హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్-2016 పరీక్షను మే 2వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం అధికారికంగా విడుదలకానుంది. మే 2వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 వరకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష జరగనుంది.
ఈ నెల 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు స్వీకరణకు మార్చి 28వ తేదీ చివరి తేదీగా ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.250 రూపాయలు, ఇతరులకు రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు ఆన్లైన్లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తారు. రూ.500ల ఫైన్తో ఏప్రిల్ 3 వరకు, రూ.వెయ్యి ఫైన్తో ఏప్రిల్ 13, రూ.5వేల ఫైన్తో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 24 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం కల్పించనున్నారు. మే 3న ప్రాధమిక కీ విడుదల, మే 12న ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
మే 12న ఈ సెట్-2016
మార్చి 4వ తేదీన తెలంగాణ ఈ సెట్-2016 నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 9 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 12న ఈ సెట్ పరీక్ష, మే 23న ఫలితాలు వెల్లడించనున్నారు.