలితాల్లో 12వ స్థానం, 2013 ఫలితాల్లో 11వ స్థానంలో నిలిచిన జిల్లా 2014 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 10వ స్థానం, 2015 ఫలితాల్లో 13వ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఒక శాతం ఫలితాలు మెరుగుపడ్డాయని, ఒకేషనల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచామని ఆర్ఐఓ జి.ఆర్.ఆర్. ప్రసాదరావు తెలిపారు. మంచి ఫలితాలు సాధించిన జిల్లా విద్యార్థులు.. కాగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ప్రొద్దుటూరుకు చెందిన అభ్యాస్ కళాశాల విద్యార్థులు చెన్నా యామిని ఎంపీసీ విభాగంలో 464, భావన జూనియర్ కళాశాలకు చెందిన బి. శ్రీవిద్య 464 మార్కులతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. కడప శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు బి. లలిత్‌కుమార్ ఎంపీసీ విభాగంలో 463 మార్కులు, కే.ఆర్. శిరీష 463 మార్కులతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. బైపీసీ విభాగంలో విజయవర్షిణి 434 మార్కులు, శ్రీనాథ్ 433 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. విజయవాణి కళాశాలకు చెందిన సాయిచేతన ఎంపీసీలో 462 మార్కులు సాధించింది. గాయత్రి కళాశాలకు చెందిన కె.అనీల ఎంపీసీలో 462 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో కడప నగరానికి చెందిన శ్రీమేధా ‘వి’ విద్యార్థులు ఎం. విష్ణుఫణీంద్ర 485 మార్కులు, డి. మౌనిక 483 మార్కులు, బి. మానస 479, ఎస్. ఆదిల్ 473, రెడ్డినాగసాయి 472 మార్కులు సాధించారు. -
ఊరిస్తున్న ‘ఇంజినీరింగ్’ యోగం
ఎచ్చెర్ల: జిల్లా విద్యార్థులను నాలుగేళ్లుగా ఊరిస్తున్న ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల ప్రతిపాదనపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించి అన్నీ సక్రమంగా జరిగితే ‘రూసా’ నిధులతో వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కళాశాల ప్రారంభమయ్యే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల లేదు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఉండగా విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) క్యాంపస్ ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో కనీసం రెండు బ్రాంచ్‌లతోనైనా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని భావించింది. అయితే వసతి కొరత కారణంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. ఫలితంగా పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదవలేక, ఎక్కువ ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలల్లో చేరక తప్పడం లేదు. కాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతమ్ శిక్ష అభియాన్(రూసా)లో భాగంగా జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు రూ.65 కోట్ల మంజూరుకు సూత్రపాయంగా అంగీకరించింది. అయితే ‘రూసా’ ప్రతిపాదనలకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అనుమతి లభిస్తే వచ్చే విద్యా సంవత్సరంలోనే కళాశాల ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కాకినాడ జేఎన్టీయూ ప్రభుత్వాన్ని కోరింది. మరోపక్క స్థానిక బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కూడా తమకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం వర్సిటీ సమీపంలో ఉన్న 21వ శతాబ్ది గరుకుల భవనాలను తమకు అప్పగిస్తే వసతి కొరత సమస్య పరిష్కారం అవుతుందని, దీం తో పాటు అన్ని విశ్వవిద్యాలయాలు ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న విషయాన్ని సైతం ఇక్కడి అధికారులు ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ముందుగా రూసా నిధులు అధికారికంగా మంజూరైతే ఇంజినీరింగ్ కళాశాలల ఎక్కడ ప్రారంభించాలన్న అంశంపై స్పష్టత రావచ్చు. కళాశాల ఏర్పాటైతే కనీసం మూడు బ్రాంచ్‌లు అందుబాటులోకి వచ్చి, 180 మంది విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. ప్రభుత్వ కళాశాల మంజూరైతే ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించే విద్యార్థులకు విజయనగరం, విశాఖపట్నం, తూర్పగోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లాల్సిన బాధ తప్పుతుంది. -
మెడిసిన్‌లో మెరిశారు
- రాష్ట్రస్థాయిలో 4, 10, 11, 21వ ర్యాంకుల సాధన - జిల్లా గౌరవాన్ని నిలబెట్టిన విద్యార్థులు - ఐఐటీపై దృష్టితో చేజారిన ఇంజినీరింగ్ ర్యాంకులు - ఇంజినీరింగ్ తొలి పది స్థానాల్లో జిల్లాకు దక్కని చోటు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల ప్రవేశ పరీక్ష(ఎంసెట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మే 22న జరిగిన ఎంసెట్‌కు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 25,548 మంది విద్యార్థుల్లో 24,264 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 19,171 మంది, మెడిసిన్‌కు 5,093 మంది ఉన్నారు. సోమవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో తొలి పదిస్థానాల్లో మెడిసిన్ విభాగంలో జిల్లాకు 4,10 ర్యాంకులు దక్కగా, ఇంజినీరింగ్‌లో ఏ ఒక్క ర్యాంకూ లభించకపోవడం విద్యార్థులను నిరాశ పరిచింది. మెడిసిన్ విభాగంలో గుంటూరు శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థిని దారపనేని హరిత రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, తెనాలికి చెందిన ఘంటా సాయి నిఖిల 10వ ర్యాంకు సాధించింది. ఈమె విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. అదే విధంగా శ్రీచైతన్య విద్యార్థి నీలి రంగసాయి అనిరుధ్ 11వ ర్యాంకు, భాష్యం విద్యాసంస్థల విద్యార్థి వై.వరుణ్‌తేజ 21వ ర్యాంకు, షేక్ నబీ దరియావలి 35వ ర్యాంకు, డి.వంశీ సాయి ప్రవీణ్ 39వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో భాష్యం విద్యార్థి ఎం.రఘుశ్రావణ్ 15వ ర్యాంకు, శ్రీచైతన్య విద్యార్థులు బి.ఎ.ఎస్.ఎస్.ప్రశాంత్ 22వ ర్యాంకు, వై.హరతేజ 48వ ర్యాంకు సాధించారు.ఐఐటీపైనే ఆశలు పెట్టుకున్న విద్యార్థులు.: ఐఐటీ ల్లో సీట్లను సాధించడమే లక్ష్యంగా జేఈఈ-మెయిన్స్‌కు సన్నద్ధమైన విద్యార్థులు ఎంసెట్‌పై దృష్టి కేంద్రీకరించకపోవడంతోనే ఇంజినీరింగ్‌లో ర్యాంకులు తగ్గిన ట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన జేఈఈ-మెయిన్స్ ఫలితా ల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు సై తం ఎంసెట్‌లో ర్యాంకులు సాధించకలేకపోవడమే ఇం దుకు నిదర్శనం. జాతీయస్థాయిలో పేరు గాంచిన ఐఐ టీల్లో సీటు సాధించే లక్ష్యంతో చదివిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంసెట్‌లో ర్యాంకులు సాధించలేకపోయారు. 14 నుంచి ఆన్లైన్లో ర్యాంకు కార్డులు ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ర్యాంకు కా ర్డులను ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన ఆన్లైన్లో పొం దపర్చనుంది. విద్యార్థులు అదే రోజు సాయంత్రం నుం చి ఎంసెట్ వెబ్సైట్ ద్వారా ర్యాంకు కార్డులను పొందవచ్చు. ఈ నెల 14 నుంచి మెడిసిన్ కౌన్సెలింగ్, 29వ తేదీన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నాయి. -
ప్రమాణాలకే పెద్దపీట
జిల్లా విద్యార్థులు 2014-15 విద్యాసంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో విద్యాసంబరాలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. నవ రాష్ట్రావిర్భావ సందర్భంగా తెలంగాణ వేడుకలు నిర్వహించనున్నారు. మరో వైపు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మౌళిక వసతులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ఉపాధ్యాయుల కొరత తదితర సమస్యలను అధిగమించేందుకు ఎలాంటి ప్రణాళికతో వెళ్తారన్న అంశాలపై డీఈవో డాక్టర్ వై. చంద్రమోహన్ ‘న్యూస్‌లైన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు ఇలా... -న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ విద్యావిభాగం ప్రశ్న : పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు మీ ప్రణాళిక ఏమిటి..? జవాబు..: జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచే పాఠశాలలు, ఆవరణ, టాయిలెట్స్, పరిసరాలు శుభ్రం చేయాలని, వంటపాత్రలు కడగాలని ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలల్లో పండుగ వాతావరణం కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హెచ్.ఎం.లకు ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకున్నాం. ప్ర..: బడిబయటి పిల్లలను చేర్పించేందుకు తీసుకుంటున్న చర్యలు..? జ..: ఇప్పటికే బడిబయటి పిల్లల వివరాలను సేకరించాం. నేటి నుంచి ప్రతీ టీచరూ వారి పాఠశాల పరిసరాలలలో, గ్రామాలలో స్థానిక యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధుల సహకారంతో బడిబయటి పిల్లలను గుర్తిస్తూ వారిని స్కూళ్లలో చేర్పించే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్ర ..: జిల్లాలో ఉపాధ్యాయులు లేని పాఠశాలల పరిస్థితి ఏంటి..? జ..: జిల్లాలో 235 స్కూళ్లలో ఉపాధ్యాయులు లేరు. టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి అక్కడికి కొందరిని పంపుతాం. ఈ మేరకు ఎంఇఓలకు సూచించాం. సుమారు 700 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఆ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్తే పక్క పాఠశాల నుంచి ఉపాధ్యాయుడిని పంపించి తరగతులు కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్ర..: ఏటా పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది పరిస్థితి ఏవిధంగా ఉంది..? జ..: ఈ విద్యాసంవత్సరానికి 33లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటికే 30లక్షల పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. వాటిని అన్ని మండల కేంద్రాలకు పంపించాం. పునఃప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్ర..: మారిన పాఠ్యాంశాల ప్రకారం బోధనకు టీచర్లు సన్నద్ధంగా ఉన్నారా..? జ..: విద్యాశాఖ ఈ సంవత్సరం పదో తరగతి పాఠ్యాంశాలను మార్చింది. రాష్ట్ర అధికారుల ఆదేశానుసారం కొత్త పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ప్ర..: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మీ చర్యలేమిటి..? జ ..: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు కమిటీలు వేస్తాం. అన్ని చోట్ల ఫీజులు ఒకే విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. అతిక్రమించిన పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తాం. ప్ర..: మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేవు.. ఏవిధంగా అధిగమిస్తున్నారు..? జ..: జిల్లాలో 3,900 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతుంది. తొలి విడతగా 1,281 పాఠశాలల్లో కిచెన్‌షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికి 90శాతం పూర్తయ్యాయి. రెండో విడతలో మం జూరైన వంట గధుల నిర్మాణం కూడా తు ది దశలో ఉంది. నిర్మాణం ప్రారంభించని వాటికి వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్ర..: సంఖ్యను పెంచేచర్యలు..? జ..: విశాలమైన గధులు అహ్లాదకరమైన వాతావరణంలో బోధన ఉంటుంది. ప్ర భుత్వ పాఠశాలల్లోనే ప్రమాణాలతో కూ డిన విద్యనందిస్తామనేది చెప్పి, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తాం. -
పది ఫలితాల్లో అ‘ద్వితీయం’
వైవీయూ, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తీర్ణతా శాతంలో రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. గురువారం విడుదలైన ఫలితాల్లో జిల్లా 95.14 శాతం ఫలితాలతో రాష్ట్రంలో రెం డోస్థానం, రాయలసీమలో ప్రథమస్థా నం కైవసం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు 32,898 మంది హాజరుకాగా 31,300 మంది ఉత్తీర్ణులై 95.14 శా తం ఫలితాలు సాధించారు. బాలుర విభాగంలో 16,893 మందికి గాను 15, 941 మంది ఉత్తీర్ణులై 94.36 శాతం ఫలి తాలు సాధించారు. అలాగే బాలికల విభాగంలో 16,005 మందికి గాను 15,359 మంది ఉత్తీర్ణత సాధించి 95.96 శాతం ఫలితాలతో బాలుర కంటే పైచే యి సాధించారు. అయితే గత సంవత్స రం రాష్ట్రస్థాయిలో 3వ స్థానం పొందిన జిల్లా ఈ సారి ఒక మెట్టుపెకైక్కి రెండో స్థానంలో నిలిచింది. అదే విధంగా ఉత్తీర్ణతా శాతంలో సైతం గతంలో కంటే రెం డు శాతం మెరుగుదల సాధించడం విశే షం. కాగా రాయలసీమలో కర్నూలు జి ల్లా 93.23 శాతం (5వ స్థానం), చిత్తూరు జిల్లా 92.8 శాతం (7వ స్థానం), అనంతపురం జిల్లా 87.62 (17వ స్థానం) శాతం ఫలితాలతో తర్వాత స్థానంలో నిలిచా యి. ఫలితాల కోసం ఇంటర్నెట్ కేంద్రాల వద్ద గురువారం ఉదయం నుంచి విద్యార్థుల కోలాహలం కనిపించింది. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వీటితో పాటు జిల్లాలోని 23 కస్తూర్బా పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించడం గమనార్హం. అలా గే సీమాంధ్రలో ఉన్న ఒకే ఒక్క వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ సైతం 100 శాతం ఫలితాలు సాధించి అటు క్రీడల్లోనూ, ఇటు చదువులోనూ తమకు తిరుగులేదని చాటిచెప్పింది. కడపలో రీవెరిఫికేషన్ సౌకర్యం.. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకునే వారు 500 రూపాయల డీడీ తీసి హైదరాబాద్ డీజీ ఆఫీసుకు, రీవెరిఫికేషన్ కోసం వెయ్యి రూపాయల డీడీ తీసి కడప డీఈఓ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 16 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే వెలువడిన ఫలితాలకు సంబంధించిన మార్కుల జాబితాలు పది రోజుల్లో రానున్నట్లు అధికారులు తెలిపారు. డీఈఓ అంజయ్య ఏమంటున్నారంటే... సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగిన సమయంలోనూ పదోతరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చూపిన ఆదరణ, ప్రత్యేక తరగతుల నిర్వహణే నేటి ఫలితాలకు నాంది. జిల్లా వ్యాప్తంగా ఏడాది పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పడ్డ కష్టానికి ఫలితం లభించిం ది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్‌తో పాటు సందేహాలు నివృత్తి చేశాం. కలెక్టర్ కోన శశిధర్ సూచనలు, సలహాలు పాటించాం. మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తూ వచ్చాం. వీటితో పాటు డీసీఈబీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేసిన నిపుణులతో రూపొందించిన స్టడీమెటీరియల్ ఉపయోగపడింది. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులందరికీ ప్రత్యేక అభినందనలు. -
అమ్మాయిలే ఫస్ట్
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయభేరి మోగించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో మూడు నెలలు చదువుకు అంతరాయం కలిగినా మొక్కవోని దీక్షతో మెరుగైన ఫలితాలు సాధించారు. గత ఏడాదితో పోలిస్తే 2 శాతం అధికంగా 66.85 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. జిల్లాలో ఈ ఏడాది 30,341 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 20,122 మంది ఉత్తర్ణులు కావడంతో రాష్ట్రంలో జిల్లాకు ఏడవ స్థానం దక్కింది. 61 శాతం ఉత్తీర్ణతతో గత ఏడాది జిల్లా 9వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది బాలురు 16,751 మంది పరీక్ష రాయగా 10,374 మంది.. బాలికలు 13,590 మంది పరీక్ష రాయగా 9,748 మంది ఉత్తీర్ణులై పైచేయి సాధించారు. ఓకేషనల్ కోర్సులో 2,794 మందికి గాను 1,936 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 7,023 మంది విద్యార్థుల్లో 4,556 మంది (65 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 3,829 మందికి గాను 2,440 (63.72 శాతం), బాలికలు 3,194 మందికి గాను 2,116 (66.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ కాలేజీల్లో 1,822 మందికి గాను 972 మంది (53 శాతం) ఉత్తీర్ణులవగా.. బాలురు 470 (47.05 శాతం), బాలికలు 502 (61 శాతం) మంది ఉత్తీర్ణత నమోదు చేసుకున్నారు. వొకేషనల్ ఎయిడెడ్ కాలేజీల్లో మొత్తం 259 మందికి గాను 175 మంది (68 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ వొకేషనల్ కాలేజీల్లో 1,480 మందికి గాను 1,217 మంది (82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అన్ని విభాగాలు, బ్రాంచ్‌లు, మేనేజ్మెంట్లలో బాలుర కన్నా బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులవడం విశేషం. సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉత్తమ ప్రతిభ కనబర్చాయి. సాధారణ విద్యార్థులతో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు మెరుగైన ఫలితాలు నమోదు చేసుకున్నాయి. పాములపాడు జూనియర్ కళాశాల 98.90 శాతం, కోసిగి 92.68 శాతం, గోనెగండ్ల కళాశాల 89.07 శాతం, కోయిలకుంట్ల 87.85 శాతం, బండిఆత్మకూరు కళాశాల 84.52 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్ కాలేజీల్లో బేతంచర్లలోని పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల 69.61 శాతం, కర్నూలులోని సెయింట్జోసఫ్స్ జూనియర్ కళాశాల 64.73 శాతం, చాగలమర్రిలోని ఎస్వీఎంవీఎస్ఆర్ కళాశాల 63.57 శాతం ఉత్తీర్ణత దక్కించుకున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల హవా ఇంటర్ ఫలితాల్లో మరోసారి కార్పొరేట్, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు ఎంపీసీలో ఆర్.మౌనిక, ఎ.హరీష్ 985, ఎం.నాగమహతి 983, బి.కావ్య 982 మార్కులు, బైపీసీలో ఆర్.కీర్తన 984, పి.ఫాతిమా 983, జి.దివ్య 982, జి.షైని ప్రియాంక 980 మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో నారాయణ కళాశాలకు చెందిన ఎ.సుష్మిత 987, కె.వంశీకృష్ణ 986, జి.రాగశ్రీ, అప్షాన్ జబీన్షేక్ 985, పి.శ్రావ్య, జె.సుమశ్రీ, కె.సాగరిక 983, ఎం.శ్రీహర్ష 982, వై.సమీనాబాను, వి.సాయి ఐశ్వరయ్య, పి.అరవిందకుమార్‌రెడ్డి, కె.భారతి 981 మార్కులు సాధించారు. బైపీసీలో ఎస్.జువేరియా 987, బి.సాయిస్నిగ్దారెడ్డి, నిలోఫర్ ఉన్నీసా 984, శ్రీనాథ్‌రెడ్డి 982, ఎం.సంహిత, ఎన్.తహ్మినదలియా 980 మార్కులతో ప్రతిభ కనబరిచారు. శ్రీ కృష్ణ జూనియర్ కళాశాలకు చెందిన టి.చైత్ర ఎంపీసీలో 980 మార్కులు సాధించగా.. ఎంఈసీలో మాస్టర్స్ మైండ్స్ కళాశాల విద్యార్థిని ఎ.అనూష 981 మార్కులు దక్కించుకున్నారు. కర్నూలులోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ విద్యార్థిని ఎన్.మౌనిక 984 మార్కులు సాధించారు. 25 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని ఆర్ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు రూ.290, దరఖాస్తు రూ.10లతో కలిపి మొత్తం రూ.300 చెల్లించాలన్నారు. రీ వెరిఫికేషన్‌కు రూ.600, రీ కౌంటింగ్‌కు ప్రతి పేపర్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
అద్వితీయ ఫలితాలు..!
