ఎంసెట్ ప్రశాంతం | Eamcet exam done sucessfully | Sakshi
Sakshi News home page

ఎంసెట్ ప్రశాంతం

Published Mon, May 16 2016 9:23 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Eamcet exam done sucessfully

ఇంజనీరింగ్‌లో 96.6, మెడిసిన్‌లో 93.9 శాతం హాజరు
నల్లగొండ టూటౌన్/కోదాడ : జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎంసెట్-2016 ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ, కోదాడ పట్టణాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్షలకు 14,754 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా..14,106 మంది మాత్రమే హాజరయ్యారు. 648 మంది గైర్హాజరయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన ఉండడంతో అభ్యర్థులు  సకాలంలోనే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. రెండు పట్టణాల్లో కలిపి ఇంజనీరింగ్‌లో 96.6 శాతం, మెడిసిన్‌లో 93.9 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
 
 నల్లగొండలో...
 పట్టణంలో 15 సెంటర్లలో జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు 6,972 మంది విద్యార్థులకు గాను 6,751 మంది హాజరు కాగా.. 221 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ విభాగంలో 4,447 మంది విద్యార్థులకు 4,241 మంది హాజరు కాగా.. 206 మంది పరీక్షకు హాజరు కాలేదు. కొన్ని సెంటర్లల్లో అధికారులు ప్యాడ్‌లను అనుమతించగా, ఎక్కువ సెంటర్లలో అనుమతించలేదు. ఎన్జీ, మహిళా డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను అదనపు జేసీ వెంకట్రావు సందర్శించి పరిశీలించారు. ఎంసెట్ స్పెషల్ ఆఫీసర్ ధర్మానాయక్, రీజినల్ కోఆర్డినేటర్ రావుల నాగేందర్‌రెడ్డి సైతం పరిశీలించిన వారిలో ఉన్నారు.  
 
 మొరాయించిన బయోమెట్రిక్ యంత్రాలు
 నల్లగొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఎంజీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ యం త్రాలు మొరాయించడంతో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఉదయం 9.45 గంటల సమయంలో ఆయా మిషన్లలో సాంకే తిక సమస్యలు తలెత్తడంతో స్పెషల్ ఆఫీసర్ ధర్మానాయక్ వెంటనే  సిబ్బందిని పంపించి సరిచేయించారు.
 
         ఇంజనీరింగ్   మెడిసిన్
 మొత్తం విద్యార్థులు    6,972       4,447
 పరీక్ష రాసిన వారు    6,751       4,241
 గైర్హాజరు        221         206
 
 టాప్ కాలేజీలో సీటు సాధిస్తా..
 ఎంసెట్ ఇంజనీరింగ్‌లో పరీక్ష పేపర్ కొంత కఠినంగానే వచ్చింది. టాప్ కాలేజీలో సీటు సాధిస్తాననే నమ్మకం ఉంది. పరీక్షను ఎలాంటి ఆందోళన, భయం లేకుండా రాశా. తెలిసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాశా.
 - మహేశ్‌రెడ్డి, శేరిబావిగూడెం, నార్కట్‌పల్లి
 
 కొంత సులభంగానే ఉంది..
 ఎంసెట్ పరీక్ష పేపర్ కొంత సులభంగానే ఉంది. మంచి ర్యాంక్ వస్తుందనే నమ్మకం ఉంది. టాప్ టెన్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందని ఆ శిస్తు న్నా. హైదరాబాద్‌లో సెంటర్లు దొరకక గందరగోళం ఎదుర్కోవాల్సి వస్తదని.. ఎంసెట్ రాయడానికి నల్లగొండ సెంటర్‌ను ఎంచుకున్నా.     
 - వేణి మాధురి, హైదరాబాద్  
 
 కోదాడలో...
 కోదాడ : కోదాడ కేంద్రంగా ఎనిమిది సెంటర్లలో ఎంసెట్ నిర్వహించారు. కోదాడ పట్టణంలో ఐదు..  చిలుకూరు, ఆకుపాముల, మునగాలలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసిన సెంటర్లలో ఇంజనీరింగ్ పరీక్ష జరిగిం ది. స్వల్ప అసౌకర్యాలు మినహా పరీ క్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంజనీరింగ్ విభాగంలో 2,150 మంది విద్యార్థులకు 2,062 మంది హాజరు కాగా.. 88 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా కోదాడలోని మూడు కేంద్రాల్లో మధ్యాహ్నం మెడికల్ విభాగంలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,185 మంది విద్యార్థులకు 1,052 మంది హాజరు కాగా.. 133 మంది గైర్హాజరయ్యారు. కోదాడ ప్రభుత్వ జూనియర్  కళాశాల సెంటర్‌లోని పలు గదుల్లో ఫ్యాన్లు లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
 బెంచీలపై దుమ్ము కూడా దులపలేదని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రంలో విద్యార్ధుల చేత మంచినీళ్లు పోయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మునగాల, ఆకుపాముల కేంద్రాల్లో మొదటిసారిగా పోటీ పరీక్ష నిర్వహిస్తుండడంతో తల్లిదండ్రులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు అక్కడికి అధిక సంఖ్యలో తరలివచ్చారు.  ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఐదుగురు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ అబ్దుల్ రషీద్‌తోపాటు ప్రత్యేక పరిశీలకులు, తహసీల్దార్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
 
 క్ర.సం    విభాగం       పరీక్షవ్రాసినవారు    ై గెర్హాజరు          మొత్తం
 1    ఇంజనీరింగ్        2062       88                2150
 2.             మెడికల్        1052      133                1185
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement