వైవీయూ, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తీర్ణతా శాతంలో రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. గురువారం విడుదలైన ఫలితాల్లో జిల్లా 95.14 శాతం ఫలితాలతో రాష్ట్రంలో రెం డోస్థానం, రాయలసీమలో ప్రథమస్థా నం కైవసం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు 32,898 మంది హాజరుకాగా 31,300 మంది ఉత్తీర్ణులై 95.14 శా తం ఫలితాలు సాధించారు.
బాలుర విభాగంలో 16,893 మందికి గాను 15, 941 మంది ఉత్తీర్ణులై 94.36 శాతం ఫలి తాలు సాధించారు. అలాగే బాలికల విభాగంలో 16,005 మందికి గాను 15,359 మంది ఉత్తీర్ణత సాధించి 95.96 శాతం ఫలితాలతో బాలుర కంటే పైచే యి సాధించారు. అయితే గత సంవత్స రం రాష్ట్రస్థాయిలో 3వ స్థానం పొందిన జిల్లా ఈ సారి ఒక మెట్టుపెకైక్కి రెండో స్థానంలో నిలిచింది. అదే విధంగా ఉత్తీర్ణతా శాతంలో సైతం గతంలో కంటే రెం డు శాతం మెరుగుదల సాధించడం విశే షం.
కాగా రాయలసీమలో కర్నూలు జి ల్లా 93.23 శాతం (5వ స్థానం), చిత్తూరు జిల్లా 92.8 శాతం (7వ స్థానం), అనంతపురం జిల్లా 87.62 (17వ స్థానం) శాతం ఫలితాలతో తర్వాత స్థానంలో నిలిచా యి. ఫలితాల కోసం ఇంటర్నెట్ కేంద్రాల వద్ద గురువారం ఉదయం నుంచి విద్యార్థుల కోలాహలం కనిపించింది. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వీటితో పాటు జిల్లాలోని 23 కస్తూర్బా పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించడం గమనార్హం. అలా గే సీమాంధ్రలో ఉన్న ఒకే ఒక్క వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ సైతం 100 శాతం ఫలితాలు సాధించి అటు క్రీడల్లోనూ, ఇటు చదువులోనూ తమకు తిరుగులేదని చాటిచెప్పింది.
కడపలో రీవెరిఫికేషన్ సౌకర్యం..
పదో తరగతి పరీక్షలకు సంబంధించిన రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకునే వారు 500 రూపాయల డీడీ తీసి హైదరాబాద్ డీజీ ఆఫీసుకు, రీవెరిఫికేషన్ కోసం వెయ్యి రూపాయల డీడీ తీసి కడప డీఈఓ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 16 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే వెలువడిన ఫలితాలకు సంబంధించిన మార్కుల జాబితాలు పది రోజుల్లో రానున్నట్లు అధికారులు తెలిపారు.
డీఈఓ అంజయ్య ఏమంటున్నారంటే...
సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగిన సమయంలోనూ పదోతరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చూపిన ఆదరణ, ప్రత్యేక తరగతుల నిర్వహణే నేటి ఫలితాలకు నాంది. జిల్లా వ్యాప్తంగా ఏడాది పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పడ్డ కష్టానికి ఫలితం లభించిం ది.
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్‌తో పాటు సందేహాలు నివృత్తి చేశాం. కలెక్టర్ కోన శశిధర్ సూచనలు, సలహాలు పాటించాం. మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తూ వచ్చాం. వీటితో పాటు డీసీఈబీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేసిన నిపుణులతో రూపొందించిన స్టడీమెటీరియల్ ఉపయోగపడింది. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులందరికీ ప్రత్యేక అభినందనలు.
పది ఫలితాల్లో అ‘ద్వితీయం’
Published Fri, May 16 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement
Advertisement