వైవీయూ, న్యూస్‌లైన్ : శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 65 శాతం ఫలితాలతో వైఎస్ఆర్ జిల్లా రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 62 శాతం ఫలితాలతో 10వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ యేడాది మరో మూడు శాతం ఫలితాలు సాధించి 9వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా జనరల్ విభాగంలో 19,645 మందికి గాను 12,815 మంది పాసై 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 10,061 మందికి గాను 6,162 మంది పాసై 61 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికల విభాగంలో 9,584 మందికి గాను 6,653 మంది పాసై 69 శాతం ఉత్తీర్ణత సాధించి తమదే పైచేయి అనిపించారు. ఒకేషనల్ విభాగంలో 1493 మందికి గాను 986 మంది పాసై 66 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ర్టంలో 8వ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో 670 మందికి గాను 416 మంది పాసై 62 శాతం, బాలికల విభాగంలో 823 మందికి గాను 570 మంది పాసై 69 శాతం ఫలితాలు సాధించారు. మంచి ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాలలు.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 3,210 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 2280 మంది పాసై 71 శాతం ఫలితాలను సాధించారు. బాలుర విభాగంలో 1267 మందికి గాను 862 మంది పాసై 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే బాలికల విభాగంలో 1943 మందికి గాను 1418 మంది పాసై 72.9 శాతం ఫలితాలు సాధించారు. అలాగే జిల్లాలోని యర్రగుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల 100 శాతం, వీరబల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 90 శాతం, చిన్న ఓరంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల 88 శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచాయి. ఎయిడెడ్ కళాశాలల్లో 3327 మందికి గాను 2261 మంది పాసై 68 శాతం ఫలితాలు సాధించారు. ఎయిడెడ్ కళాశాలల్లో పుల్లంపేట ఎస్‌బీవీడీ జూనియర్ కళాశాల 90 శాతం, బీమఠం వీరబ్రహ్మేంద్ర కళాశాల 89 శాతం, సుండుపల్లె ఎన్కేఆర్ కళాశాల 88 శాతం ఫలితాలు సాధించాయి. సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలల్లో 747 మందికి గాను 674 మంది ఉత్తీర్ణులై 90 శాతం ఫలితాలు సాధించారు. ఒకేషనల్ విభాగంలో కడప సెయింట్‌జోసఫ్ జూనియర్ కళాశాల, పులివెందుల ప్రభుత్వ జూనియర్ కళాశాల 95 శాతం ఫలితాలు సాధించారు. రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 93 శాతం, పోరుమామిళ్ల జూనియర్ కళాశాల 90 శాతం ఫలితాలు సాధించాయి. టాపర్లుగా జిల్లా విద్యార్థులు.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో ప్రొద్దుటూరు అభ్యాస్ కళాశాలకు చెందిన విద్యార్థిని స్నేహ 988 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. అలాగే కడప నారాయణ జూనియర్‌కళాశాలకు చెందిన వి. పద్మిని 987 మార్కులు సాధించడంతో పాటు జేఈఈ మెయిన్స్‌లో సైతం 231 మార్కులతో టాపర్‌గా నిలిచింది. అలాగే ఆర్. అమృతవర్ధిని 983, రంగప్రతసింగ్ 983 మార్కులతో ఎంపీసీ విభాగంలో టాపర్లుగా నిలిచారు. అలాగే బైపీసీ విభాగంలో నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన టి. కృష్ణార్శిత 978 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ఈమెతో పాటు సి. సుప్రియ 972, పి.చరిత్కాంత్ 969 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఎంఈసీ విభాగంలో ప్రొద్దుటూరు మాస్టర్స్ కళాశాలకు చెందిన రవీంద్ర 972 మార్కులు, కడప శ్రీమేధా ‘వి’కళాశాలకు చెందిన జె.బి.ఎన్. మూర్తి 968 మార్కులతో టాపర్‌గా నిలిచారు. అలాగే జిల్లాకు చెందిన ఇరువూరి హరికృష్ణ సీఈసీ గ్రూపులో 963 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథముడుగా నిలిచాడు.