అద్వితీయ ఫలితాలు..! | intermediate exams results sucessful | Sakshi
Sakshi News home page

అద్వితీయ ఫలితాలు..!

Published Sun, May 4 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

intermediate exams  results sucessful

 వైవీయూ, న్యూస్‌లైన్ : శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 65 శాతం ఫలితాలతో వైఎస్‌ఆర్ జిల్లా రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచింది.
 
 గత సంవత్సరం 62 శాతం ఫలితాలతో 10వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ యేడాది మరో మూడు శాతం ఫలితాలు సాధించి 9వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా జనరల్ విభాగంలో 19,645 మందికి గాను 12,815 మంది పాసై  65 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 10,061 మందికి గాను 6,162 మంది పాసై 61 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికల విభాగంలో 9,584 మందికి గాను 6,653 మంది పాసై 69 శాతం ఉత్తీర్ణత సాధించి తమదే పైచేయి అనిపించారు. ఒకేషనల్ విభాగంలో 1493 మందికి గాను 986 మంది పాసై 66 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ర్టంలో 8వ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో 670 మందికి గాను 416 మంది పాసై 62 శాతం, బాలికల విభాగంలో 823 మందికి గాను 570 మంది పాసై 69 శాతం ఫలితాలు సాధించారు.
 
 మంచి ఫలితాలు సాధించిన ప్రభుత్వ
 కళాశాలలు..
 జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 3,210 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 2280 మంది పాసై 71 శాతం ఫలితాలను సాధించారు. బాలుర విభాగంలో 1267 మందికి గాను 862 మంది పాసై 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే బాలికల విభాగంలో 1943 మందికి గాను 1418 మంది పాసై 72.9 శాతం ఫలితాలు సాధించారు.
 
 అలాగే జిల్లాలోని యర్రగుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల 100 శాతం, వీరబల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 90 శాతం, చిన్న ఓరంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల 88 శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచాయి.  ఎయిడెడ్ కళాశాలల్లో 3327 మందికి గాను 2261 మంది పాసై 68 శాతం ఫలితాలు సాధించారు. ఎయిడెడ్ కళాశాలల్లో పుల్లంపేట ఎస్‌బీవీడీ జూనియర్ కళాశాల 90 శాతం, బీమఠం వీరబ్రహ్మేంద్ర కళాశాల 89 శాతం, సుండుపల్లె ఎన్‌కేఆర్ కళాశాల 88 శాతం ఫలితాలు సాధించాయి. సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలల్లో 747 మందికి గాను 674 మంది ఉత్తీర్ణులై 90 శాతం ఫలితాలు సాధించారు. ఒకేషనల్ విభాగంలో కడప సెయింట్‌జోసఫ్ జూనియర్ కళాశాల, పులివెందుల ప్రభుత్వ జూనియర్ కళాశాల 95 శాతం ఫలితాలు సాధించారు. రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 93 శాతం, పోరుమామిళ్ల జూనియర్ కళాశాల 90 శాతం ఫలితాలు సాధించాయి.
 
 టాపర్‌లుగా జిల్లా విద్యార్థులు..
 ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో ప్రొద్దుటూరు అభ్యాస్ కళాశాలకు చెందిన విద్యార్థిని స్నేహ 988 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. అలాగే కడప నారాయణ జూనియర్‌కళాశాలకు చెందిన వి. పద్మిని 987 మార్కులు సాధించడంతో పాటు జేఈఈ మెయిన్స్‌లో సైతం 231 మార్కులతో టాపర్‌గా నిలిచింది. అలాగే ఆర్. అమృతవర్ధిని 983, రంగప్రతసింగ్ 983 మార్కులతో ఎంపీసీ విభాగంలో టాపర్‌లుగా నిలిచారు.
 
 అలాగే బైపీసీ విభాగంలో నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన టి. కృష్ణార్శిత 978 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ఈమెతో పాటు సి. సుప్రియ 972, పి.చరిత్‌కాంత్ 969 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఎంఈసీ విభాగంలో ప్రొద్దుటూరు మాస్టర్స్ కళాశాలకు చెందిన రవీంద్ర 972 మార్కులు, కడప శ్రీమేధా ‘వి’కళాశాలకు చెందిన జె.బి.ఎన్. మూర్తి 968 మార్కులతో టాపర్‌గా నిలిచారు. అలాగే జిల్లాకు చెందిన ఇరువూరి హరికృష్ణ సీఈసీ గ్రూపులో 963 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథముడుగా నిలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement